Friday, March 13, 2026
24.2 C
Hyderabad

ఆగస్ట్ 1 నుంచి Phone pe|ఫోన్ పే, Google Pay|గూగుల్ పే వాడే వారు తెలుసుకోవాల్సిందే!

Online|ఆన్‌లైన్ Payment|పేమెంట్ చేసే ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే, Paytm|పేటీఎం లాంటి యూపీఐ యాప్‌లు వాడుతున్న వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఆగస్ట్ 1 నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వ్యవస్థలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకొచ్చిన ఈ మార్పులు UPI సేవల నాణ్యతను మెరుగుపరచడం, సర్వర్లు మేలుగా పనిచేయేలా చూసుకోవడం, లావాదేవీలను సురక్షితంగా నిర్వహించేందుకు తీసుకున్న చర్యలుగా చెప్పవచ్చు. కొత్త మార్పులు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సహా అన్ని యూపీఐ యాప్‌లపై వర్తిస్తాయి.

ఈ మార్పుల ప్రకారం ఇకపై ఒక యాప్ ద్వారా రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. ఇంతకుముందు ఇలా ఎలాంటి పరిమితి ఉండేది కాదు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఉండే పీక్ అవర్స్‌లో బ్యాలెన్స్ చెక్ అభ్యర్థనలపై మరింత పరిమితులు అమలయ్యే అవకాశం ఉంది. ఇకపై లావాదేవీ పూర్తయ్యాక డబ్బులు వచ్చినా, వెళ్లినా బ్యాలెన్స్ ఆటోమెటిక్‌గా చూపించబడుతుంది.

latest-telugu-news

ఇక ఒక్క యూపీఐ యాప్‌లో లింక్ చేసిన బ్యాంకు ఖాతాలను రోజుకు గరిష్టంగా 25 సార్లు మాత్రమే చూడటానికి అనుమతిస్తారు. ఇది సిస్టమ్‌పై అనవసరమైన ఒత్తిడిని తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయం.

ఆటోపే వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. భవిష్యత్తులో EMIలు, OTT సబ్‌స్క్రిప్షన్లకు సంబంధించిన ఆటోపే లావాదేవీలు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి. ఉదయం 10 గంటల ముందు, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, రాత్రి 9:30 తర్వాత మాత్రమే ఈ ఆటోపేలు జరగవచ్చు. ఒక్కో మ్యాండేట్‌కు గరిష్టంగా నాలుగు ప్రయత్నాలు మాత్రమే అనుమతించబడతాయి – ఒకటి ప్రారంభ ప్రయత్నం, మిగిలిన మూడు రీట్రైలు.

పెండింగ్‌లో ఉన్న పేమెంట్ల స్టేటస్ చెక్ చేసే విషయానికొస్తే, రోజుకు గరిష్టంగా మూడు సార్లు మాత్రమే వాటిని చెక్ చేయొచ్చు. అలాగే ఒక్కో చెక్ చేయడానికి మధ్య కచ్చితంగా 90 సెకన్ల విరామం ఉండాలి.

phone-pay | google-pay | online-transactions |

దీంతోపాటు, 12 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలంగా వాడని మొబైల్ నంబర్లతో లింక్ అయిన యూపీఐ IDలను ఆటోమేటిక్‌గా డీయాక్టివేట్ చేయనున్నట్లు NPCI ప్రకటించింది. అంటే ఏడాది పాటు వాడనిది ఉంటే యాప్ పనిచేయకపోవచ్చు.

UPI Transactions | new-rules |

ఈ మార్పులు సాధారణ యూజర్లకు పెద్దగా ఇబ్బందులు కలిగించవు. డబ్బులు పంపించటం, రిసీవ్ చేయడం వంటి ప్రధాన పనితీరులో ఎలాంటి మార్పులుండవు. కానీ ఇవి యూపీఐ వ్యవస్థను మరింత వేగంగా, భద్రతగా, నెమ్మదిగా పనిచేసేలా చేయడానికే తీసుకున్న నిర్ణయాలు కావడం గమనించాలి. కనుక రెగ్యులర్ యూజర్లు తమ యాప్‌లను వీటి ప్రకారం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

upi-payments | upi-transaction-limits |

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News