Tuesday, October 27, 2026
29.4 C
Hyderabad

ఇంటి వైద్యుడు ఇక లేడు!|ESSAY

మింటికేగిన ఇంటి వైద్యుడు!

ఆయన పిలిస్తే పలికే వైద్యుడు. పిలవకున్నా ఇంటి ముందుకొచ్చే ఇంటి వైద్యుడు. అంతా బాగేనా? అంటూ నవ్వుతూ, అప్యాయంగా పలకరించే ప్రతి ఇంటికి పెద్దకొడుకు. గూడూరే కాదు ఆ చుట్టుముట్టు గ్రామాలు, తండాల ప్రజలకు సుపరిచితుడు. అత్యంత ప్రజాదరణ గల ప్రజా వైద్యుడు. అతడే డాక్టర్ వైట్ల లక్ష్మీపతి.
ప్రజా వైద్యుడిపై ప్రముఖ రచయిత పాలడుగు రత్నాకర్ రావు రాసిన ప్రత్యేక వ్యాసం ఇంటి వైద్యుడు ఇక లేడు! 

ఇంటి వైద్యుడు ఇక లేడు!

మాది జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు. మా ఊళ్ళో నా బాల్యం ముందుగా చూసింది గృహవైద్యుడు డాక్టర్ వైట్ల లక్ష్మీ పతినే. మారుతున్న కాలంలో ఎన్నో మార్పుల్ని చవి చూసినా.. సరిగ్గా పదిహేను రోజుల కిందటె ఊర్లో వైద్య కుటుంబపు వారసుడుగా మిగిలిన ఆ వ్యక్తిని నేను పలకరించాను. పరస్పరం ఆరోగ్య సమాచారాలని పంచుకోకుండా ఉండలేక పోయాం. నిన్నటి దాకా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన పలకరించిన ఇండ్లు, పలకరించే వారే లేక బోసిపోయాయి. ఆయన మరణ దుర్వార్త విస్మయాన్నే కాకుండా, విషాదాన్ని కలిగించింది. మోపెడ్ పై మెడికల్ కిట్ బ్యాగు పెట్టుకుని ప్రతి రోజు ఊరంతా కలియ తిరుగుతూ, నవ్వుతూ కనిపించే ఆయన, ఆయన పలకరింపులు ఇక మధుర జ్ఞాపకాలే!.

ఆయన్ని విస్మరించి, మా గ్రామం గూడూరును స్మరించుకోలేం. అర్థశతాబ్దిగా ఊరిలో ప్రజా వైద్యుడిగా ఆయన అడుగిడని గడపను చూడగలమా? ఇంత సుదీర్ఘకాలం గ్రామీణ వైద్యుడిగా సేవలు అందించిన మరోవ్యక్తి కనిపించ గలడా? కుటుంబ ఆర్థికస్థితుల నేపధ్యంలో చిన్నతనంలోనే బతుకుబాట పట్టక తప్పిందికాదు అతనికి. అననుకూల పరిస్థితులవల్ల బయట ప్రాంతంలో కంటే ఉన్న ఊరే నయం అనుకుని తిరిగి ఇల్లు చేరుకుని, తన పెద్దనాన్న దగ్గర ప్రాథమిక వైద్యాన్ని నేర్చుకుని క్రమ క్రమంగా ఉరకలేసే ఉత్సాహంతో ఇంటింటి వైద్యానికి తన సేవలు విస్తృతం చేయగలిగాడు లక్ష్మీపతి.

