Sunday, November 29, 2026
23.2 C
Hyderabad

ఢీలిమిటేషన్ ఆమోదానికి మార్గాంతరాలు!?|EDITORIAL

మహిళా రిజర్వేషన్లకు దేశవ్యాప్తంగా రాజకీయంగా సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, డీలిమిటేషన్ విషయంలో రాష్ట్రాల ప్రయోజనాలు, రాజకీయ లెక్కలు అడ్డంకిగా మారుతున్నాయి. ఎన్డీఏకు సాధారణ మెజారిటీ ఉన్నా, రాజ్యాంగ సవరణకు అవసరమైన బలం లేదు. ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోవడం, ప్రాంతీయ పార్టీల ఆందోళనలకు పరిష్కారం చూపడం ద్వారానే బిల్లు ఆమోదం సాధ్యమవుతుంది. కేబినెట్ ఆమోదం తొలి అడుగు మాత్రమే. అసలైన పరీక్ష పార్లమెంటులోమిగిలే ఉంది! మరి ఈ చిక్కులను ప్రభుత్వం ఏ విధంగా అదిగమిస్తుంది? అడ్డదారుల్లో ఆమోదం పొందుతుందా? ఏ భరోసాతో మరోసారి కేబినెట్ బిల్లులకు ఆమోదం తెలిపింది? మోదీ, షాల ప్లానేంటి?

మార్గం – అడుగు, ఎడిటోరియల్

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన తాజా రాజ్యాంగ సవరణ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో మరోసారి దేశ రాజకీయాల్లో వాటిపై చర్చ మొదలైంది. 2029 ఎన్నికల నాటికి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఆచరణలోకి రావాలంటే పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. అయితే గతంలో ఇదే అంశంపై ప్రభుత్వం ఎదుర్కొన్న పరాభవం నేపథ్యంలో ఈసారి బిల్లు గట్టెక్కడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గత వైఫల్యమే గుణపాఠంగా ప్రభుత్వం తాజాగా అడుగులు వేస్తోందా? 2026 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో అవసరమైన ప్రత్యేక మెజారిటీ సాధించలేక వీగిపోయింది. అప్పట్లో ఓటింగ్‌లో పాల్గొన్న 528 మంది సభ్యుల్లో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటేశారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ 352 ఓట్లు కాగా, ప్రభుత్వం 54 ఓట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో అనుబంధ డీలిమిటేషన్ బిల్లులను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేకపోయింది.

ఈ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్న కేంద్రం తాజాగా మార్పులతో కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. లోక్‌సభ స్థానాలను అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిగా 50% పెంచడం, రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని 2051 వరకు కొనసాగించడం ఇందులో ప్రధానాంశాలు. తద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలను తొలగించగలమని కేంద్రం భావిస్తోంది.

ప్రస్తుతం 543 స్థానాలున్న లోక్‌సభలో మూడు స్థానాల ఖాళీలతో సభ్యుల సంఖ్య 540. అందరూ ఓటింగ్‌లో పాల్గొంటే రాజ్యాంగ సవరణకు 360 ఓట్లు అవసరం. ఎన్డీఏ బలం 320. ఇందులో బీజేపీకి 241, మిత్రపక్షాలకు 79 స్థానాలున్నాయి. అంటే మరో 40 మంది మద్దతు అవసరం.

మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి, ప్రాంతీయ పార్టీల వైఖరి కీలకం కానుంది. డీఎంకేకు 22, శరద్ పవార్ ఎన్సీపీకి 8, వైఎస్సార్‌సీపీకి 4 మంది లోక్‌సభ సభ్యులున్నారు. ఎన్సీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించడం ప్రభుత్వానికి కొంత ఊరటనిచ్చింది. ఈ మూడు పార్టీల మద్దతు లభించినా ఎన్డీఏ బలం 354కే చేరుతుంది. ఇంకా ఆరు ఓట్లు అవసరమవుతాయి. మరి ఈ సంఖ్యను సాధించడమెలా?

