Sunday, November 29, 2026
23.2 C
Hyderabad

ఖిల్జీ వంశము (క్రీ.శ.1290-1320)|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

1286 లో బాల్బన్ మరణించిన తర్వాత ఢిల్లీలో కొంతకాలం పాటు రాజకీయ అనిస్థితి సంతరించుకుంది. బాల్బన్ కుమారుడు మహమ్మద్ మంగోలుల దాడిలో మరణించాక ఢిల్లీ సింహాసనంపై ఎవరు అంతగా ఆసక్తి చూపకపోవడంతో బాల్బన్ మనవడైన కైకుబాద్ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతని సేనాని జలాలుద్దీన్ ఖిల్జీ ఇతనిని అంతం చేసి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో బానిస వంశపాలన అంతమై ఖిల్జీ వంశం ప్రారంభమైంది.

జలాలుద్దీన్ ఖిల్జీ (1290-1296)

ఇతను 70 ఏళ్ల వయసులో అధికారాన్ని కైవసం చేసుకుని కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే పాలించాడు. ఇతని అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ కారాకు గవర్నర్ గా పనిచేస్తున్న సమయంలో యాదవ రాజ్యంపై దండెత్తి భారీగా సంపదను దోచుకున్నాడు. ఈ విజయానికి అభినందనలు తెలపడానికి ఢిల్లీ నుండి కారా రాజ్యానికి వచ్చిన జలాలుద్దీన్ ఖిల్జీని అల్లావుద్దీన్ ఖిల్జీ హత్య చేసి వెంటనే తానే సుల్తానుగా ప్రకటించుకున్నాడు.

అల్లావుద్దీన్ ఖిల్జీ (1296-1316)

ఇతని అసలు పేరు అలీ గుర్షాప్. తన మేనమామ మరియు భార్య తండ్రి అయిన జలాలుద్దీన్ ఖిల్జీని మోసపూరితంగా హత్య చేయడం వల్ల సింహాసనాన్ని అధిష్టించాడు. భారీ ఎత్తున బంగారం మరియు సంపదలను ఇవ్వడం ద్వారా ఆస్థాన ప్రముఖులను, సైనిక అధికారులను హస్తగతం చేసుకున్నాడు. కొద్దికాలం పాటు కుటుంబాలు మరియు బంధువుల నుండి అసంతృప్తి వచ్చినా కూడా ఆ తిరుగుబాటును ఎదుర్కొన్నాడు. తన ప్రత్యర్ధులను భయపెట్టి విధేయులను చేసుకోవడానికి కఠిన, క్రూర విధానాలను అమలుపరిచాడు.

ఢిల్లీ సుల్తానులందరిలోనూ అత్యంత గొప్పవాడిగా మరియు అలెగ్జాండర్ లాగా ప్రపంచాన్ని జయించడం కేవలం ఇతనికే సాధ్యపడింది. ఇతను సాధించిన విజయాల కారణంగా చరిత్రకారులు ఇతనిని రెండవ అలెగ్జాండర్ గా కీర్తించారు. ఇతని సైనిక విజయాలు ఉత్తర భారత దేశంలోనే కాకుండా దక్షిణ భారతదేశానికి కూడా విస్తరించాయి. దక్షిణ భారతదేశాన్ని జయించిన తొలి ముస్లిం చక్రవర్తిగా ఇతను చరిత్రకెక్కాడు.

