Tuesday, August 4, 2026
29.8 C
Hyderabad

Andhra Pradesh|ఆంధ్రప్రదేశ్‌లో New Districts|కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు

26 నుంచి 32 జిల్లాల పెంపు దిశగా ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉన్న జిల్లాల పరిమితులను పునఃపరిశీలిస్తూ, సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై Ministers Sub Committee|మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు ప్రారంభించింది. జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెంచే అవకాశాలపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజలకు జిల్లా కేంద్రాల దూరాన్ని తగ్గించడం, పాలనా సౌలభ్యం కల్పించడం ఈ వ్యూహంలో ప్రధాన ఉద్దేశ్యం.

సమాచారం ప్రకారం, కృష్ణా జిల్లా పరిధిలోని పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన ఉంది. అలాగే, ప్రస్తుతం ఒంగోలు జిల్లాలో ఉన్న అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను మళ్లీ ప్రకాశం జిల్లాలో చేర్చే యోచనలో ప్రభుత్వం ఉంది. కొత్తగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి వంటి కొత్త జిల్లాల ఏర్పాటు కూడా పరిగణనలో ఉంది. ఈ ప్రతిపాదనలతో పలు నియోజకవర్గాల పరిమితులు మారనున్నాయి.

ప్రతిపాదిత జిల్లాలు మరియు నియోజకవర్గాల జాబితా

1. పలాస జిల్లా – ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం

2. శ్రీకాకుళం జిల్లా – శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం

3. మన్యం పార్వతీపురం జిల్లా – పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ

4. విజయనగరం జిల్లా – విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి

5. విశాఖపట్నం జిల్లా – భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి

6. అల్లూరి సీతారామరాజు అరకు జిల్లా – అరకు, పాడేరు, మాడుగుల

7. అనకాపల్లి జిల్లా – అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని

8. కాకినాడ జిల్లా – కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రాపురం

9. తూర్పు గోదావరి రాజమహేంద్రవరం జిల్లా – రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం

10. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ అమలాపురం జిల్లా – అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట

11. పశ్చిమ గోదావరి నరసాపురం జిల్లా – తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం

12. ఏలూరు జిల్లా – ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం

13. కృష్ణా మచిలీపట్నం జిల్లా – కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు

14. ఎన్టీఆర్ విజయవాడ జిల్లా – విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, మైలవరం

15. అమరావతి జిల్లా – పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ

16. గుంటూరు జిల్లా – గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు

17. బాపట్ల జిల్లా – బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె, పర్చూరు

18. పల్నాడు నరసరావుపేట జిల్లా – నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ

19. మార్కాపురం జిల్లా – మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి

20. ఒంగోలు జిల్లా – ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొండెపి, కందుకూరు

21. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా – నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావాలి, కోవూరు, ఉదయగిరి

22. గూడూరు జిల్లా – గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట

23. శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా – తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి

24. చిత్తూరు జిల్లా – చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం

25. మదనపల్లి జిల్లా – మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి

26. సత్యసాయి హిందూపురం జిల్లా – హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర

27. అనంతపురం జిల్లా – అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపర్తి

28. ఆదోని జిల్లా – ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం

29. కర్నూలు జిల్లా – కర్నూలు, డోన్, నందికొట్కూరు, కోడుమూరు

30. నంద్యాల జిల్లా – నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం

31. వైఎస్సార్ కడప జిల్లా – కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల

32. అన్నమయ్య రాజంపేట జిల్లా – రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు

ప్రభుత్వం ప్రధానంగా జిల్లా కేంద్రాల దూరం తగ్గించి, గ్రామీణ ప్రజలకు సులభంగా పరిపాలన అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి జిల్లాలోని ప్రజలకు సమాన సేవలు అందేలా, మౌలిక సదుపాయాల విస్తరణకు వీలుగా ఈ పునర్వ్యవస్థీకరణ జరుగనుంది. త్వరలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై, కొత్త జిల్లాల తుది ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News