నాగార్జున సాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల భద్రత తొలగించి, ఎస్పీఎఫ్ బలగాలకు అప్పగించారు. 2023 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగిన జలవివాదం కారణంగా కేంద్ర ప్రభుత్వం డ్యాం భద్రతను సీఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తీవ్ర స్థాయికి చేరడంతో కేంద్రం జోక్యం చేసుకుంది. అప్పట్లో ఆ ప్రాంత భద్రత సీఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించి, డ్యాం వద్ద శాంతిని కాపాడే చర్యలు చేపట్టింది.
తాజాగా, ఈ వివాదం తగ్గుముఖం పట్టడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డ్యాం భద్రతను ఎస్పీఎఫ్ బలగాలకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. డ్యాం వద్ద భద్రతను ఎస్పీఎఫ్ బలగాలు పర్యవేక్షిస్తాయని, ఈ మార్పుతో భద్రతాపరంగా ఎటువంటి సమస్యలు తలెత్తవని అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాద పరిష్కారానికి మార్గం సుగమమవుతుందని కేంద్రం భావిస్తోంది.

