Thursday, October 22, 2026
32.4 C
Hyderabad

సెల్పీలొద్దు..పానాలే ముద్దు!?|ADUGU TRENDS

గీ శేతిల పోన్లొచ్చినకానుంచి, మనుసులు, సమాజం, పపంచకమే ఎవ్వలి శేతిల లేకుండపోతాంది. బుడ్డ పోరగాండ్ల కానుంచి ముసలొల్ల దాకా అందరి శేతుల్ల పోన్లేనాయె. గడికోపాలి గండ్ల యేలు పెట్టి గెలుకుడేనాయె? తలకాయ పెట్టి సూసుడేనాయె? ఆలుమొగలు కూడా శెరో దిక్కు శేతిల పోన్లు సూసుకుంట ఎడమొకం, పెడమొకంగా పండుకోబట్టిరి. సందు దొరికినా, దొరకకపోయిన, గా శేతిల పోన్లల్లనే మనుసులు గడపబట్టిరి. ఇగ గవాటిని సూసి పానాలు తీకోబట్టిరి. గట్లనే గా పోన్లల్ల సెల్పీల కోసం పానాలు పోగొట్టుకోబట్టిరి.

గా సీకాకులంల గట్లనే సెల్పీ మోజుల నీల్లల్ల పడి పానాలు పొగొట్టుకున్నరు. ఒగ మార్కెటింగ్ ఏజెన్సీల 125 మంది శిచ్చణ సీకుంటాండ్రట. గండ్లకెల్లి దసరా సెలవులకు 100 మంది ఇండ్లకు పోయిండ్రట. మిగిలిన 25 మందిల ముగ్గురు అమ్మాయిలు కలిసి పెద్దగనగళ్లవానిపేట సంద్ర తీరానికి పోయిండ్రు. గాడ నాగావళి నది సంద్రంల కలుత్తది. గాడనే ఓ ఊబి ఉందట. గది నిషేధిత ప్రాంతమని కూడ ప్రకటన రాసి ఉందట. గా పిల్లలు గాడికి పోయి సెల్పీ దిగుతాంటే గా ఊబిల పడ్డరట. గాదాని మీదికెల్లి పెద్ద కెరటం వచ్చి మీద పడ్డదట. గంతే గా ముగ్గురు గంగమ్మ ఒడిల కలిసిండ్రట. గిది సూసిన ఓ పిల్లగాడు గవాల్లను రచ్చిద్దామని గండ్లకే దూకిండంట. గంతే గా పొల్లగాడు కూడా కనిపించకుండ పోయిండంట. ఇగ గవాల్లు రెండు రోజుల తర్వాత శవాలై తేలిండ్రట. ఇగో గిట్లనే నదులల్ల, మిద్దెల మీదికెల్లి పడి పానాలు పోగొట్టుకుంటాండ్రు. ఇగో మీ అందరికీ దండం పెట్టి శెపుతాన. గా సెల్పీల కోసంపానాలు తీసుకోవద్దు.

Latest News

జియో ఐపీఓ జోరు…|EDITORIAL

దేశీయ పెట్టుబడి చరిత్రలో జియో ఐపీఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. వివిధ పెట్టుబడి సంస్థలకు భారీ ఆసక్తి ఆశలు రేకెత్తిస్తుండగా, మార్కెట్ ఒడిదుడుకులు, రూపాయి కదలికలు ఇన్వెస్టర్లకు అప్రమత్తత పాఠాలు నేర్పుతున్నాయి. మార్గం -...

అక్టోబర్ 22, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.05 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం శతభిషం సాయంత్రం 06.34 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం వృద్ధి రాత్రి 10.39 వరకు ఉపరి ధ్రువ కరణం భద్ర ఉదయం 11.05 వరకు ఉపరి...

అక్టోబర్ 21, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం తిధి దశమి ఉదయం 10.13 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ధనిష్ఠ సాయంత్రం 05.16 వరకు ఉపరి శతభిషం యోగం గండ రాత్రి 11.17 వరకు ఉపరి వృద్ధి కరణం గరజీ ఉదయం 11.18 వరకు ఉపరి...

