Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

బాలికల సాధికారత కోసం సేవా భారతి రన్ కార్యక్రమం

ఫిబ్రవరి 02న… రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్

అండగా నిలిచిన పలు కార్పొరేట్ కంపెనీలు

సమాజ సేవకు, సంక్షేమానికి అంకితమైన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ, సేవా భారతి తన వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం ‘రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్’ 9వ ఎడిషన్ ను 2025 ఫిబ్రవరి 02 ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, టీ షర్ట్స్, బిబ్స్ ను ఫ్రీడమ్ ఆయిల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, జీ ఎం చేతన్, గ్లోబల్ డాటా డైరెక్టర్ స్వప్న మహేరియా, ప్రసన్న కాంత్, సేవా భారతి ఉపాధ్యక్షురాలు డాక్టర్ సుమలత, సంయుక్త కార్యదర్శి జయప్రద, సైబరాబాద్ సేవా భారతి అధ్యక్షురాలు ఉషా అయ్యర్, రన్ అంబాసిడర్ సరిత నర్మెట్ట, శ్రీనివాస్ తాడూరి, అఖిల్ తదితరులు హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన సన్నాహక సమావేశంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి, చేతన్ మాట్లాడుతూ, ఈ రన్ లో పాల్గొనేందుకు ఇప్పటికే 10 వేల మంది తమ పేరు నమోదు చేసుకున్నారన్నారు. సామాజిక బాధ్యతగా సేవా భారతి సంస్థ సేవలకు సహకారంగా ఉంటున్నoదుకు గర్వపడుతున్నామన్నారు. స్వప్న మహేరియా, ప్రసన్న కాంత్ లు మాట్లాడుతూ, సేవా భారతి సేవలను కొనియాడారు. బాలికల సాధికారత కోసం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పని చేయాలన్నారు. అందుకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. జయప్రద దేవి మాట్లాడుతూ, 2004 లో కేవలం 11 కేంద్రాలతో ప్రారంభమై, ఇవ్వాళ 300 కిషోరీ వికాస కేంద్రాలను ఏర్పాటు చేశాం అన్నారు.

డాక్టర్ సుమలత మాట్లాడుతూ, సమాజంలో ఉన్న అవసరాలను బట్టి వివిధ రంగాల్లో సేవా భారతి సేవలు అందిస్తున్నది. కిషోరీ వికాస యోజన తో సేవా భారతి చదువు, వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యంలో తోడ్పాటు ఇస్తున్నాం. సేవా భారతి 300 బస్తీల్లో 20 ఏళ్లుగా పని చేస్తోంది. ఇలాంటి వాటితోనే సమాజంలో మార్పు సాధ్యం. ఫిబ్రవరి 2న, గచ్చిబౌలి లో జరిగే 9వ విడత రన్ ఫర్ గర్ల్ చైల్డ్, మరియు ఫిబ్రవరి 1న అద్భుతంగా ఉండే ఉడాన్ ఉత్సవంలో పాల్గొనాలని, అదే ఉత్సవంలో రన్నర్స్ కు టీ షర్ట్స్, బిబ్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్’ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవాభారతి కిశోరి వికాస్ యోజన ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ లోని మురికి వాడల్లోని ఆడపిల్లల అభ్యున్నతికి కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. కిశోరి వికాస్ యోజన ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు ప్రతి ఏడాది 10 వేల మంది బాలికలకు సాధికారత కల్పించిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2030 నాటికి లక్ష మంది ఆడపిల్లలకు భవిష్యత్ ప్రణాళికల ద్వారా సాధికారత సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఈ రన్ కు సహకరిస్తున్న ఫ్రీడమ్ ఆయిల్, గ్లోబల్ డేటా, ఇన్ఫోసిస్, పాల్ టెక్, జీఈపీ, హెల్త్ ఎడ్జ్, ఫిల్ట్రేషన్ గ్రూప్, UST, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్, బీడీఎల్ వంటి సంస్థలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమాల ద్వారా తర్వాత జరిగే “రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్” కార్యక్రమంలో పాల్గొనాలని వివిధ కార్పొరేట్ సంస్థలను కోరారు. నిరుపేద ఆడపిల్లల భవిష్యత్ ను మార్చే లక్ష్యానికి సేవాభారతి కట్టుబడి ఉందని, మా లక్ష్యానికి ‘రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్’ కార్యక్రమం నిదర్శనమన్నారు.

అలాగే ‘రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్’ కార్యక్రమానికి దాతలు, రన్నర్లు అధికారిక వెబ్సైట్: www.runforagirlchild.org ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సేవాభారతి ఇతర సభ్యులు పిలుపునిచ్చారు. ఆసక్తిగల వారు మరిన్ని వివరాలకు అపర్ణ గారిని +91 98480 34767 సంప్రదించగలరని విజ్ఞప్తి చేశారు.

 

.

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News