స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, జగిత్యాల ఎం.ఎల్.ఏ డా. సంజయ్ కుమార్, పాలకుర్తి ఎం.ఎల్.ఏ యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలు జెట్టి కుసుమ కుమార్, రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

