జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిశారు. విదేశీ పర్యటనలో భాగంగా జ్యూరిచ్ చేరుకున్న రెండు రాష్ట్రాల సీఎం లు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానాన్ని పొందారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చించారు. సమకాలీన సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ చర్చ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇరు రాష్ట్రాల ఐటీ మంత్రులు శ్రీధర్ బాబు, నారా లోకేష్ తదితరులు వున్నారు.

