Wednesday, September 23, 2026
28.5 C
Hyderabad

అమ్మ.. నాన్న… ఓ కూతురు!|KONDA FAMILY|CONGRESS|CM|REVANTH REDDY

కొండా ఫ్యామిలీ@వివాదాలు
ఎందులోనూ ఇమడరు
మరెందులోనూ పొసగరు
ఎవరినీ అంగీకరించరు
వారెవరికీ అంగీకారంగా ఉండరు
వారిది ఇష్టానుసారం..
వారికి లేదు అధిష్ఠానం..
లేనేలేదు విచారం! కొండంత ప్రచారం
సొంత నియోజవర్గంలోనూ పార్టీ నేతలు,
కార్యకర్తలతో విభేదాలు, కేసులు

రాష్ట్ర రాజకీయాల్లో ‘అమ్మ! నాన్న!! ఓ కూతురు!!!’ వివాదాలకు ఆ ఫ్యామిలీ కేరాఫ్ అడ్రస్. వాళ్ళ రూటే సెపరేటు? ఎందులోనూ ఇమడరు. మరెందులోనూ పొసగరు. ఎవరినీ అంగీకరించరు. వారెవరికీ అంగీకారంగా ఉండరు. వారిది ఇష్టానుసారం..వారికి లేనేలేదు అధిష్ఠానం..లేదు ఏ మాత్రం విచారం! కొండంత ప్రచారం!! సొంత నియోజవర్గంలోనూ పార్టీ నేతలు, కార్యకర్తలతో విభేదాలు, కేసులు..ఆ కుటుంబంతో పరిచయం అక్కరలేదు. ఆ కుటుంబ వివాదాలే వారిని అందరికీ చేరువ చేశాయి. ఇంతకూ అర్థమై ఉంటుంది. అది కొండా ఫ్యామిలీ అని.

అవును వారికి కోపమస్తే ఎదుటి వారు ఎవరని చూడరు. అవతలి వ్యక్తి స్థాయిని, హోదాను గుర్తించరు. యాస, ప్రాసలతో బూతుల తిడతారు. వారు తిడితే ఎంతటి వారైనా ఆ మాటలు పడాల్సిందే. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తున్న మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, కొండా దంపతుల గారాలపట్టి కొండా సుస్మిత పటేల్. ఈ ముగ్గురులో ఎవరైనా సరే, తెలంగాణ రాష్ట్రంలో రాజేసిన మాటల మంటలను చల్లార్చడం అగ్నిమాపక శకటాలతో కాదు కదా? కాంగ్రెస్ అధిష్టానంతోనూ కావట్లేదు.

రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడితే చాలు, పత్రికలు మీడియా కు ఆ వ్యాఖ్యలు పతాక శీర్షికన చేరుతాయి. అంత పవర్ ఫుల్ గా ఆమె మాటలు ఉంటాయి. భారత నేత మాజీ మంత్రి కేటీఆర్ పై మాట్లాడినా.. సినీనటి సమంత గురించి మాట్లాడినా, హీరో నాగార్జునతో కేసు నెదుర్కొన్నా, చివరకు సారీ చెప్పినా, చాలా మంది మంత్రులకు డబ్బులు ఇవ్వడానికి వస్తూంటారు. అందులోంచి తాను తీసుకోకుండా నియోజకవర్గంలో ప్రగతికి వాడామన్నా, ఆ మాటలు మంటలు దావానలంలా వ్యాపించి రచ్చ రచ్చ అయిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ఏ ఫైలు పై సంతకం చేసిన డబ్బులు తీసుకుంటారని స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. మంత్రి కొండా సురేఖ ఏది మాట్లాడినా వివాదం కావడం ఆ తర్వాత మళ్లీ సర్దుకునే ప్రయత్నం చేయడం రివాజుగా వస్తుంది..

మంత్రి సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు. ఈయన ఈ అప్పట్లో మాట్లాడిన మాటలు పెద్ద వివాదానికి దారితీసాయి. 2023 ఎన్నికల్లో కొండా సురేఖ గెలుపు కోసం రూ. 70 కోట్లు ఖర్చు చేశానని మురళీధర్ రావు బహిరంగ వ్యాఖ్యానించడం పెను సంచలనంగా మారింది.