రాజ్యసభ సభ్యుల సంఖ్య 250 కాగా, 6 ఖాళీలు పోను ప్రభావిత సభ్యుల సంఖ్య 244. అందరూ ఓటేస్తే బిల్లు నెగ్గడానికి 164 ఓట్లు అవసరం. ఎన్డీఏకు 154కు పైగా సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ, ఇక్కడా కూడా ఇంకా అదనపు మద్దతు తప్పనిసరి.

బిల్లును ఆమోదింపజేసుకోవడానికి ప్రభుత్వం మూడు మార్గాలను అనుసరించవచ్చు. మొదటిది ప్రాంతీయ పార్టీలతో చర్చించి మద్దతు కూడగట్టడం. రెండోది బిల్లులో రాష్ట్రాల ప్రాతినిధ్యానికి రాజ్యాంగపరమైన భరోసా కల్పించి దక్షిణాది పార్టీల అభ్యంతరాలను తగ్గించడం. మూడోది మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ వివాదం నుంచి వేరు చేసి, వాటి అమలుకు విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం సాధించడం.

అయితే, గైర్హాజరు, ఓటింగ్‌కు దూరంగా ఉండటం వల్ల అవసరమైన మూడింట రెండొంతుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, మొత్తం సభ్యత్వంలో మెజారిటీ అనే నిబంధన కూడా వర్తిస్తుందని గుర్తించాలి.
మహిళా రిజర్వేషన్లకు దేశవ్యాప్తంగా రాజకీయంగా సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, డీలిమిటేషన్ విషయంలో రాష్ట్రాల ప్రయోజనాలు, రాజకీయ లెక్కలు అడ్డంకిగా మారుతున్నాయి. ఎన్డీఏకు సాధారణ మెజారిటీ ఉన్నా, రాజ్యాంగ సవరణకు అవసరమైన బలం లేదు. ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోవడం, ప్రాంతీయ పార్టీల ఆందోళనలకు పరిష్కారం చూపడం ద్వారానే బిల్లు ఆమోదం సాధ్యమవుతుంది. కేబినెట్ ఆమోదం తొలి అడుగు మాత్రమే. అసలైన పరీక్ష పార్లమెంటులోనే మిగిలిఉంది!. మరి ఈ చిక్కులను ప్రభుత్వం ఏవిధంగా అదిగమిస్తుంది? అడ్డదారుల్లో ఆమోదం పొందుతుందా? ఏ ధైర్యంతో ప్రస్తుతం మరోసారి కేబినెట్ బిల్లులకు ఆమోదం తెలిపింది? మోదీ, షాల ప్లానేంటి? కొద్ది రోజుల్లో తేలనుంది?

Latest News

ఖిల్జీ వంశము (క్రీ.శ.1290-1320)|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

1286 లో బాల్బన్ మరణించిన తర్వాత ఢిల్లీలో కొంతకాలం పాటు రాజకీయ అనిస్థితి సంతరించుకుంది. బాల్బన్ కుమారుడు మహమ్మద్ మంగోలుల దాడిలో మరణించాక ఢిల్లీ సింహాసనంపై ఎవరు అంతగా ఆసక్తి చూపకపోవడంతో బాల్బన్...

నషా ముక్త్! నిషా యుక్త్!!|ADUGU BULLET

మాదక ద్రవ్యాల కట్టడి! కేంద్రం చేస్తుందట ముట్టడి!! నషా ముక్త్ భారత్ నినాదం! నిత్యం నిషాలో యువతరం!! అక్కడ.. ! ఇక్కడ..! డ్రగ్స్ లభించని చోటెక్కడ!? అంతటా దొరుకుతోంది గంజాయి! పోరగాళ్లు చేస్తున్నరు ఎంజాయి!! - క్రాంతి మిత్ర

ఎన్నికల్ల ఇచ్చినయి వసూలు సేసిండు!?|ADUGU TRENDS

ఎన్నికలంటేనే శిత్రం, యిశిత్రం. ఓటుకు ఓటే బలం. గందుకే గా ఓట్ల కోసం నాయకులు గాలం ఏత్తరు. గా గాలమే గీ పైసలు, శీరెలు, శారెలు, మందు, మాకులు. బీర్లు, బిర్యానీ ఇంకా...

