కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు అసెంబ్లీలో చర్చలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి మీడియాతో చిట్ చాట్ చేశారు. అందులో భాగంగా గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉందన్నారు. ఎవరో అడిగారని ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం తనకు లేదన్నారు. గాంధీ కుటుంబానికి నేను ఎవరో తెలియకుండానే..
నన్ను పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రిగా చేశారా… అంటూ తనపై ఆరోపణలు చేస్తున్న వారికి తెలియదా…. అంటూ విమర్శించారు. నిధులకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను.. కేంద్ర మంత్రి గా వున్న కిషన్‌రెడ్డి పట్టించుకోవడంలేదని, వారిని గెలిపించిన ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారో వారే ఆలోచించుకోవాలన్నారు. అలాగే నేను ఆరు గ్యారంటీలకు నిధులు అడగడం లేదని, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న RRR, మెట్రో, మూసీ ప్రాజెక్టులకు నిధులు అడుగుతున్నాను అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేను చేసినన్ని పాలసీలు ఎవరూ చేయలేదని, రాష్ట్రానికి రూ.2.2 లక్షలకోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో అనేక ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ రేటును 8.8 నుంచి 6.1 శాతానికి తగ్గించామన్నారు.
కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు అసెంబ్లీలో చర్చలకు రావాలి – సీఎం రేవంత్

