Wednesday, July 29, 2026
23.1 C
Hyderabad

సల్లంగ సూడు.. సమ్మక్క తల్లీ!

మేడారంలో కొలువైన వన దేవతలు
చిలుకలగట్టు నుంచి గద్దెపైకి సమ్మక్క
నలుగురు దేవతల రాకతో జాతర జోరు
భక్తిపారవశ్యంతో పోటెత్తిన భక్తజన హోరు

ఆసియాలోనే అతి పెద్ద జాతరైన మేడారంలో వరుసగా కీలక ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. సారలమ్మ బుధవారం గద్దెపైకి చేరుకోగా.. సమ్మక్క గద్దెనెక్కనున్నారు. ఇందుకోసం చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తజనం పులకించనుంది. సమ్మక్క రాకతో ఈ జాతర పరిపూర్ణం కానుంది. గురువారం అర్ధరాత్రి నుంచి వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ జాతర సందర్భంగా మేడారం భక్తులతో కిక్కిరిసిపోయింది.

మేడారం జాతరలో భక్తులందరూ ఎదురుచూసిన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు ఎంతో ఆసక్తిగా చూసే అమ్మవారు సమ్మక్క గద్దెలపై కొలువుదీరారు. అనంతరం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అంతకుముందు వనం (చిలకలగుట్ట) వీడి జనంలోకి సమ్మక్క ఆగమనం ప్రారంభమవడంతో సమ్మక్క తల్లికి గౌరవసూచకంగా గాల్లోకి ములుగు జిల్లా ఎస్పీ రాంనాథ్​ కేకన్​ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు సమ్మక్క తల్లికి గౌరవ వందనం సమర్పించారు. సమ్మక్క రాక సందర్భంగా శివసత్తుల పూనకాలు వచ్చాయి. సమ్మక్కను తీసుకువస్తుండగా ఎదురుకోళ్లతో భక్తుల సాదర స్వాగతం పలికారు. చిలకలగుట్ట నుంచి బయలుదేరిన సమ్మక్క తల్లికి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఘనస్వాగతం పలికారు. భక్తులు సమ్మక్కకు జై అంటూ నినాదాలు చేశారు. భక్తుల జయజయధ్వానాలతో సమ్మక్క గద్దెలపైన కొలువుదీరింది. గద్దెలపై వనదేవతలు కొలువుదీరడంతో ప్రధాన ఘట్టం పూర్తి అయ్యింది. వనదేవతల దర్శనానికి భక్తజనం లక్షలాదిగా తరలివచ్చారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం వనదేవతల వన ప్రవేశంతో మేడారం జాతర పూర్తికానుంది. బుధవారమే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరిన సంగతి తెలిసిందే. రేపు అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. మేడారం మహాజాతర నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జంపన్న వాగు వద్ద పుణ్య స్నానాలు చేసి వనదేవతలకు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రెస్క్యూ టీం నిరంతరం వాగులో గస్తీ నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఏర్పాటు చేసిన హుండీలతో పాటు డిజిటల్ విధానంలోనూ భక్తులు తమ కానుకలను సమర్పించుకుంటున్నారు. మరోవైపు మేడారంలో వన దేవతలను దర్శించుకోవడానికి ముందు గట్టమ్మ గుట్ట ఆలయానికి భక్తులు వెళ్తారు. జాతరకు వెళ్లే భక్తులతో గట్టమ్మ ఆలయం అత్యంత రద్దీగా మారింది. భక్త జనంతో మేడారంలో విపరీతమైన రద్దీ నెలకొంది. ఇసుక వేస్తే రాలనంత జనం మాటల్లోనే వింటుంటాం కానీ అక్కడ పరిస్థితి మాత్రం అచ్చం అలానే ఉంది.

Latest News

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News