Wednesday, September 16, 2026
31.2 C
Hyderabad

సమగ్ర ఎన్నికల సంస్కరణలపై చర్చించాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలంటే ఎన్నికల వ్యవస్థ పటిష్టంగా, పారదర్శకంగా, ప్రజాప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలి. అయితే ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ, నిధుల వ్యయం, దోపిడీ రాజకీయాలు, ఓటర్ల ఆకర్షణ కోసం జరుగుతున్న అక్రమాలు, రాజకీయాల్లో క్రిమినల్ చొరబాటు, క్రిమినల్సే అభ్యర్థులు కావడం వంటి అనేక సమస్యలు ప్రజాస్వామ్య ఉనికినే దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సమగ్ర ఎన్నికల సంస్కరణలపై భారత పార్లమెంట్‌లో పార్టీల రాజకీయాలకు అతీతమైన అర్థవంతమైన నిష్పాక్షిక సీరియస్ చర్చ జరగడం అత్యవసరం.

దేశంలో ఎన్నికలు నిర్వహణలో తలెత్తుతున్న ప్రధాన సమస్యల్లో మొదటిది అత్యధిక ఎన్నికల వ్యయం. ఖర్చుల నియంత్రణకు నిబంధనలు ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటోంది. నల్ల ధనం ప్రవాహం ఎన్నికల వ్యవస్థను భయంకరంగా దెబ్బతీస్తోంది. ఎన్నికల నిధుల పారదర్శకత కోసం రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల పద్ధతిని పూర్తిగా ప్రజలకు తెలిసేలా చేయాలి. కార్పొరేట్ ఫండింగ్‌పై కఠిన నియంత్రణలు విధించాలి. ఇదంతా పటిష్టమైన చట్టాల రూపకల్పన ద్వారానే సాధ్యం. ఈ అంశంపై గతంలో ఎన్నో కమిటీలు సూచనలు ఇచ్చినా అమలు మాత్రం జరగలేదు. దీనిపై పార్లమెంట్‌లో లోతైన చర్చతో పాటు ఆచరణాత్మక నిర్ణయాలు తప్పనిసరిగా రావాలి.

మరో ప్రధాన సమస్య రాజకీయాల్లో నేర చరితులు. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తులు ఎన్నికల రాజకీయాల్లో రోజురోజుకు పెరుగుతున్నారు. రాజకీయాలను, పార్టీలను, ప్రభుత్వాలను వారే శాసిస్తున్నారు. కేసులు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే చర్యలు తీసుకోవాలి. ‘తప్పు నిరూపించబడే వరకు నిర్దోషి’ అనే చట్టపరమైన న్యాయ సూత్రం ఉన్నా, తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు ఉన్న వ్యక్తులు శాసన, చట్ట సభల్లో ఉండటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఈ అంశంపై కూడా పార్లమెంటులో అఖిలపక్ష చర్చ జరగాలి.

ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, తప్పిదరహితంగా మార్చడానికి ఏం చేయాలనేది? బ్యాలెట్ పద్ధతా? ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగమా? వీటిపై ఏకాభిప్రాయ సాధన అవసరం. అధికారంలో ఉన్న పార్టీలపై, విపక్షాలు ఓడిన ప్రతిసారీ ఓటింగ్ యంత్రాలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. గెలుపోటములు మారినా, ఓడిన వారి పద్ధతి మారడం లేదు. అంటే ట్యాంపరింగ్ కు నిజంగా అవకాశం ఉందా? లేదా? ఉంటే గనక ఈవీఎంల వినియోగం ఎందుకు? ఒకవేళ ఆ అనుమానాలే ఉంటే, తొలగించాలి. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? ప్రతిపక్షం ఈవీఎంలపై అభ్యంతరాలు లేవనెత్తితే, వాటినే వినియోగించాలనడంలో అధికార పార్టీ ఔచిత్యమెంత? దీనిపై చర్చ జరగడమే కాదు. భవిష్యత్తులో అనుమానాలకే తావులేని, ఓ నిర్ణయం తీసుకోవడం అందరికీ, ముఖ్యంగా ప్రజాస్వామ్య మనుగడకు మంచిది.

వీటితోపాటు ఓటర్ల జాబితాలు తప్పులు లేకుండా ఉండటం, ఓటర్లకు అవగాహన కల్పించడం కూడా ముఖ్యం. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, అబద్ధ ప్రచారం, తప్పుడు సమాచారం వ్యాప్తి వంటి సమస్యలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతున్నందున, వీటిని నియంత్రించే విధానాలు కూడా రూపుదిద్దాలి.

ప్రతి ఎన్నిక తర్వాత వ్యవస్థలోని లోపాలను చర్చించడమే కాకుండా, వాటిని సరిదిద్దాలి. ఎన్నికల కమిషన్‌కు మరింత స్వతంత్రత, ఆర్థిక స్వయం ప్రతిపత్తి ఇవ్వడంపై కూడా చర్చించాలి.
భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు ఎన్నికల వ్యవస్థ బలోపేతంపై ఆధారపడి ఉంది. ఇది కేవలం రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం కాదు, దేశంలోని ప్రతి ఓటరు హక్కును కాపాడేందుకు అవసరమైన చర్య. కాబట్టి సమగ్ర ఎన్నికల సంస్కరణలపై భారత పార్లమెంట్‌లో సమగ్రమైన, బాధ్యతాయుతమైన చర్చ జరగడం అనివార్యం. మరి ఈ దిశగా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయా? చర్చిస్తాయా?

Latest News

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News