యూజీసీ-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC-NET) 2024 పరీక్షలు జనవరి 3 నుంచి 16 వరకు రెండు సెషన్లలో జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, జన్మదిన తేదీ, సెక్యూరిటీ పిన్ వివరాలతో అధికారిక వెబ్సైట్ (https://ugcnet.nta.ac.in/) లో లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోటో, బార్ కోడ్, క్యూ ఆర్ కోడ్ సరిగా ఉన్నాయా అని చెక్ చేయాలని, ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే మళ్లీ డౌన్లోడ్ చేయాలని అధికారులు సూచించారు.