అల్లావుద్దీన్ సైనిక విజయాలు:
1) అల్లావుద్దీన్ ఖిల్జీ జయించిన తొలి రాజ్యం గుజరాత్. గుజరాత్ ను పాలిస్తున్న రాజా కరణ్ సింగ్ ఓడిపోయి పారిపోవడంతో గుజరాత్ ను ఆక్రమించుకున్నాడు. కరణ్ సింగ్ భార్యను వివాహం చేసుకొని ఆమెకు మలికా జహాన్ అనే బిరుదును ఇచ్చాడు.
2) రణతంబోర్- అల్లావుద్దీన్ జయించిన రాజస్థాన్లోని ఒక చిన్న రాజపుత్ర రాజ్యం ఇది. దీని పాలకుడైన హంవీరదేవను ఓడించి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. పర్షియన్ పండితుడైన అమీర్ ఖుసృ ఇక్కడ రాజపుత్ర మహిళలు ‘జౌహర్’ అర్పించారని తెలియజేశాడు. జౌహర్ అనగా యుద్ధ సమయంలో రాజు మరియు సైనికులు మరణించిన తర్వాత రాజపుత్ర మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం స్త్రీలందరూ కలిసి అగ్నికి ఆహుతయ్యే సాంప్రదాయం.)
3) మేవార్ – ఈ రాజ్యపాలకుడైన రాణా రతన్ సింగ్ ను ఓడించి మేవార్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. మేవార్ రాజధాని చిత్తోర్ కు అల్లావుద్దీన్ కుమారుడైన ఖిజిర్ ఖాన్ పేరుమీద ఖిజిరాబాదని నామకరణం చేశాడు. 16వ శతాబ్దానికి చెందిన సూఫీ మతాచార్యుడైన మాలిక్ మహమ్మద్ జైసీ హిందీలో రాసిన “పద్మావత్” అనే గ్రంథం ప్రకారం అల్లావుద్దీన్ రాని పద్మావతిని పొందడానికి మేవార్ పై దండెత్తాడు. రాణి పద్మావతి 30 వేల మంది మహిళలతో జౌహర్ అర్పించి అగ్నికి ఆహుతైందని ఈ గ్రంథం తెలియజేస్తుంది. అయితే చాలామంది చరిత్రకారులు ఈ కథ యొక్క విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు.

వీటితోపాటు రాజస్థాన్ లోని సవాన మరియు జాలోర్ ప్రాంతాలను కూడా జయించాడు.

అల్లావుద్దీన్ జయించిన దక్షిణాది రాజ్యాలు:
వింధ్య పర్వతాలను దాటి దక్షిణ భారతదేశాన్ని జయించిన తొలి ముస్లిం చక్రవర్తిగా ఇతను చరిత్రలో నిలిచాడు. ఇతను సాధించిన గొప్ప విజయాల్లో ఇది ఒకటి. ఇతని సేనాపతి అయిన మాలిక్ కాఫర్ దక్షిణాదిన ఉన్న నాలుగు ప్రధాన రాజ్యాలను జయించాడు. (మాలిక్ కాఫర్ ఇస్లాం స్వీకరించిన హిందూ నపుంసకుడని అభిప్రాయం ఉంది.)
మాలిక్ కాఫర్ జయించిన నాలుగు రాజ్యాలు:
1) యాదవ రాజ్యం- ప్రస్తుత మహారాష్ట్ర లోని దేవగిరి (దౌలతాబాద్) రాజధానిగా యాదవ రాజ్యం కొనసాగింది. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రామచంద్ర దేవుడు అల్లావుద్దీన్ తో సత్సంబంధాలను కొనసాగించాడు. తన కుమార్తెను అల్లావుద్దీన్ కి ఇచ్చి వివాహం చేశాడు. రామచంద్ర దేవ తరువాత రాజ్యానికి వచ్చిన శంకరదేవుడు ఖిల్జీలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. మాలిక్ కాఫర్ 1315 లో రెండవసారి యాదవ రాజ్యంపై దండెత్తి ఢిల్లీ సల్తనత్ లో విలీనం చేశాడు.
2) కాకతీయ రాజ్యం – 1309 లో ప్రస్తుత వరంగల్ రాజధానిగా తెలంగాణను రెండవ ప్రతాపరుద్రుడు పాలించేవాడు.