ఢీలిమిటేషన్ తో రాజకీయాల్లో పెను మార్పులు!?|EDITORIAL

పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు దేశ రాజకీయ సమీకరణాలను, రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని, మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని మార్చగల ప్రక్రియ. తెలంగాణ, ఏపీల్లోనూ వచ్చే ఎన్నికల రాజకీయానికి కొత్త దిశానిర్దేశం చేయగలదు. అయితే, బిల్లుల ఆమోదం,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 29 నుండి డిసెంబర్ 05 వరకు రాశి ఫలాలు మేష రాశి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే సమయం. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. పై అధికారులతో...

పాలకుర్తి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడ!?|PALAKURTHI|INTEGRATED SCHOOL

మంజూరై 18నెలలైనా ముహూర్తం కుదరలే పంచాయతీలే తప్ప పునాదిరాయి పడలే పూర్తవ్వాల్సిన స్కూల్ ఇంకా మొదలే కాలే కొడకండ్లలో పదో రోజుకు చేరిన దీక్షలు పాలకుర్తిలో ప్రారంభమవుతోన్న నిరసనలు నాయకుల పంతమా.. విద్యార్థుల భవిష్యత్తా? నేతల పట్టింపులు, పంతాలతో ప్రమాదంలో...

‘హస్త’ గతమే..నా!?|ADUGU BULLET

మళ్లీ మళ్లీ కాంగ్రెస్ కే అధికారం! మన సీఎం సారు చెప్పిండు జోస్యం!! కోటి ఓట్లు, 90 సీట్లు ఖాయమట! 2034 వరకు హస్తగతం తప్పదట!! బీజేపీ, బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ! మోడీ, కేసీఆర్ తో...

రికార్డులకెక్కిన జగం మెచ్చిన వన గణపతి!?|ADUGU TRENDS

యినాకుని పండుగ దేశమంతటా జరుగుతది. ఇగ యినాకడునంగనే గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోటి శేసే రంగురంగుల పతిమలే గుర్తుకు వత్తయి. నిమజ్జనమప్పుడు గవాటిని శెరువుల్ల, కుంటల్ల యేసుట్ల పర్యావరణానికి ఆని జర్గుతాందని,...

నవంబర్ 28, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం కృష్ణపక్షం తిధి చవితి ఉదయం 11.55 వరకు ఉపరి పంచమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.37 వరకు ఉపరి పుష్యమి యోగం శుక్ల రాత్రి 02.32 వరకు ఉపరి బ్రహ్మ కరణం బాలవ ఉదయం 11.55 వరకు ఉపరి...

‘అచ్ఛా’యా!?..ఇందిరమ్మ చీరలు!|ADUGU BULLET

కోటిమంది ఆడబిడ్డలకు రేవంత్ సర్కార్ ఇస్తోంది ఇందిరమ్మ చీరల కానుక!! నాడు కేసీఆర్ చేశాడుగా బతుకమ్మ చీరల వేడుక!! బీఆర్ఎస్ ఇచ్చిన చీరలు అప్పడు..అక్కా చెల్లెండ్లు కట్టలే! చీరలు పంచినా..‘ఛీ’వాట్లు తప్పలే!! కాంగ్రెస్ ఇస్తున్న చిలుక పచ్చ చీరలను తెలంగాణ...

ఆవ్వానం లేకుండొత్తే, జరిమానా, జైలు శిచ్చ!?|ADUGU TRENDS

ఒకప్పుడు కుటుంబ సంబంధాలు ఎంతో పకడ్బందీగా ఉండేయి. గా ఫెవికాల్, ఫెవికిక్ కంటే గట్టిగ అతికినట్టుండేయి. ఎవ్వలింట్ల ప్రభోజనమైనా, అందరిండ్లల్ల పండుగలెక్కనే ఉండేది. పొరపాటునో, గ్రహపాటునో ఎవర్నన్నా పిలుసుడు మరిసిపోతే, ఇగ భూగోళం...

‘ఢీ’లిమిటేషన్ కు మరోసారి మో‘ఢీ’!?|EDITORIAL

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి మోదీ సర్కార్ మరోసారి సిద్ధమైంది. మొదటిసారి దెబ్బతిన్న ప్రభుత్వం ఈసారి పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. నవంబర్ 30 నుంచి లోక్‌సభ, డిసెంబర్ 2 నుంచి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News