రోగ నిర్ధారణలో ఆయనది అందె వేసిన చెయ్యి. ప్రాబ్లం కచ్చితంగా వివరించేవాడు. జబ్బు తీవ్రతను బట్టి ఉన్నత స్థాయి వైద్యానికి రెఫెర్ చేసేవాడు. అనతి కాలంలోనే గ్రామీణ ప్రజా వైద్యుడిగా స్థిరపడిపోయి, యువజన రాజకీయల్లోనూ భాగస్వామ్యం అయ్యాడు. స్కూల్ అభివృద్ధిలో పాలు పంచుకున్నాడు. స్థానిక శివాలయ పునరుద్దరణలో అహర్నిశలు కృషి చేశాడు. పలు సామాజిక అంశాల్లో ముందున్నాడు. సమాచారం అందించడంలో, సేకరించడంలోనూ ఒక రకంగా చెప్పాలంటే ఊరికి చిరునామై నిలిచాడు.

డాక్టర్ వైట్ల లక్ష్మీపతిది వివాదాస్పదం తెలియని వ్యక్తిత్వం. అందరితో కలుపుకుపోయే మనస్తత్వం. బంధుత్వంలోను గట్టిగా పెనవేసుకున్న అనుబంధం ఆతనే. మూడుతరాల వారితో పెనవేసుకుని అల్లుకుపోయాడు. ఇలాంటి వ్యక్తులు అరుదే. క్రమక్రమంగా కనుమరుగౌతున్న తరం తమ అనుభవాల్ని, జ్ఞాపకాలన్నిటిని ఇలా వదిలేసి వెళ్లిపోతుంటే ఏర్పడే
శూన్యతని తట్టుకోలేం.

ఊరిలో లక్ష్మీపతి వైద్య గురువులు వైట్ల చంద్రం, వైట్ల బుచ్చిరాములు. రాజకీయ గురువులు చౌడవరం విశ్వనాధం, చుక్క రామయ్య. సహచర సన్నిహితులు పాలడుగు శేషగిరిరావు, కోడూరు జితేందర్ రెడ్డి. బంధువుల్లో వైట్ల శ్రీహరి, వైట్ల లోకనాధం, కళ్లెం సోమనరసయ్య… ఇలాంటి వారి సాన్నిత్యం తన భావి జీవితం ఎదుగు దలకు ఎంతగానో దోహదపడిందని చెప్పుకునేవాడు. నా మటుకు నాకు వ్యక్తిగతంగా ఆప్తుడు. ఊరిలో ఉన్నపుడు నా కుటుంబ వైద్యుడు. ఇక ముందు ఎపుడైనా ఊరికి వెళ్ళినపుడు అతను ఇక కనిపించడు అనుకునే క్షణాలను ఉహించ లేక పోతున్నాను నేను.

మరో వైపు 5 రోజుల వ్యవధిలోనే అతని చెల్లెలు దుస్స పుస్పలీల అకాల మరణం అత్యంత విషాదకరం.

బాధాతప్త హృదయంతో లక్ష్మీపతికి, వారి చెల్లెలు పుష్పలీల లకు అశ్రు నివాళులు అర్పిస్తూ…

✍ పాలడుగు రత్నాకర్ రావు, 8367657586

 

Latest News

గీ ఇలసే.. గా పులస!?|ADUGU TRENDS

శేపల్ల గీ శేపలకే మస్తు గిరాకీ. గందుకే పుస్తెలమ్మైనా గా పులసలు తినాలనే సామెత ఒచ్చింది. కనీ, గీ ఇలసలేందని అనుకుంటాండ్లా? గీ ఇలసలే తర్వాత పులసలైతయట.! గందుకే గీ సీజన్ల గీ...

ఆర్థిక సంక్షోభమేనా!?|EDITORIAL

వానలు ముఖం చాటేశాయి.. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.. పంటలపై కరువు పంజా విసురుతోంది! మరోవైపు పెరుగుతున్న విద్యుత్ వ్యయం, సంక్షేమ పథకాల ఖర్చులు తెలంగాణ ఖజానాపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రకృతి దెబ్బకు ఆర్థిక...

