Wednesday, August 5, 2026
26.2 C
Hyderabad

‘తెలంగాణ జన’సేన అయ్యేనా?!|TELANGANA|JANASENA|PSPK

-ఏపీ తరహాలో స్వతంత్రంగా ఎదిగేనా?|AP
-బీజేపీకి తోక పార్టీగా మిగిలేనా?|BJP
-జన సేనతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?|JANASENA

తెలంగాణ జనసేన అయ్యేనా?! తెలంగాణ జనం జన సేనను ఆదరించేనా? తెలంగాణలో జనసేన సక్సెస్ అయ్యేనా? సాధారణంగా లాంచ్ అవ్వాల్సిన జనసేనకు కొందరు ఔత్సాహిక తెలంగాణవాదుల చర్యల వల్ల, గ్రాండ్ ఎంట్రెన్స్ దొరికింది. మరి గ్రాండ్ సెల్రబేషన్స్ చేసుకునే స్థాయికి ఆపార్టీ చేరుతుందా? లేక బీజేపీ ప్లాంటెడ్ పార్టీగా మిగిలిపోతుందా? లేక ఆ పార్టీకి తోక పార్టీగా నిలుస్తుందా? ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న జనసేనాని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనే కన్నేశారు. అయితే, తెలంగాణలో ఏపీ తరహాలో సక్సెస్ అవుతుందా? జన సేనతో లాభమెవరికి? నష్టమెవరికి? బీజేపీకి లాభిస్తుందా? బీఆర్ఎస్ ను కాదని తెరమీదకొచ్చి కవిత టీఆర్ఎస్ కు నష్టం చేస్తుందా? మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కిందకు నీళ్లు తెస్తుందా?

తెలంగాణలో జనసేనకు జనాదరణ దక్కేనా?

తెలంగాణ రాజకీయాల్లో జనసేన మరో కొత్త చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఎదిగిన జనసేన ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారిస్తోంది. ఇటీవల పార్టీ కార్యకలాపాలు, నేతల ప్రకటనలు, హైదరాబాద్‌లో సంస్థాగత విస్తరణ ప్రయత్నాలు చూస్తే జనసేన తెలంగాణలో కూడా రాజకీయ స్థానం కోసం సిద్ధమవుతోంది. అయితే, తెలంగాణ జనం జనసేనను ఆదరిస్తారా? లేక అది బీజేపీకి అనుబంధంగా తోక పార్టీగానే మిగిలిపోతుందా?

వాస్తవానికి తెలంగాణలో జనసేన ప్రవేశం కొత్తదేమీ కాదు. పార్టీ ఆవిర్భావమే హైదరాబాద్ లో జరిగింది. 2014 మార్చి 14న మాదాపూర్ లో అట్టహాసంగా ప్రారంభించారు. ప్రతిఏటా ఆవిర్భావ ఉత్సవాలు జరుపుతున్నారు. మరైతే ఇదే హైదరాబాద్ లో ఇప్పుడు కొత్తగా కార్యాలయం ప్రారంభించడంలో అర్థముందా? అసలు ఆంతర్యమేంటి?

జనసేన ఆవిర్భావ సమయంలోనే తెలంగాణలో విస్తరించాలని ప్రయత్నించింది. అయితే తెలంగాణ ఉద్యమం అనంతరం ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ భావోద్వేగాలు, స్థానిక నాయకత్వ లోపం కారణంగా పార్టీ బలపడలేకపోయింది. దాంతో ఏపీలో పాగా వేయడానికి పూనుకున్నది. మొదటిసారి విఫలమైనా, రెండోసారి కూటమి పొత్తు ఎత్తులో సక్సెస్ అయింది. అయితే, తెలంగాణలో ఇప్పుడు పరిస్థితులు మారాయి. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రయత్నించడం వంటి పరిణామాల మధ్య జనసేన తన అవకాశాలను వెతుక్కుంటోంది.

తెలంగాణలో 3.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 40 శాతానికి పైగా యువతే. రాష్ట్ర జనాభాలో పట్టణ ప్రాంతాల వాటా కూడా 39 శాతానికి పైగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లో యువత, మధ్యతరగతి, ఐటీ ఉద్యోగులు, వ్యాపార వర్గాలు గణనీయంగా ఉన్నాయి. ఈ వర్గాలపై జనసేన ప్రభావం చూపగలదని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కానీ, ఓట్లేయడంలో యువత, పట్టణ, నగర జనాభా అనాసక్తంగా ఉంది. అయితే, పవన్ కళ్యాణ్‌కు ఉన్న వ్యక్తిగత అభిమానులు రాజకీయ మద్దతుగా మారితే పార్టీకి కొంత ప్రయోజనం కలగవచ్చు.

అభిమానులు, ఓటర్లు ఒకటే కాదన్న వాస్తవాన్ని కూడా గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జనసేన తొలి ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చింది. కానీ, 2024లో తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు కారణంగా పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 21 స్థానాలు గెలుచుకుంది. నూటికి నూరు శాతం విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫలితం కేవలం జనసేన సొంత బలాన్ని కాకుండా కూటమి రాజకీయాల ప్రభావాన్ని కూడా ప్రతిబింబించింది.

