Saturday, September 5, 2026
27.6 C
Hyderabad

నిరర్థకంగా పార్లమెంట్‌ సమావేశాలు!?|EDITORIAL

ప్రజాస్వామ్యంలో పార్లమెంట్‌ అత్యంత కీలకం. ప్రజల తరఫున చట్టాలు రూపొందించే పవిత్ర స్థానం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే సిసలైన వేదిక. కానీ, ఇటీవలి కాలంలో పార్లమెంట్‌ సమావేశాల్లో పస లేకుండా పోయింది. రాజకీయ పార్టీల ఎజెండాగా మారింది. పరస్పర దూషణల పర్వంగా జరుగుతోంది. అత్యంత నిరర్ధకంగా మారి, ప్రజాధనం ఫలితం లేకుండా వ్రుథాగా పోతోంది.

జూలై 21న ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాల్లో ‘ఆపరేషన్ సిందూర్’పై మాత్రమే చర్చ జరిగింది. ఈ అంశంపై ఓ స్పష్టత వస్తుందని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ఆశించారు. రెండు రోజుల సుదీర్ఘ చర్చ, ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రసంగం తర్వాత కూడా జవాబులేని ప్రశ్నలు అనేకం మిగిలిపోలాయి. పహల్గామ్‌ సంఘటనలో భద్రతా వైఫల్యం, ఉగ్రవాదుల ఆచూకీ, నుంచి కేవలం 88 గంటల్లోనే యుద్ధ విరమణ ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి.

బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ పేరిట జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ గురించి విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇదే సమయంలో దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలోని ఒక్క రాయపుర అసెంబ్లీ నియోజకవర్గంలోనే లక్షకు పైగా బోగస్‌ ఓట్ల పోలింగ్‌ జరిగిందని సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. దీనిపై చర్చించి ఏకాభిప్రాయంతో ఎన్నికల సంస్కరణలను తెచ్చి ఉంటే అధికార పార్టీకి గౌరవం దక్కేది. దేశానికి ప్రయోజనం కలిగేది. పర్మినెంట్‌ ఓటర్ల ముసాయిదా ఉండేలా చేయించుకునే అవకాశం ఉండేది.

పార్లమెంటు సమావేశాలు ఒకప్పుడు అర్థవంతమైన చర్చలు, వాదోపవాదాలతో ఎంతో ఆసక్తిగా ఉండేవి. సమస్యలపై చర్చకు ప్రభుత్వాలు కూడా అనుమతించేవి. చర్చలు హుందాగా జరిగేవి. ఈ రోజుల్లో పార్లమెంట్‌ సమావేశాలు అనేక కారణాల వల్ల నిరర్థకంగా మారుతున్నాయి. సమావేశాలు జరుగుతున్న రోజుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. భారత రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటు ఏడాదికి కనీసం రెండు సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. కానీ ఈ రాజ్యాంగ అవసరం మొక్కుబడిగ మారింది. 1960లలో పార్లమెంట్‌ సమావేశాలు ఏడాదికి సగటున 120 రోజులపాటు సాగేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 60-70 రోజులకు మించడం లేదు.

సమావేశాలలో వాదనలు, చర్చల కంటే వాదోపవాదనలు, వివాదాలు, కేకలు, గుంపులుగా నినాదాలు, సభలోంచి వాకౌట్ చేయడం లాంటివే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు నామమాత్రంగాగా సభను అడ్డుకుంటున్నాయి. అధికార పక్షం కూడా చర్చలకు తావీయకుండా, తమ పనిని ఒడ్డెక్కించుకుంటున్నది. ఫలితంగా ప్రజల డబ్బులతో నడిచే ఈ సభలు ప్రజలకు ఉపయోగపడకుండా, కేవలం రాజకీయ స్టంట్‌గా మారిపోతున్నాయి.

