తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన ప్రారంభమైంది. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్, పరిశ్రమలు-ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం విస్తృత చర్చలు జరిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, హరిత ఇంధన కార్యక్రమాలు, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ పార్కుల ఏర్పాటు వంటి కీలక అంశాలపై భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడంపై దృష్టి సారించారు. పలు ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనలో భాగంగా, సింగపూర్ తరువాత దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. సింగపూర్ చేరుకున్న సీఎం రేవంత్‌కు అక్కడి తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు.

