Friday, September 25, 2026
23.6 C
Hyderabad

Water Rights|నీటి హక్కుల కోసం పోరాటం చేస్తాం

Praja Bhavan| ప్రజా భవన్‌ లో CM| సీఎం REVANTH REDDY| రేవంత్ రెడ్డి POWER POINT PRESENTATION| పవర్‌పాయింట్ ప్రసంగం

HYDERABAD| హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి హక్కుల అంశంపై కేంద్ర ప్రభుత్వం, గత పాలకులపై విరుచుకుపడ్డారు. నీళ్లు, నాగరికత ఎంత అనుబంధంగా ఉన్నాయో, అదే స్థాయిలో తెలంగాణ ప్రజల జీవితాల్లో నీటికి ప్రత్యేక స్థానం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత నీటి విషయంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వపు తప్పిదాలు తెలంగాణ రైతులను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు.

నీటి కేటాయింపుల విషయంలో రాజకీయ అహంకారం, నిర్లక్ష్యంతో కేసీఆర్, హరీష్ రావు పొరపాట్లు చేశారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015 జూన్ 18న జరిగిన రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశంలో తెలంగాణకు దారుణమైన నష్టాన్ని కలిగించేలా కెసిఆర్, హరీష్ సంతకాలు పెట్టారని, ఆ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన కల్వకుర్తి, పాలమూరు, ఎస్ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఆ ప్రభుత్వం విఫలమైందని, అందుకే 299 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకోలేకపోయిందని తెలిపారు.

తెలంగాణకు గోదావరి బేసిన్‌లో 968 టీఎంసీలను కేటాయించినప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరును మార్చి రీ ఇంజనీరింగ్ పేరుతో లక్ష కోట్లు ఖర్చు చేసి కేవలం 50 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందించడం వారికి రైతులపై ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తుందన్నారు. అదే విధంగా బనకచర్లలో తాము వాస్తవాలను వెల్లడించగా, బీఆర్ఎస్ నేతలు కుట్ర రాజకీయాలతో దాన్ని ఏదో చేశారని, చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

పెద్దమ్మ కోటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కేసీఆర్, అదే సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనలను కొనసాగించినందుకే ఈ నీటి వివాదం ఇంత తీవ్రమైందని అన్నారు. గోదావరి మిగులు జలాలపై లెక్క తేలాలంటే ముందు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడం అవసరమని, తర్వాతే మిగులు, వరద జలాలపై చర్చ జరగాలని సీఎం స్పష్టం చేశారు.

తెలంగాణ హక్కులపై రాజీ పడే ప్రసక్తే లేదని, స్పష్టం చేసిన సీఎం, నాకు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాయలసీమ రొయ్యల పులుసుతో పని లేదు. మేము కేవలం తెలంగాణ ప్రజల నీటి హక్కుల కోసమే పోరాడతామన్నారు. న్యాయసమ్మతంగా ఏపీతో కలిసి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ అదే సమయంలో ఏపీ ప్రభుత్వం తమ ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న వివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత వహించకుండా, లిటిగేషన్ల ద్వారా సమస్యను మరింత క్లిష్టం చేస్తోందని ఆయన విమర్శించారు. కిషన్ రెడ్డి వంటి బీజేపీ కేంద్ర మంత్రులు నీటి వివాదంలో మాట్లాడాల్సిన అవసరం ఉందని, కానీ ఆయన మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచి వస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల అనుమానాలకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.

బీజేపీకి ఇచ్చిన ఎంపీ సీట్ల ఆధారంగా రాష్ట్ర హక్కులను కాలరాయడం న్యాయమా? అని ప్రశ్నించారు. బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచందర్ రావును ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆయనకు ప్రధానమైన సమస్య గోదావరి జలాలే అని, దీనిపై ప్రధాని దృష్టికి తీసుకెళ్లే విధంగా తొలి కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వ మంత్రులు, అధికారులు కావాల్సిన డేటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఈ సమస్యను బీఆర్ఎస్ రాజకీయంగా, బీజేపీ వ్యూహాత్మక ప్రయోజనంగా వాడుకుంటున్నాయని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రజలకు అసలైన నిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ నిజాలు వివరించకపోతే, బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు చెప్పే అబద్ధాలే నిజాలుగా ప్రజలు నమ్మే ప్రమాదం ఉందన్నారు.

ఇక అసెంబ్లీలో రెండు రోజుల ప్రత్యేక సమావేశాలు నిర్వహిద్దామని, వచ్చే దమ్ముందా… అని సీఎం హరీష్ రావుకు సవాల్ విసిరారు. ఒక రోజు కృష్ణా బేసిన్, మరొక రోజు గోదావరి బేసిన్ పై చర్చ పెడదాం అన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో లేఖ రాసి ఈ చర్చల ఏర్పాటుకు హరీష్ రావు ముందుకు రావాలని కోరారు. చివరగా, ఈ సమావేశం కేసీఆర్‌తో పంచాయతీ కోసం కాదు, తెలంగాణ ప్రజల శాశ్వత నీటి హక్కుల సాధన కోసం అని రేవంత్ స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజల హక్కుల కోసం అన్ని రకాలుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, కేంద్రం మీద, బీజేపీ మీద దృష్టి పెట్టాల్సిన సమయం ఇదేనని సీఎం స్పష్టం చేశారు.

Latest News

SIRపై CJP సమరం..|SIR|CJP

సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్! న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో...

తెలంగాణ వార్‌రూమ్‌ టు ఢిల్లీ వార్‌రూమ్‌|TELANGANA|WAR ROOM|DELHI|WAR ROOM

రుద్ర సంతోష్‌ కుమార్‌కు ఏఐసీసీలో కీలక బాధ్యతలు హైదరాబాద్‌: తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు సమన్వయం చేసిన కాంగ్రెస్‌ నాయకుడు రుద్ర సంతోష్‌ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ...

జింబాబ్వేలో ఘనంగా గణేష్ శోభాయాత్ర|ZIMBABWE|GANESH|SHOBHA YATRA

రూ.8 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్న బద్దం నరేష్ రెడ్డి జింబాబ్వే రాజధాని హరారేలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరారే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన వేడుకలు...

యికటి0చిన ముద్దు కటకాలు సూపింది!?|ADUGU TRENDS

ము ము ముద్దంటే చేదా?! ఆ ఉద్దేశ్యం లేదా? అన్నరు. ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో తెలుసుకోకపోతే, ముద్దూ, ముచ్చటా యికటిత్తయి. కటకాలు కూడా సూపిత్తయి. ముద్దుకైన, ముచ్చటకైన...

ఊగిసలాటకు ఊతం భద్రతే!|EDITORIAL

చమురు ధరల ఊగిసలాటకు తాత్కాలిక దౌత్య పరిణామాలు మాత్రమే కాకుండా యుద్ధం, రవాణా అంతరాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ముప్పులు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొని, అంతర్జాతీయ నౌకా రవాణా సాధారణ స్థితికి...

సెప్టెంబర్ 24, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 09.33 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ధనిష్ఠ ఉదయం 09.58 వరకు ఉపరి శతభిషం యోగం ధృతి సాయంత్రం 04.34 వరకు ఉపరి శూల కరణం కౌలవ ఉదయం 09.08...

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News