కొండా దంపతుల ముద్దుల కూతురు కొండా సుష్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై గతంలో ఓఎస్డీ సుమంత్ ను తొలగించి, అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించిన సమయంలో, సుమంత్ ను కాపాడుతూ, చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనాలకు దారితీసాయి. కాంగ్రెస్, సీఎం ప్రతిష్టను దిగజార్చాయి. మంత్రి సురేఖ స్పందించి తన కూతుర్ని వెంట తీసుకెళ్లి ముఖ్యమంత్రితో గతంలో చేసిన రాజీ ఫలించడంతో రాజకీయ వాతావరణం చల్లబడింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు సందర్భంగా గీసుగొండలో మంత్రి కూతురు సుస్మిత పటేల్ ముఖ్యమంత్రిపై మరోసారి మాట్లాడడం వివాదాలకు దారి తీసింది. నేరుగా సీఎంను ముఖ్యమంత్రి కాగానే కళ్ళు నెత్తికెక్కాయా? మా నాన్నకు ఇస్తానన్న ఎమ్మెల్సీ ఏమైంది? నీ కుటుంబం అవినీతిని బయట పెడతానంటూ చేసిన వ్యాఖ్యలు సీఎం, కాంగ్రెస్ ఇమేజీనీ డ్యామేజీ చేయడంతోపాట, రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అంతేగాక పరకాల నాదే, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా? అక్కడి సీనియర్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని డైపర్లేసుకునే తిరిగేవాడు ఎమ్మెల్యేనా? అంటూ తూలనాడారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు సుస్మితపై ప్రెస్ మీట్ లు పెట్టి మరి ప్రతి దాడికి దిగారు. సుస్మిత విమర్శల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం స్పందించి క్రమశిక్షణ కమిటీ ద్వారా మంత్రి సురేఖకు నోటీసు ఇవ్వడం.. బదులుగా మంత్రి తన కూతురు చేసి వ్యాఖ్యలకు తనకు సంబంధమే లేదంటూ జవాబు ఇవ్వడం పరిస్థితి మరింత వేడెక్కేలా చేసింది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి సురేఖకు మరోసారి నోటీసు ఇవ్వడంతో వివాదం మరింత వేడెక్కింది.

మంత్రి సురేఖ ఓ వైపు రాజకీయంగా పరిస్థితులను ఎదుర్కొంటూనే, మరోవైపు సీఎం సతీమణిని, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జుణ ఖర్గేను కలవడం, హైదరాబాద్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మంత్రి భర్త కొండ మురళీధర్ రావు కలవడం, తాజాగా రాఖీ పండుగ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మంత్రి సురేఖ రేవంత్ కు రాఖీ కట్టడంతో, ‘రాఖీ.. రాజీ’ రాజకీయంపై చర్చ మొదలైంది.. ఇంత జరుగుతున్నా, తన కూతురు సుస్మిత వ్యాఖ్యలపై సురేఖ విచారం కూడా వ్యక్తం చేయకపోవడం విచిత్రమే.

అయితే, కొండా మురళీధర్ రావు మాత్రం, తన కూతురు ప్లాన్ ఎ అమలు చేసిందని, తర్వాత ప్లాన్ బీ ఏంటో తనకు తెలియదని చెప్పండం ఒక హెచ్చరికతో కూడి బెదిరింపులాగే భావించాల్సి వస్తుంది. అదీగాక తనకు మంత్రి స్థాయి సెక్యూరిటీని వినియోగించుకోవడం కూడా వాదాస్పదమైంది. ఏసీపీ, సీఐల స్థాయి పోలీసు ఉన్నాధికారుల స్పెన్షన్ కు దారితీసింది. మరోవైపు నియోజకవర్గంలోనూ అంతర్గతంగా పార్టీ నేతలు, కార్యకర్తలతోనూ విభేదాలున్నాయి. పైగా కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి.

రేవంత్ కు రాఖీ కట్టిన తర్వాత పరిస్థితి ఏమైనా మార్పు వస్తుందా? అధిష్టానం ఢిల్లీకి ముఖ్యమంత్రిని మంత్రి సురేఖని పిలిచి చర్చలు జరిపి రాజీ చేస్తారా? అనే విషయంపై తెలంగాణ రాష్ట్రంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా పలుమార్లు సొంత ప్రభుత్వంపై మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత మళ్లీ సర్దుకునే ప్రయత్నం చేయడం చూస్తున్న ప్రజలకు విసిగెత్తుతోంది. కాంగ్రెస్ కల్చరే అంత అనే అభిప్రాయం బలపడుతోంది. మంత్రి కొండ సురేఖ పదవి పోతుందని ఓవైపు స్వపక్షంలోనూ, విపక్షంలోనూ చర్చ జరుగుతోంది. ఆ అవకాశమేలేదని మరో చర్చ తెరమీద ఆడుతోంది. వారేపార్టీలో ఉన్నా, ఎన్ని పార్టీలు మారినా, రాజీలేని కొండా రాజకీయాలకు తెరపడుతుందా? లేక రాజీ కుదురుతుందా? ఆ ఆలస్యం దేనికి సంకేతం? కాలమే నిర్ణయిస్తుంది.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News