Tuesday, August 4, 2026
29.8 C
Hyderabad

అంతా పెద్దాయనే చేశారు!?|KCR|HARISHRAO|EATALA RAJENDER|KALESHWARAM COMMISSION

– అప్పుడు, SUB COMMITTEE|సబ్ కమిటీ కూడా వేశారు!
– CARPORATION|కార్పొరేషన్ ఏర్పాటు చేశారు!!
– CABINET|కేబినెట్ నిర్ణయాల మేరకే పనులు చేశారు!!!
– KALESHWARAM|కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల జవాబులు
– లోపల ఒకటి బయట మరొకటి చెప్పారా?
– TELANGANA|తెలంగాణ ప్రజల అనుమానాలు!?

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై KCR|కేసీఆర్ గుండెల్లో ఈటెలు దింపుతారనుకున్న EATALA RAJENDER|ఈటల మాటలు మాత్రమే చెప్పి వచ్చారా? కమిషన్ ముందు ఒకలా చెప్పి, బయట మరోలా మాట్లాడారా? చిక్కడు దొరకడులా సమాధానాలిచ్చారా? కమిషన్ కు తాను దొరకకుండా, కేసీఆర్ ను దొరక బుచ్చకుండా, హరీశ్ రావు కు ఎలాంటి హానీ జరగకుండా, అత్యంత జాగ్రత్తగా, తెలివిగా, లీగల్ గా కమిషన్ కు జవాబిచ్చారా? కమిషన్ ఎత్తుకు పై ఎత్తుగా జవాబిచ్చారా? ఇటు కాళేశ్వరం అవినీతి తనకంటకుండా అటు మరెవ్వరికీ అంటనివ్వకుండా, రాజకీయంగా తన భవిష్యత్తును మరింత భద్రం చేసుకున్నారా? కమిషన్ వేసిన, ప్రశ్నలు ఈటల చెప్పిన జవాబుల తీరును పరిశీలించినా, విచారణ అనంతరం బయటకు వచ్చిన ఈటల మాటలను విశ్లేషించినా అవుననే అనిపిస్తున్నది. పైగా తన నిజాయితీని, బీజేపీ నిబద్ధతను సమర్ధించుకుంటూ, కమిషన్ నివేదికను బటయ పెట్టాలని ఈటల చేసిన డిమాండ్ కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేదే. అయితే, ఎక్కడా బీఆర్ఎస్ కు గానీ, అప్పటి ప్రభుత్వానికి గానీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా జాగ్రత్త పడినట్లు ఆయన మాటలే అర్థం చేస్తున్నాయి. ఇవన్నీ ఆయన HARISH RAO|హరీశ్ రావుతో భేటీ అయింది నిజమేనన్నట్లు, పెద్దాయన డైరెక్షన్ లోనే నడుచుకున్నట్లు, బీఆర్ఎస్ తో అంటకాగినట్లు చెప్పకనే చెబుతున్నాయి.

‘‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి… అన్యుల మనముల్ నొప్పించక… తానొవ్వక…’’ అన్నట్లుగా అత్యంత ధన్యుడిగా కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు సమాధానాలిచ్చి బయట పడ్డారు మాజీ మంత్రి, ప్రస్తుత మల్కాజీగిరి ఎంపీఈటల రాజేందర్. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు 113వ సాక్షిగా మాజీ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం హాజరయ్యారు. 40 నిమిషాల పాటు విచారణ సాగింది. బ్యారేజీల నిర్మాణం, కాలేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్‌పై మొత్తం 19 ప్రశ్నలను కమిషన్ ఈటలకు సంధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ ను ఎక్స్ పర్ట్, టెక్నికల్, సబ్ కమిటీల నిర్ణయాలకు అంటగట్టి, ప్రాజెక్టు డిపిఆర్, నిర్మాణం బాధ్యతలని కేబినెట్ కి, తానే ఆర్థిక మంత్రినైనప్పటికీ, ఆ బాధ్యత తనకు లేనే లేదని చెప్పి ఈటల తప్పించుకున్నారు. ఇదే సమయంలో అప్పటి ప్రభుత్వాన్ని, తనకు మంత్రి పదవినిచ్చిన కేసీఆర్ ని, హరీశ్ రావులని కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జవాబులిచ్చి తప్పించేశారు.

క్యాబినెట్ నిర్ణయాల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేశారని ఈటెల చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్‌కు సంబంధం లేదని, కార్పొరేషన్ పూర్తిగా ఇరిగేషన్ శాఖ పరిధిలో పని చేసిందని అన్నారు. తుమ్మడి హట్టి దగ్గర కట్టాల్సిన బ్యారేజీని కాదని, టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు.. కేబినెట్ నిర్ణయం తీసుకుందని సమాధానం ఇచ్చారు. అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది. కేబినెటేనన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డిజైన్లు, నిర్మాణంతో సంబంధం ఉందా? అంటే తనకేం సంబంధం లేదని చెప్పానన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్‌పై అధికారం ఉండేదా అంటే తనకు ఎలాంటి అధికారం లేదని చెప్పినట్లు తెలిపారు. కాళేశ్వరం నిర్మాణం క్వాలిటీ గురించి ఇంజనీర్లు చూసుకోవాలని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ నాయకత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశారు, సబ్ కమిటీ, సీడబ్ల్యూసీ రిపోర్ట్ ఆర్థిక శాఖ ముందు పెట్టారని తెలిపారు.