వీటితోపాటు ప్రస్తుత కర్ణాటకలోని ద్వార సముద్రం రాజధానిగా మూడవ వీరబల్లాలుడు పాలించేవాడు మరియు తమిళనాడు లోని మధురై రాజధానిగా పాండ్య రాజ్యాన్ని వీరపాండ్య పాలించేవాడు.
ఈ నాలుగు రాజ్యాలను జయించిన అల్లావుద్దీన్ తన సామంత రాజ్యాలుగానే ఉంచాడు తప్ప విలీనం చేసుకోలేదు. సమాచార వ్యవస్థ బలహీనంగా ఉన్న రోజుల్లో ఢిల్లీకి దూరంగా ఉన్న దక్షిణ రాజ్యాలను పాలించడం కష్టతరమని భావించి దూరదృష్టితోనే వీటిని విలీనం చేసుకోలేదు.

అల్లావుద్దీన్ పాలనా సంస్కరణలు:

అల్లావుద్దీన్ పాలనలో ఎవరికి కూడా ఊహలకందని అద్భుతమైన, విప్లవాత్మకమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. కావున ఈ పరిపాలన కాలాన్ని చరిత్రకారులు ఖిల్జీ విప్లవము అని పిలుస్తారు. పరిపాలనలో ఆధిపత్యం వహిస్తున్న టర్కిష్ జాతి వారిని అంతం చేశాడు. ఫలితంగా ఇస్లాంను స్వీకరించిన ఆఫ్గాన్ జాతి వారికి గొప్ప పదవులను కట్టపెట్టాడు. మాలిక్ కాఫర్ అతని కొలువులో ఉన్న గొప్ప పదవులు పొందిన ఒక వ్యక్తి.

అధికారుల ఆధిపత్యాన్ని అంతం చేయడానికి రాజాజ్ఞలు జారీ చేశాడు. ఇక్తా వ్యవస్థను రద్దుచేసి అధికారులకు జీతభత్యాలను నగదు రూపంలోనే చెల్లించాడు. (ఇక్తా వ్యవస్థను ప్రారంభించింది బానిస వంశానికి చెందిన ఇల్ టుట్ మిష్.)

ఇతను మత గ్రంథాలను పురోహిత వర్గాన్ని పట్టించుకోకుండా పూర్తి లౌకిక విధానాలతో పరిపాలనను కొనసాగించాడు. ఇస్లామిక్ ధర్మశాస్త్రమైన షరియను తిరస్కరించి తనను వ్యతిరేకిస్తున్న ఉలేమాలను అణిచివేశాడు. ఖలీఫా ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. మతము రాజ్యమేలుతున్న ఈ కాలంలో దీనిని గొప్ప విప్లవాత్మక చర్యగా భావించవచ్చు.

అల్లావుద్దీన్ ‘దివాన్-ఇ-ముస్తక్ రాజ్’ అనే కొత్త రెవెన్యూ శాఖను ఏర్పాటు చేశాడు. అమీల్ అనే రెవెన్యూ అధికారులను నియమించి భూమి శిస్తును నేరుగా వసూలు చేశాడు.

ఇక్తా వ్యవస్థను రద్దుచేసి శాశ్వత సైన్యాన్ని నిర్వహించాడు. సైన్యం అంతా నేరుగా చక్రవర్తి ఆధీనంలోనే ఉండేలా రెండు నూతన పద్ధతులను ప్రవేశపెట్టాడు. అవి ధాగ్ మరియు చెర. ధాగ్ అనగా అవినీతిని నిరోధించడానికి గుర్రాల పైన వేసే రాజముద్రలు. చెర అనగా సైనికుల దినసరి హాజరు పట్టిక (attendance register).

అల్లావుద్దీన్ చేపట్టిన సంస్కరణలన్నింటిలో మార్కెట్ సంస్కరణలు అత్యంత ముఖ్యమైనవి. ఇతను వస్తువుల ధరలను నియంత్రించాడు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే క్రయవిక్రయాలు జరిగేటట్లుగా చర్యలు తీసుకున్నాడు. వీటి కోసం సరై ఆదిల్ అనే ప్రత్యేక మార్కెట్లను ఏర్పాటు చేసి షహన- ఇ-మండి అనే మార్కెటింగ్ అధికారిని నియమించాడు. ఈ ప్రత్యేక మార్కెట్లు తన తన సైనిక స్థావరాల్లో మాత్రమే ఏర్పాటు చేయడంతో మార్కెట్ సంస్కరణలు కేవలం సైనికుల లబ్ధి కోసం చేపట్టాడనే వాదన ఉంది. ఫెరిష్తా అనే దక్కన్ చరిత్రకారుడు అల్లావుద్దీన్ యొక్క మార్కెట్ సంస్కరణలను నభూతో నభవిష్యతి అని వర్ణించాడు.

