సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట దురదృష్టకర ప్రమాదమని అల్లు అర్జున్ తెలిపారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరూ తప్పు చేయలేదని, ప్రెస్ మీట్లో ఆయన స్పష్టం చేశారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శించడానికి తన ప్రెస్ మీటు ఏర్పాటు చేయలేదని ఆయన చెప్పుకున్నారు. వ్యక్తిగతంగా తనపై దుష్ప్రచారం జరుగుతున్నందుకు ఆయన బాధపడుతున్నట్లు చెప్పారు.

