సంకల్పం ఉండాలె గనీ, యేదైనా సాధించొచ్చు. గట్లనే కొందరు ఉచిత సేవలందిత్తరు. గదానికి సరైన యిలువ ఉండదనుకున్నడో ఏమో గనీ, గీ డాస్కర్ శంకర్ దాస్ రాంచందానీ, ఒక్క రూపాయెకే వైద్గం అందిత్తాండు.

గీ డాస్కర్ శంకర్ దాస్ రాం చందానీది ఒడిశా రాస్ట్రం. సంబల్ పూర్ జిల్లాల ఉంటడు. మంచిగ సదువుకుని, పేదలకు వైద్గం సేవ శేయాలని శానా రోజుల కిందటనే ఒక్క రూపాయెకే వైద్గం అందిచ్చుడు మొదలు పెట్టిండు. ఈసీజీ, దంత వైద్గం అందిత్తాన్న గాయినె ఇగిప్పుడు శ్వాస సంబంధ సమస్యలతోటి బాధపడుతున్న రోగులకు బైపాస్ వెంటిలేటర్ సేవలను కూడా అందుబాటులకి తెచ్చిండట. వైద్గం పిరమైన గీ రోజుల్ల ఒక్క రూపాయెకే వైద్గమంటే మంచిదే కదా?

