Friday, September 18, 2026
26.2 C
Hyderabad

నన్ను మీ బిడ్డలా.. అదరించారు

ఈ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి రుణం తీర్చుకుంటా….

– పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి

ఘనంగా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు

పాలకుర్తి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు

పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే హనుమాండ్ల యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత నిరాడంబరంగా, ఘనంగా జరిగాయి. అభివృద్ధికి మారు పేరు అయిన ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలు శాసన సభ్యురాలు యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథిగా హాజరవ్వగా, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి.

ఆదివారం రాత్రి 12:00 గంటలకు స్టాఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసిన ఆమె ఆ తరువాత ఉదయం పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో వారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు అందచేశారు. అనంతరం కొడకండ్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల నాయకులు, తొర్రూరు పట్టణ నాయకులు, మహిళ నాయకులు వేరు వేరుగా ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తరువాత తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 2వ వార్డులో పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అక్కడి నుండి నేరుగా రాయపర్తి మండల కేంద్రానికి చేరుకొని అక్కడి నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు పెన్నులు, బుక్స్ పంపిణీ చేశారు. ఆ తరువాత రాయపర్తి మండలం, జింకరాం తండాలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ తరువాత దేవరుప్పుల మండలం, సీతారాంపురం గ్రామంలో ప్రేమ సదన్ వృద్ధ ఆశ్రమంలో వృద్ధులు, అనాథల మధ్య జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి కేక్ తినిపించి, వారి కుటుంబం తరుపున నిత్యావసర వస్తువులు, బట్టలు, పండ్లు, బిస్కెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఇవే గాక నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఆరు మండల కేంద్రాల్లో నాయకులు, కార్యకర్తలు జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు ఘనంగా జరిపారు. కాగా ఆయా కార్యక్రమాలలో స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

ఆయా సందర్భాలలో ఎమ్మెల్యే హనుమాండ్ల యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి లు మాట్లాడుతూ, ఎంత సంపాదించినా సేవా కార్యక్రమాల వల్ల కలిగే సంతృప్తి మరెందులోనూ కలగదని అందుకే తమ కుటుంబం మొత్తం పాలకుర్తి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలకు అంకితమైందని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లాలి అన్నదే తమ సంకల్పమని వారు తెలిపారు. తమను ఆదరించి గెలిపించిన పాలకుర్తి ప్రజలకు మేము రుణపడి ఉంటాం అన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం అన్నారు.

ఈ కార్యక్రమాలలో తొర్రూరు మార్కెట్ చైర్మెన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు, ఆరు మండలాల అధ్యక్షులు, బంధు మిత్రులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే యశస్విని జన్మదిన వేడుకలు

ఎమ్మెల్యే పై నియోజకవర్గమే గాక, రెండు రాష్ట్రాల్లో వెల్లివిరుస్తున్న అభిమానం

పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే హనుమాండ్ల యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి పై తను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతమే గాక, రాష్ట్రం దాటి, ప్రక్క రాష్ట్రంలో కూడా అభిమానులు ఏర్పడి వారి జన్మదినం సందర్భంగా వారిపై ప్రేమలు, ఆప్యాయతలు వెల్లివిరుస్తున్నాయి. అందులో భాగంగా హనుమాండ్ల రాజేందర్ రెడ్డి గారి కుటుంబ అభిమాని, ఆంధ్రప్రదేశ్ వాసి రఘు పుల్లా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి జన్మదినం సందర్భంగా అన్న ప్రసాద వితరణ చేపట్టారు. అలాగే కాకినాడలో మహర్షి సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో కూడా కేక్ కట్ చేయించి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పాల్గొన్న ప్రజలు ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News