సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సినీ నటుడు అల్లు అర్జున్, ఈరోజు కోర్టుకు హాజరుకానున్నారు. రూ.50,000 చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయరాదని, కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని కోర్టు హెచ్చరించింది. అలాగే, ప్రతి ఆదివారం రెండు నెలల పాటు చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాలని కూడా షరతు విధించింది. ఈ నేపధ్యంలో, నాంపల్లి కోర్టు జడ్జి ముందు పత్రాలు సమర్పించేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారు.

