నమ్మలేక పోతున్నరు కదా? నిజంగా ఇది నిజమేనుల్లా.. బంగారం నది ఎక్కడో కాదు. మన దేశంలనే ఉన్నది. గా నదిల నీల్లతోపాటే బంగారం కూడ కొట్టుకొత్తది. ఇగ గా బంగారానికి సర్కారే ఏలం ఏత్తాంది. జనం గూడ గా బంగారం నదిల బంగారాన్నేరుకుని, గదాన్ని అమ్ముకుని బతుకుతున్నరు. గీ ముచ్చట హరియాణలోని యుమునానగర్ ల జరుగుతాంది. ఇగో కావాల్నంటే గా యివరాలు సూడుండ్లి.

మన దేశానికి ఉత్తారన ఉన్న హిమాలయ పర్వతాల నుంచి హిమాచల్ ప్రదేశ్ మీదుగా బోలీ నది పారుతది. గా గుట్టలల్ల బంగారం ఉంటదట. గది మెల్లెగ కరుక్కుంట.. గా నదిల కలిసి శిన్న శిన్న తునకల లెక్క పారుతదట. ఇగ గా నదీతీర ప్రాంతాల్ల ఉండే జనం, గా నదిల కొట్టుకొచ్చే గా బంగారాన్నేరుకుని, అమ్ముకుని, పొట్ట నింపుకుంటాండ్లు. ఇగ గిదంత పని కాదని, గా రాష్ట్ర సర్కారే గా నదిల బంగారాన్ని ఏరుకునే టెండర్లు పిలిచిందట. ఇగ గా టెండర్లు పట్టినాయినె గా సుట్టుముట్టు ఊల్లల్ల ఏరి, యేడి శేసి, ముద్ద లెక్క ఇస్తే, పైసలిస్తాండ్లట. కనీ, రోజంతా గా నదిని గాలిత్తే, ఒక్కొక్కలికి గ్రాము, గ్రామున్నర దొరుకుతదట. గా నది మనకెలి గూడ పారుకుంట వత్తే బాగుండు కదా?

