Friday, October 2, 2026
24.4 C
Hyderabad

జయహో స్మిత్ మచ్చర్…ధైర్యానికి సెల్యూట్!|EDITORIAL

ఆకాశంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనుకున్న క్షణం.. ఓ కెప్టెన్‌ అసమాన ధైర్యం వందల ప్రాణాలకు రక్షణ కవచమైంది! తీవ్ర గాయాలు.. కాక్‌పిట్‌లో దాడి.. అదుపుతప్పుతున్న విమానం.. అయినా వెనుకడుగు వేయని స్మిత్ మచ్చర్! ప్రాణం కంటే ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యమిస్తూ తీసుకున్న నిర్ణయం పెను విషాదాన్ని తప్పించింది. ఆకాశంలో ఆయన చూపిన ధైర్యం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.

మార్గం – అడుగు, ఎడిటోరియల్

విమానం అంటేనే వందలాది ప్రాణాలను ఒకేసారి మోసుకెళ్లే బాధ్యత. అలాంటి సమయంలో ఊహించని ప్రమాదం ఎదురైతే ఒక్క క్షణం ఆలస్యం కూడా పెను విషాదానికి దారితీస్తుంది. అయితే దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన ధైర్యం, సమయస్ఫూర్తి ప్రపంచ విమానయాన చరిత్రలో గుర్తుండిపోయే ఘటనగా నిలిచింది. తీవ్రంగా గాయపడిన పరిస్థితిలోనూ తన ప్రాణాల గురించి ఆలోచించకుండా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ఆయన వృత్తిపట్ల ఉన్న నిబద్ధతను చాటిచెప్పింది.

సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనలో కో-పైలట్ కత్తితో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసినట్లు సమాచారం. అదే సమయంలో విమాన నియంత్రణ వ్యవస్థలకు ముప్పు ఏర్పడటంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. విమానం ఎత్తు వేగంగా తగ్గుతున్న సమయంలో తీవ్ర గాయాలతో ఉన్న కెప్టెన్ కాక్‌పిట్ తలుపును అన్‌లాక్ చేసి సహాయం కోసం సంకేతం ఇవ్వడం కీలకంగా మారింది. ఆ చర్య వల్ల ప్రయాణికులు, సిబ్బంది పరిస్థితిని గుర్తించి కాక్‌పిట్‌లోకి చేరగలిగారు. ఇజ్రాయెల్‌కు చెందిన ప్లంబర్ యానివ్ హయూన్, మరో ప్రయాణికుడు, డ్యూటీలో లేని పైలట్‌తో పాటు ఇతర సిబ్బంది కలిసి పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి సహకరించారు. అనంతరం విమానాన్ని సురక్షితంగా సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.

ఈ ఘటనలో మరో ముఖ్యమైన అంశం యానివ్ హయూన్ చూపిన చొరవ. విమానంలో లైట్లు ఆరిపోవడం, గాలి పీడనంలో మార్పును గుర్తించిన ఆయన కాక్‌పిట్ వైపు వెళ్లారు. లోపల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని గుర్తించి దాడికి పాల్పడుతున్న వ్యక్తిని నియంత్రించడంలో సహకరించారు. విమానం ఎత్తు తగ్గుతున్న సమయంలో కంట్రోల్ స్టిక్స్‌ను పట్టుకుని వెనక్కి లాగినట్లు ఆయన వెల్లడించారు. విమానాన్ని నడిపే ప్రత్యేక శిక్షణ తనకు లేకపోయినా, గతంలో చూసిన విమాన ప్రమాదాల కార్యక్రమాల ద్వారా పొందిన ప్రాథమిక అవగాహన ఆ క్షణంలో ఉపయోగపడిందని ఆయన చెప్పడం ఆసక్తికరం. అయితే ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో శిక్షణ పొందిన పైలట్లు, సిబ్బంది పాత్రే కీలకమని గుర్తించాలి.

గుజరాత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు కమర్షియల్ విమానయాన రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పైస్‌జెట్‌లో 2011 నుంచి 2022 వరకు పనిచేసిన ఆయన సీనియర్ కమాండర్, లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించారు. బోయింగ్ 737 విమానాలను 9,500 గంటలకు పైగా నడిపిన అనుభవం ఆయనకు ఉంది. 2022లో ఫ్లైదుబాయ్ లో చేరిన ఆయన అక్కడ కూడా విమాన కార్యకలాపాలు, పైలట్ల శిక్షణలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై భారత దౌత్య కార్యాలయం పర్యవేక్షణ కొనసాగిస్తోంది.

కెప్టెన్ మచ్చర్ ధైర్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయనను హీరోగా అభివర్ణించారు. అయితే ప్రశంసలకంటే ముఖ్యమైనది ఈ ఘటన నుంచి విమానయాన భద్రతపై నేర్చుకోవాల్సిన పాఠాలు. కాక్‌పిట్ భద్రత, సిబ్బంది మానసిక-వృత్తిపరమైన సిద్ధత, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

విమానంలో ఉన్న ప్రతి ప్రాణం పైలట్ చేతుల్లోనే కాదు.. మొత్తం వ్యవస్థ బాధ్యతలో ఉంటుంది. ఆ వ్యవస్థలో ఒక్కో వ్యక్తి తీసుకునే సరైన నిర్ణయం వందలాది ప్రాణాలను కాపాడగలదు. స్మిత్ మచ్చర్ అదే చేశారు. తీవ్ర గాయాల మధ్యనూ వెనుకడుగు వేయకుండా బాధ్యతను నిర్వర్తించిన ఆయన ధైర్యం నిజంగా అభినందనీయం. దర్యాప్తులో ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉన్నప్పటికీ, ఆ క్షణంలో ప్రాణాలను కాపాడేందుకు పలువురు చూపిన సమిష్టి ధైర్యం మాత్రం మానవత్వానికి గొప్ప ఉదాహరణ. జయహో స్మిత్ మచ్చర్.. మీ ధైర్యానికి హాట్సాఫ్!