మొదట రూ.63వేల కోట్ల అంచనాతో ప్రారంభం అయితే.. రైతుల డిమాండ్ మేరకు రూ.82 వేల కోట్లకు పోయిందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 ఫీట్ల ఎత్తు నుంచి 148 ఫీట్లకు కుదించామన్నారు.

విచారణ తర్వాత బయటకు వచ్చిన ఈటల మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ అని ఆయనే చెప్పుకున్నారని, ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ఆనాటి ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై నిర్ణయం తీసుకుంది కేసీఆర్ అని, అప్పుడు ఆయనే బాస్ అన్నారు.

మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పాప పంకిలంలోఈటల తాను ఇరుక్కోకుండా, అప్పటి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావును ఇరికించకుండా అత్యంత జాగ్రత్తగా సమాధానాలు చెప్పినట్లుగా తేలిపోయింది. పైగా, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను త్వరగా బయటపెట్టాలని, నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు. అప్పటి దాకా ఊరుకునేది లేదని తన రాజకీయ పరిణతిని ప్రదర్శించారు. అయితే 25 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నట్లు తెలిపారు. మరి పార్టీలు మారడం ఏ విలువల కిందకు వస్తుందో ఆయనే చెప్పాలి. ‘మా బతుకులో నిబద్ధతతో ఉంది… నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా. కొందరు బట్టకాల్చి మీదేస్తే నాకేమీ కాదు’ అని కూడా అన్నారు. బహుషా తాను కమిషన్ ఎదుట చెప్పిన జవాబులపై వచ్చే విమర్శలను కూడా ఈటల ముందే ఊహించినట్లున్నారు.

ఈటెలను అడిగిన ప్రశ్నలు ఇవే!

కమిషన్: మూడు బ్యారేజీల నిర్ణయం ఎవరిది? ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు?
ఈటెల: క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది… తర్వాతే నిర్మాణం జరిగింది.
కమిషన్: మూడు బ్యారేజీలు అక్కడ కట్టకూడదని టెక్నికల్ కమిటీ రిపోర్టు ఇచ్చిందా ?
ఈటెల: టెక్నికల్ కమిటీ చాలా రిపోర్టులు ఇచ్చింది. ఫైనల్‌గా మూడు బ్యారేజీల నిర్మాణం నిర్ణయం కేబినెట్ తీసుకుంది.
కమిషన్ : రీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు?
ఈటెల: మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు. హరీష్ రావు చైర్మన్‌గా సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాం. ఎక్స్ పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగింది.
కమిషన్: రీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా?
ఈటెల: రీ డిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసింది.
కమిషన్: డీఆర్పీ కోసం 597.45 లక్షలు వ్యాప్కోన్ సంస్థకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా?
ఈటెల: తెలీదు.
కమిషన్: డీపీఆర్ అప్రూవల్ కేబినెట్‌లో జరిగిందా?
ఈటెల: అన్ని అనుమతులు కేబినెట్లో తీసుకున్నాం.
కమిషన్: కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం ఏర్పాటు చేశారు?
ఈటెల: నిధుల సమీకరణ, లోన్స్ కోసం ఏర్పాటు చేశారు. ఫైనాన్స్‌ పరిధిలోకి కార్పొరేషన్ రాదు.
కమిషన్: లోన్స్ రీపేమెంట్ ఎలా చేయాలి అనుకున్నారు?
ఈటెల: కార్పొరేషన్ నుంచి నిధులను కలెక్షన్ చేసి లోన్స్ రీపేమెంట్ చేయాలని అనుకున్నాం. కానీ కార్పొరేషన్ ద్వారా నిధులు కలెక్షన్ కాలేదు.
కమిషన్: ప్రాజెక్టు నిర్మాణం బడ్జెట్‌ ద్వారా జరిగిందా?
ఈటెల: నిధుల విడుదల అంతా కార్పొరేషన్ ద్వారానే జరిగాయి. ఆర్థిక శాఖకు సంబంధం లేదు.
కమిషన్: మూడు బ్యారేజీలు అక్కడ కట్టేది కాదని అంటే మీరేమంటారు?
ఈటెల: ఎక్కడ ఏ బ్యారేజీ కట్టాలన్నా టెక్నికల్ టీం చెప్తుంది.
కమిషన్: ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు అంటే?
ఈటెల: అదంతా ఫైనాన్స్‌ శాఖ కిందికి రాదు. ఇరిగేషన్ శాఖ కిందికి వస్తుంది.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News