ఇక్కడే తెలంగాణలో జనసేన భవిష్యత్తుపై సందేహాలు రేకెత్తుతున్నాయి. పార్టీ సొంత రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటుందా? లేక బీజేపీతో కలిసి పనిచేసే మిత్రపక్షంగానే మిగిలి పోవాలనుకుంటుందా? ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు రెండో అవకాశానికే ఎక్కువ బలం చేకూరుస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ ఇప్పటికే బలమైన సంస్థాగత నిర్మాణాన్ని కలిగి ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14 శాతం ఓట్లను సాధించింది. ఎనిమిది లోక్ సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకు ప్రత్యేక రాజకీయ వ్యాక్యూంను ఏర్పరచుకోవడం అంత సులభం కాదు.

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొని ఉంది. ఈ మూడు పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ శక్తి కోసం కొంతమంది యువత, పట్టణ ఓటర్లు ఎదురుచూస్తున్నారనే వాదన ఉంది. జనసేన ఆ ఖాళీని భర్తీ చేయగలదా? అన్నది కీలక ప్రశ్న. ఇందుకోసం కేవలం పవన్ కళ్యాణ్ ప్రజాదరణ సరిపోతుందా? గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణం అవసరం. స్థానిక సమస్యలపై స్పష్టమైన వైఖరి, తెలంగాణకు ప్రత్యేక రాజకీయ అజెండా, విశ్వసనీయ నాయకత్వం కూడా అవసరం.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జనసేనకు తొలి పరీక్షగా నిలువనున్నాయి. హైదరాబాద్‌లో పార్టీకి ఉన్న అభిమాన వర్గం ఓట్లుగా మారుతుందా లేదా అన్నది అప్పుడే స్పష్టమవుతుంది. ఒకవేళ పార్టీ గణనీయమైన ఓటు శాతం సాధిస్తే భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం కనిపించవచ్చు. లేకపోతే జనసేన ప్రభావం సోషల్ మీడియా చర్చలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

తెలంగాణ రాజకీయాల్లో ప్రాంతీయ అస్తిత్వ గుర్తింపు, స్థానిక నాయకత్వం, సామాజిక సమీకరణలు కీలక పాత్ర పోషిస్తాయి. బీఆర్ఎస్ మనుగడ కూడా తెలంగాణ భావజాలంపైనే ఆధారపడింది. కాంగ్రెస్ ప్రస్తుతం సంక్షేమం, ప్రజాపాలనతో ముందుకెళ్తోంది. బీజేపీ జాతీయ రాజకీయాలను రాష్ట్ర రాజకీయాలతో అనుసంధానించే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన తన ప్రత్యేకత ఏమిటో ప్రజలకు చెప్పగలగాలి. కేవలం ఏపీలో సాధించిన విజయాన్ని తెలంగాణలో పునరావృతం చేయడం అంత సులువు కాదు.

మొత్తంగా చూస్తే తెలంగాణలో జనసేనకు అవకాశాలు ఉండొచ్చు. కానీ ఆ అవకాశాలు ఇంకా రాజకీయ బలంగా మాత్రం కనిపించడం లేదు. అభిమానాన్ని ఓట్లుగా, ఓట్లను సంస్థాగత బలంగా, బలాన్ని ఎన్నికల విజయంగా మార్చే సామర్థ్యాన్ని పార్టీ సమకూర్చుకుని, నిరూపించుకోవాలి. లేకపోతే అది బీజేపీ మిత్రపక్షంగానే, తోకపార్టీగానే మిగిలిపోతుంది. తెలంగాణ రాజకీయాల్లో నిజమైన శక్తిగా ఎదగాలంటే జనసేన తన స్వంత అస్తిత్వాన్ని నిర్మించుకోవాల్సిందే. రాబోయే జీహెచ్‌ఎంసీ, తదుపరి అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపుగా నిలవనున్నాయి.

——-

డా. మార్గం లక్ష్మీ నారాయణ,
సమాజ, రాజకీయ విశ్లేషకులు,
చీఫ్ ఎడిటర్ – అడుగు డిజిటల్ మీడియా.

Latest News

బీజేపీ-ఆత్మపరిశీలనకు సరైన సమయం! EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఒక సందేశం! ప్రతి ఉప ఎన్నిక ఒక హెచ్చరిక!! ప్రతి ప్రజా ఉద్యమం పాలకుల పాలనకు అద్దం. ఇప్పటిదాకా అప్రతిహతంగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ అనూహ్యంగా ఈ మూడింటినీ...

ఆగస్టు 05 బుధవారం 2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు , ఆషాఢ మాసము-కృష్ణపక్షం తిథి కృష్ణ-సప్తమి ఈ రోజు (05) రాత్రి 8:42 వరకు, తదుపరి కృష్ణ-అష్టమి నక్షత్రము అశ్విని ఈ రోజు (05) రాత్రి 9:18 వరకు,...

ఇగ పోను అన్ లాక్ శేసుడు అల్కన!!?|ADUGU TRENDS

ఇగో గిప్పుడు గా పోన్ల వాడుడు అందరికీ అల్కగైపోయింది. సంటి పోరగాండ్ల కానుంచి, పండు ముసలోల్ల దాకా పోను వాడుతనే ఉన్నరు. ఇగ గీ వాడుట్ల అప్పుడప్పుడు గా పోన్ల లాకుల నెంబర్ల...

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News