Tuesday, August 25, 2026
24.2 C
Hyderabad

పూర్వ ప్రేమికులకు.. అపూర్వ ప్రేమ రోజు!?|ADUGU TRENDS

యినడానికి గిది ఇబ్బందిగనే ఉన్నా, ఇది నిజమే మరి! కాకపోతే గిది మన దేసంల కాదు. పరాయి దేశంల. ఎవలైనా వయసొచ్చినంక పేమల పడ్తరు. అందరూ గా పేమల్ని గెలపించుకోలేరు. ఐటెంక వేరెవ్వల్నో మనువాడి సంసారాలు శేసుకుంటరు. ఇగ పేమికులు కలుసుడు ఉండదు. కలిసినా మాట్లాడుకోవడాలూ తక్కువే. గందుకే మనసుకవి ఆత్రేయ శెప్పినట్లు ‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికనీ, అనుకోవడమే మనిషి పని’. కానీ, గా యియత్నాం దేసంల గట్ల కాదు. యిడిపోయి యేరేరైన గా పేమికులు ఏడాదికోపాలి కలుసుకోవడాన్కి ఏకంగా ఓ పండుగనే శేత్తాండ్రట. గా దేస పర్వత పాంత ప్రావిన్స్ హజాంగ్ ల గీ పేమ సంత జరుగుతదట. గీ రోజు మాజీ పేమికులు అందంగా ముస్తాబై, వచ్చి, పాత ఊసులు శెప్పుకుని, సాయంత్రానికల్లా తిరిగి యెల్లిపోతరట. గిది సాటుమాటుగ జరిగే ముచ్చటనుకునేరు. గదేం కాదు గా దేస సర్కారే ఆమోదించిన సాంస్క్రుతిక సంప్రదాయ యేడుక అన్నట్లు.

ఇగ గిదీనికి గూడా ఓ శెరిత్రే ఉందట. వందేండ్ల కిందట యేర్వేరు తెగలకు శెందిన భగ్న పేమికులు ఏటా ఖోవైలో కలుసుకుందామని బాసలు సేసుకుండ్రట. గీదీనిని స్ఫూర్తిగా తీసుకుని, గీడ గిది జరుపుతాండ్రట. గిది సరే గని, గీడ ఘుమఘుమలాడే వంటలు శేత్తరట. ఆటపాటలతోటి అలరిస్తరట.

Latest News

పార్టీ పెడితే పోలా!|ADUGU EXCLUSIVE|KONDA FAMILY|NEW PARTY

అడుగు ఎక్స్ క్లూజివ్ కొండా దంపతుల కొత్త పార్టీ? పాత పార్టీల్లో పొసగడం కష్టమే! కొత్త పార్టీతో ప్రయాణం స్పష్టమే! లక్ష్యం బీసీ సామాజిక న్యాయమే! ఇప్పటికే ప్రధాన పార్టీల్లో0చి బయటకు  కాంగ్రెస్ కాదంటే బీజేపీ ఛాన్స్? సిద్ధాంత రీత్యా కమలంలోనూ కష్టమే ఇప్పటికే...

వంటింట్లో మంట! తిరేదేలా తంటా?|EDITORIAL

ధరల పెరుగుదల కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. అది సామాజిక సమస్య కూడా. నెల ఆదాయం పెరగకుండానే నెలవారీ ఖర్చు పెరిగితే మధ్యతరగతి పొదుపులు కరిగిపోతాయి. పేద కుటుంబాలు పోషకాహారం, విద్య,...

ఆగస్టు 25, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు *శ్రావణమాసం* *శుక్లపక్షం* తిధి త్రయోదశి పూర్తిగా రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 11.03 వరకు ఉపరి శ్రవణ యోగం ఆయుష్మాన్ ఉదయం 09.04 వరకు ఉపరి సౌభాగ్య కరణం కౌలవ సాయంత్రం 06.05 వరకు ఉపరి తైతుల రాహుకాలం పగలు 03.00...

