జగన్ జర్మనీ వెళ్లి రావాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రతిపక్ష హోదా చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ ఇచ్చేది కాదన్నారు. ఏపీ ప్రజలు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కి 11 సీట్లు వస్తే జనసేనకు 21 సీట్లు వచ్చాయి అంటే అసెంబ్లీ లో రెండవ అతిపెద్ద పార్టీ జనసేన అని చెప్పారు. ఓట్లు ఎక్కువశాతం వస్తె వాళ్ళకు ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం జర్మనీలో ఉంటుంది. కావాలంటే వైఎస్ఆర్సీపీ జర్మనీకి వెళ్ళవచ్చని అన్నారు. గవర్నర్ ప్రసంగం గురించి మాట్లాడుతూ…..గవర్నర్ నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ రోజు అసెంబ్లీ ని ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు హుందాగా ప్రవర్తించాల్సిందన్నారు.

