దర్దేపల్లిలో శివాజీ విగ్రహావిష్కరణలో వక్తలు
https://youtu.be/ob5iULemRU0?si=kvO6upH2X0vEZ8wz
అన్ని తరాలకు ఆదర్శమైన జీవితం ఛత్రపతి శివాజీదని వందేమాతరం రవీందర్ రావు అన్నారు. శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లిలో శివాజీ యువసేన ఆధ్వర్యంలో బుధవారం ప్రతిష్టించిన శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విగ్రహావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ భరతమాత ముద్దు బిడ్డ అని, ఆదర్శవంతమైన శివాజీ మహారాజు చరిత్ర భవిష్యత్ తరాలకు అవసరమని అన్నారు. గ్రామానికి చెందిన గిరగాని సమ్మయ్య శిష్యులంతా కలిసి చేపట్టిన ఈ కృషికి ఆయన ధన్యులయ్యారన్నారు. శివాజీ యువసేన సభ్యులను, ఆర్థిక సహాయం అందించిన దాతలను అభినంచారు.
https://youtu.be/aPPA6DojOJU?si=YP8_Ul_8CJieaI_F
విగ్రహ దాత, రిటైర్డ్ ఉపాధ్యాయుడు సిద్ధం వాసుదేవరావు మాట్లాడుతూ, యువత దేశానికి వెన్నెముక అని, వారు చేస్తున్న ఈ మంచి కార్యానికి ప్రోత్సాహకంగా తన వంతుగా సహాయం చేశానని అన్నారు.
https://youtu.be/Gf5R_Pe6IPw?si=MDT_4DW2N_XitOo2
విగ్రహ దాత, రిటైర్డ్ ఉపాధ్యాయుడు సిద్ధం వాసుదేవరావు మాట్లాడుతూ…. యువత దేశానికి వెన్నెముక అని, వారు చేస్తున్న ఈ మంచి కార్యానికి తన వంతుగా ఉడత సహాయం చేశానని అన్నారు. తప్పు చేస్తే తిట్టే మనం మంచి చేస్తే వారికి మన వంతు బలం అందించడం మన బాధ్యత అన్నారు.

మరో దాత, ఉపాధ్యాయుడు గిరగాని సమ్మయ్య మాట్లాడుతూ, తన వద్ద చదువుకున్న పిల్లలు ఈ రోజు ఇలాంటి మహనీయుడి విగ్రహాన్ని పెట్టడం తనకు ఆనందాన్నిచ్చిందన్నారు. శివాజీని ఆదర్శంగా తీసుకుని మంచి సమాజాన్ని నిర్మించాలని చెప్పారు.

https://youtu.be/JHvIyMtVfBc?si=JyvKs4Q-Rc94VOP-
ఇదే సందర్భంలో సహకరించిన దాతలను యువసేన సభ్యులు ఘనంగా సత్కరించారు. అంతకముందు గ్రామంలో శివాజీ యువసేన ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ ప్రజలకు భారీ ఎత్తున మహా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, శివాజీ యువసేన సభ్యులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.