 

Latest News

గురువుకు పూర్వ విద్యార్థుల అపూర్వ కానుక!?|ADUGU TRENDS

గురువంటే విద్యా బుద్ధులు నేర్పేవాడే కాదు. జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేవాడు. భావి భారతానికి బాటలు వేసే వాడు. గిట్లనే సదువుకుని ఎదిగిన, గీ ముచ్చట ఎరిగిన గా సదువుకున్న పొల్లగాండ్లు గా సారును...

అక్టోబర్ 02, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి షష్ఠి పగలు 12.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రోహిణి ఉదయం 07.20 వరకు ఉపరి మృగశిర యోగం వ్యతీపాత రాత్రి 09.54 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి పగలు 12.13 వరకు ఉపరి...

పాలిచ్చే ఏటీఎం!?|ADUGU TRENDS

అవుమల్ల.. గిప్పటిదాకా పైసలిచ్చే ఏటీఎంను సూసినం. గట్లనే టికెట్లనిచ్చే ఏటీఎంలను గూడ సూసినం. కానీ, గీ పాలిచ్చే ఏటీఎంను ఎక్కడైనా సూసినమా? కానీ, గా సిద్దిపేట జిల్ల గజ్వేల్ ఒకాయినె గీ పాల...

డ్రాగన్ తో గగనతల చర్చలు సఫలమయ్యేనా!?|EDITORIAL

భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువుల కంటే శాశ్వత ప్రయోజనాలే కీలకం. భారత్–చైనా సంబంధాల్లోనూ అదే వాస్తవికత పనిచేయాలి. విమానాలకు గగనతలం లభించడం తక్షణ ప్రయోజనం కావచ్చు. కానీ, రెండు దేశాల...

అక్టోబర్ 01, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి పంచమి పగలు 02.30 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం కృత్తిక ఉదయం 08.50 వరకు ఉపరి రోహిణి యోగం సిద్ది రాత్రి 12.57 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు 02.30 వరకు ఉపరి...

అమ్మకానికో ఊరు..! నీల్లిత్తే సాలు!?|ADUGU TRENDS

ఇప్పటిదాకా వస్తువులమ్మడం సూసినం. ఆస్తులనమ్మడం సూసినం. కానీ, ఊరినే అమ్మకానికి పెట్టడం ఎక్కడైనా సూసినమా? కానీ, గా ఊరును నిజంగనే గా ఊరోల్లు అమ్మకానికి పెట్టిండ్రు. గది కూడా వట్టి నీల్లకే!? గది మహారాష్ట్ర....

ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించడమే అసలైన పరీక్ష!|EDITORIAL

ఎల్‌నినో బలహీనపడాలని, సమయానుకూలం గా వర్షాలు కురవాలని కోరుకోవడం సహజమే. కానీ వాతావరణాన్ని మార్చలేం. దాని ప్రభావాన్ని తగ్గించే వ్యవసాయ విధానాలను మాత్రం ముందుగానే రూపొందించవచ్చు. ఇదే ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాలు, శాస్త్రవేత్తలు,...

సెప్టెంబర్ 30, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి చవితి సాయంత్రం 04.35 వరకు ఉపరి పంచమి నక్షత్రం భరణి ఉదయం 10.08 వరకు ఉపరి కృత్తిక యోగం హర్షణ ఉదయం 06.37 వరకు ఉపరి వజ్ర కరణం బాలవ సాయంత్రం 04.35 వరకు ఉపరి...

తెలంగాణలో… కమల వికాసం కలేనా!?|TELANGANA|BJP

రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు ఉందా? కాషాయంలో అంతర్గత కలహాలు! కావాల్సిన కసరత్తేది? కార్యాచరణేది? పార్టీకి సత్తువెక్కడ? సమన్వయం ఎక్కడ? సీనియర్లకు, కార్యకర్తలకు గుర్తింపేది? సమీక్షలున్నాయా? సవరింపులున్నాయా? పెరుగుతున్న పార్టీకి... పెరగని గ్రామీణ బలం! కేంద్ర పదవులు... రాష్ట్రానికి ఉపయోగమేనా? బూత్ కమిటీలు ఉన్నాయా? పనిచేస్తున్నాయా? కొత్త...

ఇంద్రుడి మీద న్యాయమూర్తికి ఫిర్యాదు!?|ADUGU TRENDS

వాన దేవుడు వానలు కురిపిత్తరని మనం నమ్ముతం. గా వానాకాలం, సలికాలం, ఎండాకాలమని ఓ లెక్క పకారం వత్తయి. గీ మద్దెల గయి కూడా లెక్క తప్పినయి. పడితే ఒకటే వాన.. లేకపోతే...

మాటలు మంటలు రేపితే.. యుద్ధం ఎక్కడ ఆడుతుంది.!?|EDITORIAL

శాంతి చర్చలు సాగాల్సిన వేళ.. అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. క్షిపణుల హెచ్చరికలతో ప్రపంచం వణుకుతోంది.. చమురు ధరలు కదులుతున్నాయి.. ఆర్థిక వ్యవస్థలు ఆందోళనలో పడుతున్నాయి. ఒకవైపు సైనిక ఒత్తిడి.....

సెప్టెంబర్ 29, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సంకటహర చతుర్థి తిధి బ తదియ సాయంత్రం 06.25 వరకు ఉపరి చవితి నక్షత్రం అశ్విని ఉదయం 11.09 వరకు ఉపరి భరణి యోగం వ్యాఘాత ఉదయం 09.07 వరకు ఉపరి హర్షణ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News