గ్రామ గ్రామన బీజేపీ జెండా ఎగురవేయాలని మండల సంయోజక్ వడ్లకొండ రవి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, ఈరవెన్ను గ్రామంలో ఎంపీటీసీ ప్రవాస్ యోజనలో భాగంగా భాజపా గ్రామ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం గ్రామ అధ్యక్షులు ముస్కు ఉప్పలయ్య అధ్యక్షతన జరగగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ, ప్రతీ గ్రామంలో ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో భాజపా జెండా ఎగురవేయాలని ,ఆ దిశగా ప్రతీ కార్యకర్త పని చేయాలని అన్నారు.గ్రామీణ ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భాజపా వైపు చూస్తున్నారని, ప్రజలని కమలం గుర్తుకు వోట్ వేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుంది అని అవగాహన పర్చాలని అన్నారు, దీనితో పాటు ఈరవెన్ను,గూడూరు,తిరుమలగిరి,పాలకుర్తి గ్రామాలలో చాయిపే చర్చా, దేవాలయ సందర్శన, మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకులు దొంగరి మహేందర్, మండల శాఖ అధ్యక్షులు మారం రవికుమార్,మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల దేవరాజు,పెనుగొండ సోమేశ్వర్,జిల్లా నాయకులు కసోజు సమ్మయ్య చారి, దుంపల సంపత్, మండల ఉపాధ్యక్షులు కొడిశాల యాదగిరి,లకావత్ రవి,అమరేందర్, ఈర్ల రాజు, రాజు,శ్రీనివాస్,శంకర్,వినయ్,సతీష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

