Monday, August 10, 2026
27.5 C
Hyderabad

పార్లమెంట్ లో శీతాకాల మంటలు!|EDITORIAL

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. పార్లమెంట్ వేదిక మరోసారి రాజకీయ విభేదాల రణరంగంగా మారింది. దేశ ప్రాధాన్య సమస్యలపై చర్చించాల్సిందిపోయి పార్టీల పరస్పర నిందారోపణలు, ఆక్షేపణలు, వాగ్యుద్ధ హద్దులు దాటి సాగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు, విభేదాలు సహజం. కానీ, వాటిని నిర్మాణాత్మక చర్చల ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం లక్ష్యం కావాలి. ప్రస్తుత సమావేశాల్లో అది జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల స‌మావేశం డిసెంబర్ 1 నుండి 19వరకు అంటే 15 పని దినాలతో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి ఈ సమావేశాలంలొ13–14 కొత్త బిల్లులను ఆమోదింప చేయాలని నిర్ణయించింది. ఎనర్జీ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తూ, ఆటామిక్ ఎనర్జీ-2025 బిల్లు, యూనివర్సిటీ నియంత్రణ వ్యవస్థలను మార్చి, హయర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లు, కేంద్రానికి ఆదాయాన్ని సమకూర్చే విధంగా పొగాకు, పాన్ మసాలా పన్నుల విధానాన్ని మార్చే సెంట్రల్ ఎక్సైజ్ బిల్లు, ఆరోగ్య, జాతీభ భద్రత సెస్ బిల్లు, హైవే ప్రాజెక్టుల కోసం, కార్పొరేట్ వ్యవస్థల కోసం పలు బిల్లులను ప్రభుత్వం పార్లమెంట్ ముందు పెట్టనుంది.

అయితే, చట్టాలు, సంస్కరణలతో పాటు ప్రజల హక్కులు, ఎన్నికల పారదర్శకత, వోటర్ విశ్వసనీయత, వోటర్ ప్రతుల సరిచూడడం వంటి ప్రాథమిక ప్రజాస్వామ్య అంశాలపై చర్చ లేకుండా, కేవలం బిల్లుల మీద మాత్రమే చర్చిస్తే, ప్రజాస్వామ్య విలువ నిలవదని ప్రతిపక్షం భావిస్తోంది. పైగా కేవలం ఇంత విలువైన అంశాలపై చర్చలకు కేవలం 15 పనిదినాల శీతాకాల సమావేశాల సమయం సరిపోదనే వాదన కూడా వినిపిస్తున్నది. చట్టాలు చేయడమే కాదు, వాటిని ప్రజల మనోభావాలతో, హక్కులు, భద్రతలతో అనుసంధానం చేయడం కూడా ముఖ్యం.

ఒకపక్క ప్రభుత్వం ఆర్థిక, భద్రత, సామాజిక సంక్షేమ చట్టాలను ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపుతుండగా, మరోవైపు ప్రతిపక్షం ప్రజాస్వామిక పారదర్శకత, ప్రజల హక్కుల చర్చను ప్రస్తావిస్తూ నిరసనకు దిగుతోంది. ఇరు వైపులా ఎవరి వాదనలు వారికి ఉన్నప్పటికీ, దేశ ప్రాధాన్యతలను పక్కన పెట్టడం ప్రజలకు నష్టం మాత్రమే గాక, ప్రజాస్వామిక వ్యతిరేకం. బిల్లులపై ప్రవేశపెట్టే ముందు సంపూర్ణ చర్చలు జరగాలన్న ప్రతిపక్ష డిమాండ్‌ ఆమోదయోగ్యమే అయినా, ప్రతి విషయాన్నీ వాయిదా వేయడం కూడా సముచితం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్‌ పనితీరు దెబ్బతింటోంది.

ఈ సమావేశాల్లో రైతు సమస్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, డిజిటల్‌ భద్రత, అంతర్గత సెక్యూరిటీ వంటి కీలక అంశాలపై లోతైన చర్చ జరగాల్సి ఉంది. ఈ అంశాలేవీ చర్చకు రాకుండా నినాదాలు, సస్పెన్షన్లు, అడ్డంకులే ఎక్కువ చర్చకు దారితీస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల రాజకీయ ప్రయోజనాలు దేశ ప్రయోజనాలపై ఆధిపత్యం చెలాయిస్తే, ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది.

పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాలు దేనికి పోటీ పడుతున్నాయి? ప్రజా సమస్యల పరిష్కారానికా? లేక రాజకీయ ఆధిపత్యానికా? ప్రభుత్వం పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడుతూ చర్చలకు అవకాశం కల్పించాలి. ప్రతిపక్షం కూడా అన్నింటినీ అడ్డంగా వ్యతిరేకించడం కాకుండా, నిర్మాణాత్మక చర్చకు సిద్ధం కావాలి. ఈ బాధ్యతలను అధికార, విపక్షాలు గుర్తించాలి.

పార్లమెంటు దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేసే అత్యున్నత అవకాశం. అది ప్రజాప్రయోజనానికే తప్ప పార్టీలు, వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు. పార్టీలన్నీ తమ అవసరాలు, అహంకారాలను పక్కన పెట్టి, దేశ ప్రాధాన్యతలపై చర్చ, సహకారం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పార్లమెంట్ వేడెక్కడం సహజమే, కానీ ఆ వాడీ వేడి, ప్రజాభ్యున్నతికి దోహదపడే జీవనాడి కావాలి.

Latest News

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News