వాయిదా తీర్మాణాలు అత్యంత ఆందోళనకరమైన అంశం. ఓ రోజుకి సగటున లక్షలాది రూపాయలు ఖర్చవుతున్నా, సభ వాయిదాలతో అవన్నీ వృథా అవుతున్నాయి. ఇలా పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుతో నిర్వీర్యంగా సభలు నడవడం చాలా విచారకరం. దేశానికి కీలకమైన బిల్లులు, చట్టాలు పార్లమెంటులో సరైన చర్చ లేకుండానే ఆమోదం పొందుతుండటం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతోంది. అంతేకాకుండా, మీడియా, సోషల్ మీడియా ప్రభావంతో నాయకులు సభల్లో మాట్లాడే విషయంలోనూ హంగులు చూపించడం ప్రారంభించారు. ప్రజల ఆకర్షణ పొందడానికి ఎమోషనల్ స్పీచ్‌లు, నినాదాలు, నిరసనలే ఎక్కువగా చేస్తున్నారు గానీ, శాస్త్రీయంగా విశ్లేషించి సమస్యలపై పరిష్కారాలు చర్చించేందుకు ఆసక్తి చూపడం లేదు.

ఇటీవలి కాలంలో అధికార పార్టీలు ప్రతిపక్షాల విమర్శలను సహించలేకపోతున్నాయి. అలాగే ప్రతిపక్షాలు కూడా సమస్యలపై సభా నిబంధనలు, సమాచారంతో కాకుండా కేవలం అడ్డంకులు సృష్టించే దిశగానే స్పందిస్తునాయి. ఒకవేళ ఎవరైనా అలా మాట్లాడే ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకోవడం, మైకులు కట్ చేయడం, బుల్డోజింగ్ చేస్తున్నది. ఇది ఒక విధంగా ప్రజాస్వామ్య పద్ధతుల దుర్వినియోగమే.

ఇలాంటి పరిస్థితుల్లో దీనికి పరిష్కారం ఏంటి? పార్లమెంటు సమావేశాల రోజులను నిర్ధారిత పరిమితిలో ఉండేలా నిబంధనలు పెట్టాలి. సభల నిర్వహణ ఖర్చుపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. సభల సమయంలో ప్రవర్తించే తీరు, నిబంధనల ఉల్లంఘనలకు ఖచ్చితమైన శిక్షలు విధించాలి. సభ్యులు తమ ప్రసంగాలను నిర్మాణాత్మకంగా ఉండేందుకు మార్గదర్శకాలను రూపొందించాలి. ముఖ్యంగా, స్పీకర్‌కు మరింత అధికారాలు ఇవ్వడం ద్వారా సభలో క్రమశిక్షణను పాటించేలా చర్యలు తీసుకోవాలి.

తద్వారా పార్లమెంటు నిజంగా ప్రజల సమస్యలపై చర్చించే వేదికగా మారుతుంది. ప్రభుత్వం తీసుకురాబోయే బిల్లులు సరైన విచారణకు లోనవుతాయి. ప్రతిపక్షాల వాణి ప్రభుత్వానికి వినిపించే అవకాశాలు కలుగుతాయి. ప్రజలు తమ ప్రతినిధుల పనితీరును సమీక్షించే అవకాశం పొందుతారు.

పార్లమెంట్‌ ఒక చట్టసభ మాత్రమే కాదు, అది ప్రజల విశ్వాసానికి నిదర్శనం. అలాంటి పార్లమెంటు సమావేశాలు ఈ విధంగా నిరర్థకంగా మారిపోవడం సిగ్గుచేటు. ప్రజల ఆశలతో ఏర్పాటు చేసిన ఈ పవిత్ర వేదికను రాజకీయ నాయకులు తమ ప్రయోజనాలకే వాడుకుంటే, ప్రజలకే గాక, ప్రజాస్వామ్యానికి కూడా నష్టమే. కాబట్టి, పార్లమెంట్‌ సమావేశాల ప్రభావాన్ని పెంచేలా, వాటిని ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేలా మలుచుకోవాల్సిన అవసరం మనం గుర్తించాలి. లేదంటే ‘పార్లమెంట్’ అనేది కేవలం నిరర్ధక వేదికగా మిగిలిపోతుంది.

ప్రజాస్వామ్య భవితవ్యాన్ని పరిరక్షించాలంటే, పార్లమెంటు సమావేశాలు ప్రజా ప్రయోజనాలపైనే దృష్టి కేంద్రీకరించాలి. అదే సమకాలీన భారతావనికి అత్యవసరమైన మార్గం.

Latest News

అమ్మంటే గామే!?|ADUGU TRENDS

మహారాష్ట్రల బీడ్ అంబాజోగాయిల అమ్రుత్ మహోత్సవ్ వేడుకలు జర్గుతానయి. అమ్రుత్ దౌడ్ మొదలైతాంది. గండ్లకు హఠాత్తుగా ఓ 47 ఏండ్ల రమాబాయి రణవీర్ దూసుకొచ్చింది. గా మారథాన్ పరుగు పందెంల ఉరుకుడు మొదలు...