ముబారక్ ఖిల్జీ (1316-1320)

అల్లావుద్దీన్ మరణం తర్వాత అతని కుమారుడైన ముబారక్ ఖిల్జీ సింహాసనాన్ని అధిష్టించాడు. తనే ఖలీఫా అని ప్రకటించుకున్న ఏకైక చక్రవర్తి ఇతనే. ఇతని ప్రధానమంత్రి ఖుస్రుఖాన్ సర్వాధికారాలు చెలాయించాడు. కావున రాజ్యంలోని వారు ముబారక్ ఖిల్జీ ని నామమాత్రపు అధికారి (డిజ్యూరో) గా ఉండి ఖుస్రుఖాన్ వాస్తవాధికారిగా (డిఫాక్టో) కొనసాగాడు. ఈ ఖుస్రుఖాన్ గుజరాత్ కు చెందిన దళిత హిందువు ఇస్లాం మతం స్వీకరించి ప్రధానమంత్రి స్థాయి వరకు ఎదిగి 1320లో ముబారక్ ఖిల్జీని హత్య చేసి సింహాసనాన్ని అధిష్టించాడు. కానీ ఇతని పాలన ఎక్కువకాలం కొనసాగలేదు. కేవలం 100 రోజులు మాత్రమే పరిపాలించి తుగ్లక్ వంశానికి చెందిన ఘియాజుద్దీన్ తుగ్లక్ అనే సేనాపతి చేతిలో హత్య చేయబడ్డాడు. ఢిల్లీ సల్తనత్ కాలంలో సింహాసనాన్ని అధిష్టించిన ఏకైక హిందువుగా ఖుస్రుఖాన్ కు పేరు వచ్చింది.

– బానోత్ కళ్యాణ్ 

Latest News

నషా ముక్త్! నిషా యుక్త్!!|ADUGU BULLET

మాదక ద్రవ్యాల కట్టడి! కేంద్రం చేస్తుందట ముట్టడి!! నషా ముక్త్ భారత్ నినాదం! నిత్యం నిషాలో యువతరం!! అక్కడ.. ! ఇక్కడ..! డ్రగ్స్ లభించని చోటెక్కడ!? అంతటా దొరుకుతోంది గంజాయి! పోరగాళ్లు చేస్తున్నరు ఎంజాయి!! - క్రాంతి మిత్ర

ఎన్నికల్ల ఇచ్చినయి వసూలు సేసిండు!?|ADUGU TRENDS

ఎన్నికలంటేనే శిత్రం, యిశిత్రం. ఓటుకు ఓటే బలం. గందుకే గా ఓట్ల కోసం నాయకులు గాలం ఏత్తరు. గా గాలమే గీ పైసలు, శీరెలు, శారెలు, మందు, మాకులు. బీర్లు, బిర్యానీ ఇంకా...

ఢీలిమిటేషన్ తో రాజకీయాల్లో పెను మార్పులు!?|EDITORIAL

పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు దేశ రాజకీయ సమీకరణాలను, రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని, మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని మార్చగల ప్రక్రియ. తెలంగాణ, ఏపీల్లోనూ వచ్చే ఎన్నికల రాజకీయానికి కొత్త దిశానిర్దేశం చేయగలదు. అయితే, బిల్లుల ఆమోదం,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 29 నుండి డిసెంబర్ 05 వరకు రాశి ఫలాలు మేష రాశి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే సమయం. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. పై అధికారులతో...

