Friday, September 18, 2026
26.4 C
Hyderabad

ఇంతకీ, ఆ పెద్దాయనెవరు!?|BRS|KCR|KTR|HARISH RAO

తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ట్యాపింగ్ కేసులో హరీశ్ రావును విచారించిన సమయంలో పదే పదే సిట్ ప్రశ్నించిన నేపథ్యంలో పోలీసు అధికారులు తమ వాంగ్మూలాలలో చెబుతోన్న ఆ పెద్దాయన ఎవరు? కేసీఆరా? కేటీఆరా? హరీశ్ రావా? సిట్ విచారణ చేస్తోందా? హరీశ్ రావు చెప్పినట్లు ‘ఆ పెద్దాయన’ను టార్గెట్ చేస్తోందా? చివరకు ఏం తేలనుంది? ట్యాపింగ్ కేసులో ‘ఆ పెద్దాయన’ మిస్టరీ, సిట్ విచారణ, రాజకీయాల్ని ఏ దిశగా తీసుకెళ్తోంది?

హైదరాబాద్, జనవరి 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా తెరపైకి వచ్చిన “ఆ పెద్దాయన” వ్యాఖ్య ఇప్పుడు అసలు కేంద్రబిందువుగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నేతగా భావిస్తున్న హరీశ్ రావును సిట్ పదే పదే విచారించిన సమయంలో, పోలీసు అధికారులు తమ వాంగ్మూలాల్లో ప్రస్తావించిన ‘పెద్దాయన’ ఎవరు? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ పెద్దాయన మాజీ సీఎం కేసీఆరా? కేటీఆర్‌నా? లేక మరో శక్తివంతమైన రాజకీయ కేంద్రబిందువేదైనా ఉందా? అన్న సందేహాలు సహజంగానే ఉద్భవిస్తున్నాయి. విచారణ తీరును గమనిస్తే, సిట్ అడుగులు చాలా జాగ్రత్తగా, లోతుగా పడుతున్నట్లు కనిపిస్తోంది. అధికారుల వాంగ్మూలాల్లో ఒకే రకమైన పదజాలం, ఒకే రకమైన సంకేతాలు వినిపించడం వెనుక యాదృచ్ఛికత ఉందా? లేక అలా చెప్పాలనే ఆదేశాలు ఒకే కేంద్రం నుంచి వచ్చాయా? అనే కోణంలో సిట్ ప్రశ్నలు సాగుతున్నట్లు సమాచారం. హరీశ్ రావు తన విచారణ అనంతరం చేసిన వ్యాఖ్యలు ఈ విచారణను మరింత వివాదం చేస్తున్నాయి. ‘ఒక పెద్దాయనను టార్గెట్ చేయడానికే ఈ విచారణ’ అని ఆయన అనడం ద్వారా, సిట్ ఉద్దేశాలపైనా, ప్రభుత్వ వైఖరిపైనా ఆయన పరోక్షంగా ప్రశ్నలు లేవనెత్తారు.
అయితే సిట్ మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా, సాక్ష్యాధారాల ఆధారంగానే ముందుకు వెళ్తున్నామన్న సంకేతాలనే ఇస్తోంది. ట్యాపింగ్ కేసు స్వభావం చాలా సున్నితమైనది. అధికార యంత్రాంగం, నిఘా వ్యవస్థలు, రాజకీయ నిర్ణయాలు. కలగలిసిన చోటే ఈ కేసు కేంద్రీకృతమై ఉంది. అందుకే ‘పెద్దాయన’ అనే పదం కేవలం వ్యక్తిని సూచించేదా? లేక ఒక వ్యవస్థాత్మక ఆదేశాల శ్రేణినే సూచించేదా? అన్న ప్రశ్నకు కూడా ప్రాధాన్యం ఏర్పడింది. కేసీఆర్ అయితే, అది రాష్ట్ర స్థాయి అత్యున్నత రాజకీయ బాధ్యతను సూచిస్తుంది. కేటీఆర్ అయితే, పార్టీ. ప్రభుత్వంలో రెండో స్థాయి శక్తికేంద్రం దిశగా విచారణ మళ్లినట్లవుతుంది. హరీశ్ రావు అయితే, ఇప్పటికే విచారణలో ఉన్న వ్యక్తే కావడంతో ‘పెద్దాయన’ అన్న పదానికి అర్థం మారిపోతుంది.

ఈ నేపథ్యంలో పోలీసు అధికారుల వాంగ్మూలాలే కీలకంగా మారాయి. వారు ప్రత్యక్షంగా పేర్లు చెప్పకుండా, ‘పెద్దాయన’ అనడం వెనుక చట్టపరమైన జాగ్రత్తలున్నాయా? లేక రాజకీయ భయాలున్నాయా? అన్నది మరో చర్చ. సిట్‌కు ఇప్పుడు ఎదురవుతున్న అసలు సవాల్ ఇదే. పేర్లు బయటకు చెప్పకుండా, కానీ నిజాన్ని వెలికి తీయడం. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును బీఆర్ఎస్ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా చూపాలని ప్రయత్నిస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం దీనిని రాజకీయ కక్షసాధింపుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది.

మరి ఈ రాజకీయ పరమపదసోపానంలో సిట్ ఎంతవరకు స్వతంత్రంగా ముందుకు సాగగలుగుతుంది? అన్నది కీలక ప్రశ్న. ప్రజలు మాత్రం ఒక స్పష్టమైన సమాధానాన్ని ఆశిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే స్థాయిలో ట్యాపింగ్ జరిగిందా? జరిగితే ఆదేశాలు ఎవరి నుంచి వచ్చాయి? చివరకు ఏం తేలనుంది? అన్నదానిపై ఇప్పుడే తుది నిర్ణయం చెప్పడం కష్టం. కానీ విచారణ సాగుతున్న తీరును చూస్తే, ‘ఆ పెద్దాయన’ మిస్టరీని సిట్ పక్కాగా ఛేదించాలనే సంకల్పంతోనే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసు తుది ఫలితం ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థను మాత్రమే కాదు. తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య విశ్వాస యుద్ధాన్నే కొత్త దశకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ట్యాపింగ్ కేసులో నిజం బయటపడితే, అది రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలవడం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News