గిదేం ఇచ్చెంత్రం అని ఆశీరపోతుండ్రా!? నిజంగా ఇది నిజమేనుల్లా! గీ శెట్టుకు 234 రకాల మామిడి పండ్లు కాసినయి. గా శెట్టు దగ్గర నిల్సోని సాక్షాత్తు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహానే గీ శెట్టు గురించి శెప్పిండు. నమ్మశెక్కెం లేకున్నా, నమ్మి తీరాల్సిందే! మరి.

ఉత్తర ప్రదేశ్ రాస్ట్రం లక్నోల ఉండే ఐసీఏఆర్ సీఐఎస్ హెచ్ లో గా యెవుసం శాత్రవేత్తలు అద్భుతం అనబడే గీ ప్రయోగం శేసిండ్రు. ముందుగ 50ఏండ్ల ఓ మామిడి శెట్టును 16 ఫీట్లకు కోసేసిండ్రు. ఇగ గీ శెట్టుకు క్లోనింగ్ అంటే, సంకరం శేసిండ్రు. ఇగ కొద్ది కాలానికి గా శెట్టు ఇగురు పెట్టి, పూత పూసి, కాయలు కాసింది. గా శెట్టుకున్న కాయల్ని లెక్క గట్టి మరీ 234 రకాల కాయలున్నట్లు గుర్తించిండ్రు. గీ ముచ్చటను కేంద్ర మంత్రికి చెప్పగా, గాయినె ఏకంగా ఆడికే వచ్చి, గా ఇచ్చెంత్రాన్ని పపంచానికి సాటి సెప్పిండు. ఒక్క శెట్టుకే వందల రకాల రుసులన్నమాట. మీగ్గూడా నోరూరుతాంది గదా?