పాలకుర్తి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడ!?|PALAKURTHI|INTEGRATED SCHOOL

మంజూరై 18నెలలైనా ముహూర్తం కుదరలే పంచాయతీలే తప్ప పునాదిరాయి పడలే పూర్తవ్వాల్సిన స్కూల్ ఇంకా మొదలే కాలే కొడకండ్లలో పదో రోజుకు చేరిన దీక్షలు పాలకుర్తిలో ప్రారంభమవుతోన్న నిరసనలు నాయకుల పంతమా.. విద్యార్థుల భవిష్యత్తా? నేతల పట్టింపులు, పంతాలతో ప్రమాదంలో...

‘హస్త’ గతమే..నా!?|ADUGU BULLET

మళ్లీ మళ్లీ కాంగ్రెస్ కే అధికారం! మన సీఎం సారు చెప్పిండు జోస్యం!! కోటి ఓట్లు, 90 సీట్లు ఖాయమట! 2034 వరకు హస్తగతం తప్పదట!! బీజేపీ, బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ! మోడీ, కేసీఆర్ తో...

రికార్డులకెక్కిన జగం మెచ్చిన వన గణపతి!?|ADUGU TRENDS

యినాకుని పండుగ దేశమంతటా జరుగుతది. ఇగ యినాకడునంగనే గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోటి శేసే రంగురంగుల పతిమలే గుర్తుకు వత్తయి. నిమజ్జనమప్పుడు గవాటిని శెరువుల్ల, కుంటల్ల యేసుట్ల పర్యావరణానికి ఆని జర్గుతాందని,...

ఢీలిమిటేషన్ ఆమోదానికి మార్గాంతరాలు!?|EDITORIAL

మహిళా రిజర్వేషన్లకు దేశవ్యాప్తంగా రాజకీయంగా సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, డీలిమిటేషన్ విషయంలో రాష్ట్రాల ప్రయోజనాలు, రాజకీయ లెక్కలు అడ్డంకిగా మారుతున్నాయి. ఎన్డీఏకు సాధారణ మెజారిటీ ఉన్నా, రాజ్యాంగ సవరణకు అవసరమైన బలం లేదు....

నవంబర్ 28, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం కృష్ణపక్షం తిధి చవితి ఉదయం 11.55 వరకు ఉపరి పంచమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.37 వరకు ఉపరి పుష్యమి యోగం శుక్ల రాత్రి 02.32 వరకు ఉపరి బ్రహ్మ కరణం బాలవ ఉదయం 11.55 వరకు ఉపరి...

‘అచ్ఛా’యా!?..ఇందిరమ్మ చీరలు!|ADUGU BULLET

కోటిమంది ఆడబిడ్డలకు రేవంత్ సర్కార్ ఇస్తోంది ఇందిరమ్మ చీరల కానుక!! నాడు కేసీఆర్ చేశాడుగా బతుకమ్మ చీరల వేడుక!! బీఆర్ఎస్ ఇచ్చిన చీరలు అప్పడు..అక్కా చెల్లెండ్లు కట్టలే! చీరలు పంచినా..‘ఛీ’వాట్లు తప్పలే!! కాంగ్రెస్ ఇస్తున్న చిలుక పచ్చ చీరలను తెలంగాణ...

ఆవ్వానం లేకుండొత్తే, జరిమానా, జైలు శిచ్చ!?|ADUGU TRENDS

ఒకప్పుడు కుటుంబ సంబంధాలు ఎంతో పకడ్బందీగా ఉండేయి. గా ఫెవికాల్, ఫెవికిక్ కంటే గట్టిగ అతికినట్టుండేయి. ఎవ్వలింట్ల ప్రభోజనమైనా, అందరిండ్లల్ల పండుగలెక్కనే ఉండేది. పొరపాటునో, గ్రహపాటునో ఎవర్నన్నా పిలుసుడు మరిసిపోతే, ఇగ భూగోళం...

‘ఢీ’లిమిటేషన్ కు మరోసారి మో‘ఢీ’!?|EDITORIAL

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి మోదీ సర్కార్ మరోసారి సిద్ధమైంది. మొదటిసారి దెబ్బతిన్న ప్రభుత్వం ఈసారి పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. నవంబర్ 30 నుంచి లోక్‌సభ, డిసెంబర్ 2 నుంచి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News