Sunday, August 9, 2026
26.1 C
Hyderabad

ASIA CUP|ఆసియా కప్‌లో BHARATH|భారత్ WIN|ఘనవిజయం

PAKISTAN|పాకిస్థాన్‌పై ఏకపక్ష విజృంభణ

ఆసియా కప్‌–2025లో దాయాదుల సమరం మరలా భారత్ ఆధిపత్యాన్ని చాటింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అన్ని విభాగాల్లో సత్తా చాటిన భారత జట్టు 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో భారత్ సూపర్–4లో దాదాపు స్థానం ఖరారు చేసుకుంది. మరోవైపు పాకిస్థాన్ ఆటగాళ్లు బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యారు.

ముందుగా టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్ల ముందు వాళ్ల బ్యాటర్లు తేలిపోయారు. ఇన్నింగ్స్ తొలి బంతికే సయిమ్ అయూబ్‌ను హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కి పంపాడు. ఆరంభంలోనే పాకిస్థాన్ దెబ్బతింది. తర్వాత ఫామ్‌లో ఉన్న మహ్మద్ హరీస్‌ను జస్ ప్రీత్ బుమ్రా చాకచక్యంగా ఔట్ చేశాడు. దీంతో కేవలం 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో ఓపెనర్ షాహిబ్ జాదా ఫర్హాన్ (40) కొంత ప్రతిఘటన ఇచ్చాడు. ఫఖార్ జమాన్ (17) తో కలిసి మూడో వికెట్‌కు 39 పరుగులు జోడించాడు. అయితే జమాన్‌ను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో మరోసారి పాక్ కష్టాల్లో పడింది.

మిడిలార్డర్‌లో ఎవ్వరూ నిలదొక్కుకోలేకపోవడంతో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించే అవకాశాన్ని కోల్పోయింది. చివర్లో షాహిన్ షా ఆఫ్రిది (33 నాటౌట్) ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా, బుమ్రా, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. హార్దిక్, సైరాజ్ తలా ఒక వికెట్ తీశారు.

తక్కువ లక్ష్యాన్ని ఛేజ్ చేసేందుకు వచ్చిన భారత్ తుఫాన్ ఆరంభం చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్ మొదటి నుంచే దాడి ప్రారంభించారు. గిల్ (10) రెండు ఫోర్లు బాదగా, అభిషేక్ శర్మ కేవలం 13 బంతుల్లో 31 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించి పాక్ బౌలర్లను అల్లకల్లోలం చేశాడు. అయితే గిల్ స్టంపౌట్ కాగా, వెంటనే అభిషేక్ కూడా ఔటయ్యాడు.

ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47; 5 ఫోర్లు, 1 సిక్సర్) ఇన్నింగ్స్‌ను బాగానే నడిపించాడు. అతనికి తిలక్ వర్మ (31) చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించి జట్టును విజయం వైపు నడిపించారు. చివర్లో తిలక్ ఔటైనా, సూర్యతో కలిసి శివమ్ దూబే (10 నాటౌట్) టార్గెట్‌ను 15.5 ఓవర్లలోనే ఛేజ్ చేశారు. పాక్ బౌలర్లలో సయిమ్ అయూబ్ మూడు వికెట్లు తీసినప్పటికీ మిగిలినవారు ప్రభావం చూపలేకపోయారు.

ఈ విజయం ద్వారా భారత్ మరోసారి పాకిస్థాన్‌పై తన ఆధిపత్యాన్ని రుజువు చేసింది. అంతర్జాతీయ వేదికలపై తరచూ ఆధిపత్యం చాటుతున్న టీమిండియా ఈ సారి కూడా అన్ని విభాగాల్లో మెరుగైన ఆటతీరును కనబరిచింది. బౌలింగ్‌లో కుల్దీప్, బుమ్రా, అక్షర్ కలిసి పాక్ బ్యాటింగ్‌ను నిలువరించగా, బ్యాటింగ్‌లో సూర్యకుమార్ ఆధ్వర్యంలో యువ ఆటగాళ్లు విజృంభించారు.

ఈ మ్యాచ్‌లో భారత్ అభిమానులకు పండగ వాతావరణం నెలకొంది. పాక్ బ్యాటర్లు చేతులెత్తేయగా, భారత్ యువ ఆటగాళ్లు అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. మ్యాచ్ ముగిసేసరికి అభిమానులంతా సంబరాల్లో మునిగిపోయారు. ఈ విజయంతో టీమిండియా సూపర్–4 దిశగా ముందడుగు వేసింది. ఇక భారత్‌ తదుపరి మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడనుంది. పాకిస్థాన్ యూఏఈ జట్టును ఎదుర్కోనుంది.

మొత్తం మీద ఈ ఆసియా కప్ సమరంలో పాకిస్థాన్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవగా, టీమిండియా చిత్తుచిత్తుగా గెలిచి మరోసారి దాయాదుల పోరాటంలో తామే ఫస్ట్ అని చాటుకుంది.

Latest News

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

సంయమనం కోల్పోతే రాజకీయ సంక్షోభమే!?|EDITORIAL

వ్యక్తిగత విమర్శలు తాత్కాలిక రాజకీయ ప్రచారానికి ఉపయోగపడవచ్చు. కానీ, దీర్ఘకాలంలో నాయకుడి విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. రాజకీయ వారసత్వం కేవలం కుటుంబ నేపథ్యంతోనే రాదు, హుందాతనంతో కూడిన నాయకత్వంతోనే నిలుస్తుంది. మాటలతో సంపాదించేది ప్రచారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News