Tuesday, September 1, 2026
26.2 C
Hyderabad

వేతనాల్లో కోతలపై డీటీఎఫ్ ఆగ్రహం|DTF

ఏకపక్ష నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల మే నెల వేతనాల నుంచి ఆరోగ్య పథకం పేరుతో మూల వేతనంలో ఒకటిన్నర శాతం కోత విధించడాన్ని డీటీఎఫ్ జనగామ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన ఆరోగ్య పథకం విధివిధానాలను ఇంకా అధికారికంగా ప్రకటించకుండానే, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపకుండానే, సంబంధిత ఉద్యోగుల అంగీకారం తీసుకోకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా కోతలు విధించడం సరైన విధానం కాదని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండి షరీఫ్, ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస చారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోగ్య పథకంలో చేరాలా వద్దా అనే విషయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయుల వ్యక్తిగత నిర్ణయానికి వదిలివేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న సందర్భాల్లో, వారి అంగీకారం మేరకు ఒకరి వేతనం నుంచే మినహాయింపు జరగాల్సి ఉండగా, ఇద్దరి వేతనాల నుంచీ కోత విధించడం అన్యాయమని పేర్కొన్నారు. ఇప్పటికే కోత విధించిన మొత్తాన్ని వెంటనే సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల హక్కులను పరిరక్షించేందుకు అవసరమైతే ఉద్యమ కార్యాచరణ చేపడతామని డీటీఎఫ్ నాయకులు హెచ్చరించారు.

Latest News

ఆన్ లైన్లనే మనువు… అచ్చింతలు!?|ADUGU TRENDS

పెండ్లిల్లు సొర్గంల నిర్ణయిత్తరట. ఎవలితో? ఎక్కడ? ఎప్పుడు? ఎట్ల జరగాల్నో? గాడనే తేలుత్తరట. గవాటి సంగతేమో! గనీ, గీ మద్దెల భూమ్మీద మనువులు మాత్రం మానవులే నిర్ణయిత్తాండ్రు. గా అమెరిక అధ్యచ్చుడు ట్రంపు...

చల్లని హిమాలయాల్లో విస్ఫోటక వాటర్ బాంబ్స్!|EDITORIAL

ముప్పు పర్వత ప్రాంతాలకే పరిమితం కాదు. సిక్కిం లేదా నేపాల్ హిమాలయాల్లో పెద్ద స్థాయిలో జీఎల్ఓఎఫ్ సంభవిస్తే కోసి, గండక్, తీస్తా వంటి నదుల ద్వారా వరదనీరు దిగువ మైదాన ప్రాంతాలకు చేరే...

సెప్టెంబర్ 01, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి చవితి ఉదయం 07.10 వరకు ఉపరి పంచమి నక్షత్రం అశ్విని రాత్రి 03.17 వరకు ఉపరి భరణి యోగం వృద్ధి రాత్రి 01.14 వరకు ఉపరి ధ్రువ కరణం బాలవ ఉదయం 07.12 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

ఆగస్టు 31, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం సంకట హరచతుర్థి తిధి తదియ ఉదయం 08.20 వరకు ఉపరి చవితి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.01 వరకు ఉపరి అశ్విని యోగం గండ రాత్రి 03.29 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర ఉదయం 08.20...

అమ్మ.. నాన్న… ఓ కూతురు!|KONDA FAMILY|CONGRESS|CM|REVANTH REDDY

కొండా ఫ్యామిలీ@వివాదాలు ఎందులోనూ ఇమడరు మరెందులోనూ పొసగరు ఎవరినీ అంగీకరించరు వారెవరికీ అంగీకారంగా ఉండరు వారిది ఇష్టానుసారం.. వారికి లేదు అధిష్ఠానం.. లేనేలేదు విచారం! కొండంత ప్రచారం సొంత నియోజవర్గంలోనూ పార్టీ నేతలు, కార్యకర్తలతో విభేదాలు, కేసులు రాష్ట్ర రాజకీయాల్లో ‘అమ్మ! నాన్న!! ఓ...

గుప్తుల పూర్వయుగం|ADUGU DIGITAL MEDIA|SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

సుమారు 135 సంవత్సరాల మౌర్యుల పాలన తర్వాత భారత ఉపఖండంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడి మౌర్య సామ్రాజ్య పతనానికి కారణమైంది. మౌర్యులు బ్రాహ్మణులు కారని పండితులు తిరుగుబాటు చేయడం, అవైదిక మతాలైన బౌద్ధ, జైన...

గిది శేపా.. బంగారు తునకా!?|ADUGU TRENDS

పుస్తెలమ్మైనా పులస తినాల్నన్నరు. పులస శేపకున్న గిరాకీ అసొంటిది మరి. ఏటికి ఎదురీదుతూ పులసలు దొరికే అరుదైన కాలమిది. గా పులస శేప కోసం జనం ఎగబడ్తరు. ఎంత డబ్బైనా పెట్టి కొంటరు....

నేపాల్ లో సవాల్ గా సహాయక చర్యలు!|EDITORIAL

హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు దేశాలు సిద్ధంగా ఉన్నాయా? అధిక ఉష్ణోగ్రతలు, మంచు కరుగుదల, హిమనదుల అస్థిరత, కొండచరియలు వంటి పరిణామాలు భవిష్యత్‌లో ఆకస్మిక వరదల ముప్పును పెంచే అవకాశం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 05 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా మంచి...

ఉద్వాసనా? ఉపేక్షనా? రిటర్న్ గిఫ్ట్ ఏంటి?|ADUGU EXCLUSIVE

రాఖీతో రాజీ కుదిరేనా!?|RAKHI POURNAMI చర్యలకే మొగ్గు చూపేనా? కొండా వివాదం ఎటువైపు?|KONDA SUREKHA|CM|REVANTH REDDY తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ చుట్టూ నెలకొన్న తాజా వివాదాస్పద పరిణామాలు పార్టీలో క్రమశిక్షణ, వ్యక్తిగత రాజకీయ సంబంధాలు,...

గీ ఈడియ సూత్తే గుండె కరగాలె!?|ADUGU TRENDS

రాఖీలను తోడబుట్టినోల్లకే కాదుల్లా. సోదర భావంతోటి ఎవ్వలకైనా కట్టొచ్చు. గట్లనే ఓ బడి పిల్ల, ఎవ్వలూ లేక వాడవాడలకు తిరిగే ఓ అనాథకు రాఖీ కట్టింది. తనలోని మానవత్వాన్ని సాటుకుంది. యేడ జరిగిందో గనీ,...

కాంగ్రెస్‌లో కలుపు మొక్కలు!|EDITORIAL

ప్రజలు కోరుకునేది పార్టీ అంతర్గత రాజకీయ విమర్శలు కాదు, ఫలితాలు. మంత్రులు తమ శాఖలపై దృష్టి పెట్టాలి. ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై మాట్లాడాలి. పార్టీ నేతలు ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలహీనపరిచే బహిరంగ పోరాటాలకు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News