అక్టోబర్ 27, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి పాడ్యమి ఉదయం 08.05 వరకు ఉపరి విదియ నక్షత్రం భరణి సాయంత్రం 06.03 వరకు ఉపరి కృత్తిక యోగం సిద్ది పగలు 01.50 వరకు ఉపరి వ్యతీపాత కరణం కౌలవ ఉదయం 08.05 వరకు ఉపరి...

అక్టోబర్ 26, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం తిధి పౌర్ణమి ఉదయం 09.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం అశ్విని రాత్రి 07.00 వరకు ఉపరి భరణి యోగం వజ్ర సాయంత్రం 04.15 వరకు ఉపరి సిద్ది కరణం బవ ఉదయం 09.35 వరకు ఉపరి...

మధ్యయుగ భారతదేశ చరిత్ర|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITVE EXAMS|SPECIAL

భారతదేశ చరిత్రలో మధ్య యుగాల దశ ఎంతో కీలకమైనది. దీనిని చీకటి యుగం అని కూడా అంటారు. ఈ కాలంలో అభివృద్ధి స్తంభించిపోయి, శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగమనం పూర్తిగా నిలిచిపోయిందని చరిత్రకారులు...

తప్పించడమా? తప్పుకోవడమా?|INDIA|ELECTION COMMISSION

సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదా!? భారత ప్రభుత్వం ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను నేరుగా తొలగించగలదా? అదంత సులభమా? సుప్రీం కోర్టు సీఈసీని తప్పుకోమనో, తప్పించమనో ప్రభుత్వాన్ని ఆదేశించగలదా? రాజకీయంగా కేంద్ర ప్రభుత్వమో...

తంతే రూపాల గుట్టల్ల..!?|ADUGU TRENDS

ఒక అవుడియా జీవితాన్నే మార్సేస్తే, మరి ఒక లక్కీ లాటరీ ఎంత మార్పు తేవాలె? ఎంతగా జీవితాన్ని మార్సేయాలె? ఒకటా, రెండా? లచ్చో, కోటో కూడా కాదాయె.! ఏకంగా 240 కోట్ల రూపాయెల...

అప్రమత్తతే అసలైన పరిష్కారం!?|EDITORIAL

ఎల్‌నినో ప్రభావం ఎంతకాలం కొనసాగుతుందన్నది నిరంతరం మారే అంచనాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల అధికారిక సూచనలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. ప్రకృతిని నియంత్రించలేకపోయినా, నీటిని పొదుపు చేయడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వ్యవసాయాన్ని ముందస్తుగా...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

అక్టోబర్ 25 నుండి అక్టోబర్ 31 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం, పనులను వేగంగా పూర్తి చేయాలనే పట్టుదల పెరుగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం...

ముసలోనితోటి నిచ్చితార్థం! పెనిమిటి కోసం రద్దు!?|ADUGU TRENDS

గీ మద్దెల మనుసులు యేగంగా మారుతాండ్రు. సోసల్ మీడియ చెలరేగుతాంది. ఇగ మనుసులు ఎంతకైనా దిగజారుతాండ్రు. ఇగెంతకైనా ఎగబాకుతాండ్రు. సబ్ స్క్రైబర్లు, లైకులు, శేర్ల కోసం సిగ్గు శెరం లేని పనులు కూడా...

గాలి కాదు.. గరళం!|EDITORIAL

ఊపిరి పోసే గాలే ఇప్పుడు ప్రాణాలు తీసే విషంగా మారుతోంది! హైదరాబాద్‌లో పీఎం-10 స్థాయులు జాతీయ ప్రమాణాలను 33.3 శాతం మించగా, సంగారెడ్డి, నల్గొండల్లోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దిల్లీలోనూ గాలి నాణ్యత...

అక్టోబర్ 24, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం స్వాతి కార్తె అక్టోబర్ 24 నుండి నవంబర్ 06 వరకు ఉపరి విశాఖ కార్తె తిధి త్రయోదశి ఉదయం 11.19 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 07.42 వరకు ఉపరి రేవతి యోగం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News