ఆగస్టు 24, సోమవారం, 2026|RASHI PHALALU 

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి ద్వాదశి రాత్రి తెల్ల 05.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 08.43 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం ప్రీతి ఉదయం 08.32 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం బవ సాయంత్రం 04.17...

మౌర్యుల చరిత్ర|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

(క్రీ.పూ.320 నుండి క్రీ.పూ.180 వరకు) భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యంగా తొలుత మౌర్య సామ్రాజ్యము వెలిసింది. మౌర్యులు భారత ఉపఖండం(ప్రస్తుత భారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, టిబెట్) మొత్తాన్ని ఇక చక్రాధిపత్యంగా...

నడుస్తున్న మనిషి|POETRY|PARVATHALU

నిలబడిన చోట పెళ్లున కొమ్మ విరిగి పడ్డట్లు మనుషులు కూలిపోతూ కుటుంబాలనొదిలి వెళ్ళిపోతున్నారు అనారోగ్యమిప్పుడు శత్రుదేశాల దాడిలా ప్రమాదకరమైంది వైరస్ ఎప్పుడు మాటుగాస్తుందో ఆరోరోగ్యం ఎప్పుడు మందగిస్తుందో నవ్వుతున్న మనిషి నవ్వుతున్నట్లే అయ్యో !ఇందాకనే ఫోన్ లో మాట్లాడిండని అంటూ...

మనిషి అంటే పర్వతాలే!|PARVATHALU|HUMANITY

పర్వతాలు... పేరుకు తగ్గట్లే, మేరు పర్వతం. అనేక పర్వతాల సరితూగే శక్తిగల మేరునగధీరుడు. ధీశాలి. కోరకున్నా వరాలిచ్చే అపర పరమేశ్వరుడు. ఆ భోళా శంకరుడి లాగే భోళా మనిషి. ప్రార్థించే పెదవులకన్నా, సాయం...

సీఎం సహాయ నిధికి 10 యేలిచ్చిన బిచ్చగాడు!?|ADUGU TRENDS

బిచ్చగాడే గదాని తీసి పారేయొద్దు. తక్కువ సూడొద్దు. ఒక్కొక్కటే వందలు, యేలైతయి. కానీ, గయి కూడబెట్టనీకే ఎంతో కట్ట పడాలె. బిచ్చమెత్తడం అంత అల్కనేం కాదు. అభిమానం సంపుకోవాలె. అవమానాలు భరించాలె. ఇచ్చినా,...

రూపాయి బియ్యంతో కోట్లలో దళారుల దందా!|EDITORIAL

రేషన్ బియ్యం అక్రమ రవాణా కేవలం లబ్ధిదారుల స్థాయిలోనే కాదు. కొన్నిచోట్ల డీలర్లు, దళారులు కుమ్మక్కై నిల్వలను నిలువునా మింగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గోదాములు, హోటళ్లు, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతున్నాయి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 23 నుండి ఆగస్టు 29 వరకు వార రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా మంచి...

ఒక్కరోజు బిచ్చగాడి సంపాదనెంతంటే..!?|ADUGU TRENDS

ఒకాయినెకు ఓ అవుడియా వచ్చింది. తానే బిచ్చమెత్తితే? గట్ల బిచ్చమెత్తి రోజుకు ఎంత సంపాయించొచ్చు? గదాంట్ల ఉండే సాదకబాదకాలు తెలుసుకుందామని. ఇగ ఆగకుండ ఐవుడియా వచ్చిందే లెక్క... యెంటనే ఆ అవతారమెత్తిండు. ఆఖరికి...

ప్రియాంక-బెటర్ ఛాయిసేనా!?|EDITORIAL

కాంగ్రెస్ కు ‘ప్రియాంక బెటర్ ఛాయిసా?” అన్నదానికంటే ‘కాంగ్రెస్ మెరుగైన ప్రతిపక్షంగా ఎలా సాగాలి?’ అన్నదే ముఖ్యం. సభను సజీవంగా మార్చడం ద్వారా ప్రతిపక్షం బలపడుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు ప్రత్యామ్నాయ విధానాన్ని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News