ఫిబ్రవరి 19 నుండి 23 వరకు యాదగిరిగుట్టలో జరగనున్న శ్రీశ్రీ సుదర్శన లక్ష్మీనారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేకానికి సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ఆలయ ఈవో, అర్చకులు కలిసి ఆహ్వానించారు. స్వర్ణ గోపుర కుంభాభిషేకం ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్న ఈ మహోత్సవానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ప్రధాన దివ్య విమానం గోపురంపై కుంభాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు.

