Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీంలతో ప్రజలు అప్రమత్తంగా వుండాలి

-వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా

మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడతున్న మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీంల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రజలకు సూచించారు. ప్రజల సొమ్ము దోచుకోనేందుకు సైబర్‌ నేరగాళ్ళు రోజు, రోజుకి కొత్త పోకడలతో ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకొనేందుకు సైబర్‌ కొత్త పంథాలను ప్రయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీంలతో పాటు పిరమిడ్‌ లాంటి స్కీంల ద్వారా ప్రజల నుండి డబ్బును దోచేస్తున్నారు. ఈ స్కీంల ప్రధాన లక్ష్యం విలాసవంతమైన వస్తువులు అందజేస్తామని, సొంత ఇంటి కలను నేరవేరుస్తామని, విదేశీ యాత్రలకు పంపిస్తామని మోసపూరితమైన వాగ్దానాలతో ఈ స్కీంలను నిర్వహిస్తున్న సైబర్‌ నేరగాళ్లు మొదటగా కొంత రుసుముతో ప్రాథమిక సభ్యత్వాన్ని కల్పించడం జరుగుతుంది. సభ్యత్వం పొందిన వారితో మరికొంత మంది వ్యక్తులను సభ్యత్వం కల్పిచే ఎక్కువ మొత్తం పెట్టిన పెట్టుబడికి రెట్టింపు వస్తుందని, ఎక్కువ మొత్తంలో సభ్యులను సభ్యులుగా చేర్పిస్తే పెద్ద మొత్తంగా డబ్బు వస్తుందని ప్రజలను మభ్యపెడుతూ కోట్లల్లో డబ్బు కొల్లగొట్టడం ఈ మల్టీ లెవెల్‌ స్కీంల ప్రధాన లక్ష్యమని ప్రజలు ముందుగా ఇది గుర్తించాలి. ముఖ్యంగా సైబర్‌ నేరగాళ్ళు ప్రజల ఆత్యాశను తమ ఆయుధాలుగా మార్చుకొని సామాజిక మాద్యమాలు, మెయిల్స్‌ ద్వారా, ఇతర ప్రచార సాధనాల ద్వారా ప్రజల బలహీనతలను లక్ష్యంగా చేసుకొని ప్రజల దృష్టిని ఆకర్షించే రీతిలో ప్రకటనల పట్ల ప్రజలు మోసపోవద్దని, ఇలాంటి స్కీం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాల్సి వుంటుందని, ఏవరైన ఇలాంటి స్కీంల ద్వారా మోసపోయినట్లుగా భావిస్తే తక్షణమే 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కుగాని లేదా https://www.cybercrime.gov.in అనే వెబ్‌సైట్‌లో కానీ లేదా సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని, అలాగే సైబర్‌ నేరాల భారీన పడిన బాధితులు కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ సెక్యూరీటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లోనైనా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News