ఏఐ యుగంలో గెలిచేది మానవ నైపుణ్యమే!?|EDITORIAL

ఉద్యోగార్థులకు ఏఐ గణాంకాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. డిగ్రీ లేదా అనుభవం ఒక్కటే భవిష్యత్తుకు భద్రత ఇవ్వవు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం...

సెప్టెంబర్ 05, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి నవమి రాత్రి 08.54 వరకు ఉపరి దశమి నక్షత్రం మృగశిర రాత్రి 09.39 వరకు ఉపరి ఆరుద్ర యోగం వజ్ర పగలు 01.57 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 10.08 వరకు ఉపరి గరజి రాహుకాలం...

తలుసుకుంటే కాందేంది? నదే శుభ్రమైంది!?|ADUGU TRENDS

గీ డిగ్రీలు సదివే పిల్లలు ఏం ఆలోశిస్తరు? ఆటా, పాటా, అల్లరి, సదువు, కెరీర్ గివే కదా? కనీ గీ పిల్లగాడు గివేవీ ఆలోసించలే.. తమ ఊరి పక్కనుండే పోతున్న నది గురించి...

కొండా కుటుంబం దారెటు!?|EDITORIAL

అనూహ్యం కాకపోయినా, అనివార్యంగా జరిగిపోయింది. పరిణామాల ఫలితాలేమైనా, కొండంత ఆశయం, తన కూతురు, తమ భవిష్యత్తు కోసం కొంత పట్టువిడుపు ప్రదర్శించి ఉంటే, కొండా సురేఖ మంత్రి పదవి నిలిచేదేమో! అయినా కొండా...

సెప్టెంబర్ 04, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శ్రీ కృష్ణాష్టమి తిధి అష్టమి రాత్రి 11.20 వరకు ఉపరి నవమి నక్షత్రం రోహిణీ రాత్రి 11.20 వరకు ఉపరి మృగశిర యోగం హర్షణ సాయంత్రం 05.00 వరకు ఉపరి వజ్ర కరణం బాలవ పగలు 12.30 వరకు ఉపరి...

అధిష్ఠానం నిర్ణయంపై చిన్నారెడ్డి సంచలనం|CHINNA REDDY|CONGRESS

ఒక్క పోటుతో కూల్చేశారు.. పదవులపై నాకు సోకు లేదు తనకు పదవులపై ఎలాంటి ఆసక్తి, వ్యామోహం లేదని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయంగా ఈ స్థాయికి వచ్చానని, అయితే ఒక్క పోటుతో తనను పదవి...

నా బర్తరఫ్‌ చెల్లదు|KONDA SUREKHA|SENSATIONAL COMMENTS

ఈరోజు నాకు జరిగింది.. రేపు మీకూ జరుగుతుంది ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడండి రేవంత్‌ సర్కార్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు....

BREAKING: కొండా సురేఖపై వేటు..చిన్నారెడ్డి ఔట్

సీఎం రేవంత్‌ నిర్ణయం! తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు అధికారిక నోట్‌ వెల్లడించింది. ఈ మేరకు...

కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం..|KONDA SUREKHA|KA PAUL

కాంగ్రెస్‌ను వీడి ప్రజాశాంతి పార్టీలోకి రండి మంత్రి కొండా సురేఖకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బహిరంగ ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీ...

రాజీనామా చేయాల్సిందే.. లేదంటే బర్తరఫ్‌!|KONDA SUREKHA|RESIGN|BURTRAF

కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం.. ఇంటి వద్ద నిర్మానుష్యం పార్టీ లైన్‌ దాటని అనుచరులు  తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌...

ఉద్వాసనమే!|KONDA SUREKHA|CM|REVANTH REDDY|DELHI

సురేఖను పట్టించుకోని అధిష్ఠానం ముక్తసరిగా మూడు ముక్కల్లో ఖర్గేతో మచ్చట అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ కార్యాలయంలోనే రోజంతా పడిగాపులు నిరాశతో వెనుతిరిగిన మంత్రి కొండా సురేఖ ఖర్గే, కేసీలతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా భేటీలు సురేఖ వ్యవహారాన్ని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News