Monday, August 3, 2026
31.5 C
Hyderabad

‘ఫ్యూచర్ సిటీ’ ఫ్యూచరేంటి!?|EDITORIAL

వాస్తవికంగా చూస్తే వచ్చే రెండేళ్లలో పూర్తి స్థాయి “ఫ్యూచర్ సిటీ” రూపుదిద్దుకోవడం అసాధ్యం. గరిష్టంగా భూసేకరణ, ప్రధాన రహదారుల నిర్మాణం, కొన్ని పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభ మౌలిక వసతుల ఏర్పాట్లకే ప్రభుత్వం పరిమితం కావచ్చు. ఈ ప్రాజెక్టు నిజమైన విజయాన్ని నిర్ణయించేది ఎన్నికల ప్రచారాలు కాదు. దశాబ్ద కాలం పాటు కొనసాగే స్థిరమైన విధానాలు, ఆర్థిక సామర్థ్యం, పరిపాలనా కట్టుదిట్టతే. లేకపోతే “ఫ్యూచర్ సిటీ” కూడా భారత రాజకీయాల్లో మరో అసంపూర్తి కలగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త!

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో, పరిపాలనా వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నెట్-జీరో అర్బన్ మోడల్, డేటా సిటీ, హెల్త్ క్లస్టర్, బుల్లెట్ ట్రెయిన్ కనెక్టివిటీ వంటి అంశాలతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం భవిష్యత్ తెలంగాణకు ప్రతీకగా ప్రదర్శిస్తోంది. అయితే ఈ విజన్ ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. నిధుల లభ్యత, అమలు సామర్థ్యం, రాజకీయ స్థిరత్వం, పరిపాలనా ప్రాధాన్యతలు వంటి అంశాలు ఈ ప్రాజెక్టు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

ఒక నగరాన్ని నిర్మించడం అనేది కేవలం భూములు కేటాయించడం లేదా పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించడం ద్వారా సాధ్యమయ్యే పని కాదు. ప్రపంచంలోని విజయవంతమైన నగరాలన్నీ దశాబ్దాల పాటు జరిగిన నిరంతర ప్రణాళిక, భారీ ప్రజా పెట్టుబడులు, ప్రైవేట్ భాగస్వామ్యం, రాజకీయ స్థిరత్వం వల్లే రూపుదిద్దుకున్నాయి. హైదరాబాద్ అభివృద్ధి కూడా అలాంటి దీర్ఘకాలిక ప్రక్రియ ఫలితమే. 1998లో అప్పటి సీఎం చంద్రబాబు సైబరాబాద్‌కు బీజం వేసిన తర్వాత, హైటెక్ సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు నగరం విస్తరించడానికి 25 ఏళ్లు పట్టింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు, ఐటీ కారిడార్లు, ప్రైవేట్ రియల్ ఎస్టేట్ విస్తరణ ఇవన్నీ కలిసి హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాయి.

ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఫ్యూచర్ సిటీకి కూడా ఇదే స్థాయి దీర్ఘకాలిక కట్టుబాటు అవసరం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఆర్థిక స్థితి పెద్ద సవాలుగా మారింది. రాష్ట్ర అప్పులు లక్షల కోట్లకు చేరువయ్యాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. సంక్షేమ పథకాల అమలుకు ప్రతి ఏడాది భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది. రైతు భరోసా, ఉచిత బియ్యం, విద్యుత్ సబ్సిడీలు, మహిళా సంక్షేమ పథకాలు వంటి కార్యక్రమాలు ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. సంక్షేమం అవసరమే అయినా, అదే సమయంలో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన మూలధన వ్యయం తగ్గిపోతున్నదన్న విమర్శలు ఉన్నాయి.

ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో కనీస మౌలిక వసతులే పూర్తిస్థాయిలో లేవు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, కాలువ వ్యవస్థ, ప్రజా రవాణా, నివాస వసతులు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ ఇవి లేకుండా పెద్ద కంపెనీలు లేదా ప్రజలు అక్కడికి వెళ్లే పరిస్థితి ఉండదు. కేవలం 500 ఎకరాలు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు కేటాయించడం ద్వారా నగరం రూపుదిద్దుకోదు. ప్రభుత్వం ప్రకటించిన 1,500 ఎకరాల డేటా సిటీ, హెల్త్ క్లస్టర్, ఇండస్ట్రియల్ పార్క్ వంటి ప్రతిపాదనలు ఆకర్షణీయంగానే ఉన్నా, వాటి అమలుకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరం.

ఇక్కడ మరో కీలక అంశం రాజకీయ స్థిరత్వం. భారతదేశంలో అనేక మెగా ప్రాజెక్టులు ప్రభుత్వ మార్పులతో నిలిచిపోయిన ఉదాహరణలు ఉన్నాయి. అమరావతే దీనికి స్పష్టమైన ఉదాహరణ. అమరావతి నిర్మాణానికి కేంద్ర సహాయం, ప్రపంచ బ్యాంక్ ఆసక్తి, విస్తృత భూసేకరణ ఉన్నప్పటికీ, ప్రభుత్వ మార్పు తర్వాత ప్రాజెక్టు దాదాపు ఆగిపొయింది. అలాగే పోలవరం పూర్తి కావడానికి 15 ఏళ్లు పట్టింది. ఈ అనుభవాలు పెట్టుబడిదారుల్లో సహజంగానే అప్రమత్తత పెంచుతాయి. “2029 తర్వాత కూడా ఇదే విధానాలు కొనసాగుతాయా?” అన్న సందేహం ఉంటే పెద్ద పరిశ్రమలు త్వరగా ముందుకు రావు.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి ఎంపికను అధిష్ఠానం నిర్ణయిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ముందుగానే నాయకత్వంపై ధీమా వ్యక్తం చేయడం పార్టీలోని ఇతర వర్గాలకు అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. అంతేకాక, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా పరిపాలనలో స్పష్టమైన ఫలితాలు చూపించడం కూడా కీలకం. ప్రస్తుతం కొంతమంది మంత్రులు సమన్వయం లేకుండా పనిచేస్తున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మెగా ప్రాజెక్టులను సమర్థంగా ముందుకు తీసుకెళ్లడం అంత సులభం కాదు. ఈ విషయాలేవీ సీఎం రేవంత్ రెడ్డికి తెలియదనుకోలేం.

అయితే ఫ్యూచర్ సిటీ ఆలోచనను పూర్తిగా కొట్టిపారేయలేం. భవిష్యత్ పట్టణీకరణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయ విస్తరణ కేంద్రాన్ని సృష్టించాల్సిన అవసరం నిజంగానే ఉంది. ఐటీ, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, హెల్త్ టెక్నాలజీ రంగాల్లో తెలంగాణకు అవకాశాలు ఉన్నాయి. సరైన ప్రణాళిక, దశలవారీ అమలు, పారదర్శక పెట్టుబడి విధానాలు, కేంద్ర సహకారం ఉంటే ఈ ప్రాజెక్టు విజయవంతమయ్యే అవకాశం ఉంది.

అయితే వాస్తవికంగా చూస్తే వచ్చే రెండేళ్లలో పూర్తి స్థాయి “ఫ్యూచర్ సిటీ” రూపుదిద్దుకోవడం అసాధ్యం. గరిష్టంగా భూసేకరణ, ప్రధాన రహదారుల నిర్మాణం, కొద్ది పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభ మౌలిక వసతుల ఏర్పాట్లతో ప్రభుత్వం పరిమితం కావచ్చు. ఈ ప్రాజెక్టు నిజమైన విజయాన్ని నిర్ణయించేది ఎన్నికల ప్రచారాలు కాదు. దశాబ్ద కాలం పాటు కొనసాగే స్థిరమైన విధానాలు, ఆర్థిక సామర్థ్యం, పరిపాలనా కట్టుదిట్టతే. లేకపోతే “ఫ్యూచర్ సిటీ” కూడా భారత రాజకీయాల్లో మరో అసంపూర్తి కలగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త!

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News