అభిమానమంటే గిదే పో!?|ADUGU TRENDS

ఎవ్వలికైనా ఎవ్వలో ఒకలంటేనో, వాళ్ళ తీరంటేనో, అభిమానం ఉంటది. కనీ, గదాన్ని బటయ పెట్టడం, సాటుకోవడం అంత సులువేం కాదు. గీయినె అభిమానం సూసి, గా పెద్దాయినే మస్తు ఫిదా అయిండు. గదేందో...

రియల్‌ ఎస్టేట్‌కు రివర్స్‌ గేర్‌!|EDITORIAL

ఒకప్పుడు కోట్లు కురిపించిన రియల్‌ ఎస్టేట్‌ రంగం ఇప్పుడు కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తోంది! హైదరాబాద్‌ మార్కెట్‌లో తగ్గుతున్న రిజిస్ట్రేషన్లు, మందగించిన క్రయవిక్రయాలు రంగం భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. లగ్జరీ ఇళ్లకు కొంత డిమాండ్‌...

అక్టోబర్ 20, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణ విజయదశమి దసరా తిధి నవమి ఉదయం 08.52 వరకు ఉపరి దశమి నక్షత్రం శ్రవణ పగలు 03.31 వరకు ఉపరి ధనిష్ఠ యోగం శూల రాత్రి 11.30 వరకు ఉపరి గండ కరణం కౌలవ...

అక్టోబర్ 19 సోమవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం శ్రీ మహిషాసుర మర్ధినీదేవి అలంకరణ తిధి అష్టమి ఉదయం 07.09 వరకు ఉపరి నవమి నక్షత్రం ఉత్తరాషాఢ పగలు 01.20 వరకు ఉపరి శ్రవణ యోగం ధృతి రాత్రి 11.25 వరకు ఉపరి శూల కరణం బవ...

బతుకమ్మ|BATHUKAMMA|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను పూల పండుగగా పిలుస్తారు. ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 16న రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇదే రోజున బోనాలు పండుగను కూడా రాష్ట్ర పండుగగా...

భివండిల ‘మహా’ బతుకమ్మ!?|ADUGU TRENDS

ఈ పపంచకంలనే పక్రుతిని ఆరాధించి, పువ్వులనే దేవుల్లుగ కొలిసే అరుదైన పండుగ బతుకమ్మ. గీ పండుగ తెలంగాణలనే కాదు. ఇగిప్పుడు గీ తెలంగాణోల్లు ఏడుంటే గాడ ఘనంగా జరుగుతాంది. ఒకప్పటి లెక్క గాకుండ,...

పూల పండుగకు ప్రపంచ పట్టాభిషేకం!|EDITORIAL|BATHUKAMMA

పూల సోయగాలు.. ఉయ్యాల పాటలు.. కోలాటాల సందడి.. వెరసి బతుకమ్మ సంబురం! తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ పూల పండుగ నేడు ఖండాంతరాలు దాటి, ప్రపంచ వేదికపై మన సంస్కృతి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

అక్టోబర్ 18 నుండి అక్టోబర్  24 వరకు రాశి ఫలాలు మేష రాశి కొత్త పనులు ప్రారంభించాలనే ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం లభించవచ్చు. వ్యాపారంలో కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి....

ఈ దంపతులు సింపతీ కోల్పోతున్నారా!?|KONDA SUREKHA|KONDA MURALI|FAMILY

పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం..పైగా సెపరేట్ ఈసీపై ఏఐసీసీ ఆందోళనలకు కూడా హాజరుకాని వైనం పట్టభద్రుల ఎమ్మెల్సీ సమాయత్త సమావేశానికి గైర్హాజర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు మంత్రుల సందర్శనలోనూ నో వేర్ పైగా విడిగా పార్టీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News