Sunday, September 6, 2026
33.2 C
Hyderabad

బర్త్ డే టు బర్తరఫ్!|KONDA FAMILY|CONGRESS|

తారుమారైన కొండా సు‘రేఖ’!
17 రోజుల్లోనే తలకిందులు?
‘చే’జేతులా…చెడిన రాజకీయం
ఆగస్టు 19 నుంచి సెప్టెంబరం 3 వరకు

మరి తర్వాత వారి దారెటు?

కోరి కోరి పదవికి ఎసరు తెచ్చుకోవడమంటే ఇదే! అదీ లండన్ లో ఉన్న బిడ్డను పిలిపించకుని… ఆమె చేత సీఎంను, ఆయన కుటుంబాన్ని తిట్టిపోసి మరీ..ఉన్న పదవిని ఊడబెరుక్కోవడమంటే కూడా ఇదే!! కొండా సురేఖ మంత్రిగా కొనసాగాలి. కొండా మురళి ఎమ్మెల్సీ కావాలి. కొండా సుష్మితాపటేల్ పరకాలకు ఎమ్మెల్యే కావాలి. అంటే పార్టీ టికెట్లు రావాలి. టికెట్లు రావాలంటే, పార్టీ లేదా సీఎం ప్రాపకం తప్పనిసరి. అదే సీఎంని బెదిరిస్తేనో, భయపెడితేనో, బ్లాక్ మెయిల్ చేస్తేనో ఆ పదవులు వస్తే వస్తాయేమో కానీ, అదే సీఎం సిఫారసుతో వచ్చిన మంత్రి పదవి నేరుగా ఆయన్నే తిడితే, భయపెడితే, బెదిరిస్తే, బ్లాక్ మెయిల్ చేస్తే ఉంటుందని ఎలా అనుకున్నారు? ఇంత సింపుల్ లాజిక్ ని ఎలా మరిచారు? బెదిరియ్యడానికో, గదిరియ్యడానికో ఇప్పటి దాకా ఉన్న మంత్రి పదవి కూడా పాయె! సారీ చెప్పకపోయినా, కనీసం పాశ్చాత్తాపం ప్రకటించడమో, బిడ్డను తల్లి ఖండించడమో, తండ్రి మందలించడమో చేయకపోగా, ఆమె మాటలకు మాకేం సంబంధం? అనే నోటి దురుసు వల్ల ఇప్పుడేం జరిగింది? ఏం ఒరిగింది? ఏం ఒనగూరింది? ‘చే’జేతులా చేసుకునే స్వయం క్రుతాపరాధం ఇంటే ఇదేనేమో!? కనీసం పాశ్చాత్తాపం ప్రకటించడానికి కూడా ఇష్టపడని వాళ్ళకి ఎవరు మాత్రం పాశ్చాత్తపం, సానుభూతిని ప్రకటిస్తారు?

సరే, జరిగిందేదో జరిగిపోయింది. మీసాలు మెలేస్తూ, ప్లాన్ ఎ మాత్రమే అమలైంది. ప్లాన్ బీ ఏంటో నాకు తెల్వదన్న కొండా మురళీకైనా, కొండా సురేఖకైనా, సుష్మితకైనా తర్వాతేంటి? అనేది తెలుస్తోందా? ఒకసారి ఎంపీపీ, ఐదుసార్లు ఎమ్మెల్యే, మూడుసార్లు మంత్రి, ఎమ్మెల్సీ వంటి పదవులు నెరపిన 40ఏళ్ళ రాజకీయ అనుభవం ఏం చేయనుంది? వారి రాజకీయ జీవితం చరమాంకానికి చేరిందా? కొండా కుటుంబం భవితవ్యమేంటి?

బర్త్ డే టు బర్తరఫ్! కొండా సురేఖ బర్త్ డే వేడుక కేవలం 17 రోజుల్లోనే బర్తరఫ్ కి దారి తీసింది. కొండా సు‘రేఖ’ తారుమారైంది! రోజుల్లోనే మొత్తం తలకిందులైంది? ‘చే’జేతులా… రాజకీయం చెడింది. అవును ఆగస్టు 19న కొండా సురేఖ బర్త్ డే అయింది. లండన్ లో ఉన్న కొండా దంపతుల బిడ్డ సుష్మితా పటేల్ ప్రత్యేకంగా వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిపై, పదవి రాగానే కళ్ళు నెత్తికెక్కాయా? మా నాన్నకు ఎమ్మెల్సీ ఏమైంది? అప్పుడే మరిచావా? మీ అన్నదమ్ములు కలిసి దోచిన డబ్బుల మాటేమిటి? మా తెరువొస్తే, అన్నీ బయటపెడతానంటూ హూంకరించారు. అంతేగాక డైపర్లేసుకు తిరిగే రేవూరికి పదవెందుకు? పరకాల నాదే? నేను అక్కడి నుండి పోటీ చేస్తాను. ఎవరడ్డు వస్తారో చూస్తానని ఎద్దేవా చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొండా సురేఖను తొలగించాలని మీటింగులు పెట్టారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపింది. వివరణ అడిగితే, నా బిడ్డ వ్యాఖ్యలతో నాకేం సంబంధం? అని తిరగబడ్డారు. దీంతో నివేదిక అధిష్ఠానానికి చేరింది. మధ్యలో వచ్చిన రాఖీ పండుగ కూడా రాజీని కుదర్చలేకపోయింది. చివరకు అధిష్ఠానమే ఆమెను పక్కన పెట్టమని హుకుం జారీ చేయాల్సివచ్చింది. సెప్టెంబరం 3న సీఎం గవర్నర్ కు లేఖ ఇవ్వడంతో బర్తరఫ్ జరిగిపోయింది. మరి తర్వాత వారి దారెటు?

కాంగ్రెస్ లో కష్టమేనా!
ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్న కొండా సురేఖకు ఏఐసీసీ నుంచే మంత్రి పదవి ఉద్వాసనకు సిఫారసు వచ్చింది. మంత్రి పదవి పోయినా, పార్టీ పదవి ఉంది. అయితే, పార్టీలో ఇప్పుడెలా వ్యవహరించడం? ఆమెకు ఏ మాత్రం మద్దతు లభించని పార్టీలో పొసగడం సాధ్యమేనా? పార్టీలో ఆమె నెట్టుకు రాగలరా? పార్టీలో కీలకంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తుపై క్లారిటీ లేదు. కీలకంగా వ్యవహరించలేకపోతే ముందుంది అంధకారమే.

క్యాడర్ దూరమేనా!?
ఉద్వాసన రోజు కొండా ఫ్యామిలీ తమ అనుచరులను హైదరాబాద్ కు రావాల్సిందిగా ఆదేశించారు. కానీ, మెజార్టీ శ్రేణులు రావడానికి ఇష్డపలేదు. ‘మీ పదవిపోయినా, మీరు పార్టీని వీడిపోయినా, మేం మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటామ’ని తేల్చి చెప్పారు. దీంతో కొండా ఫ్యామిలీ వెనక్కి తగ్గక తప్పలేదు. రేపు వారెటంటే అటేగా కాంగ్రెస్ క్యాడర్ వారి వెంట రావడమన్నది అంత ఈజీ కాదు. అంటే అయితే కాంగ్రెస్ లేకపోతే మరే పార్టీలోనో ఉండాల్సిందే.

గులాబీల గుస్సా!
కాంగ్రెస్ లోనే ఉంటాను. ఏ పార్టీలోకి వెళ్ళను. ఎమ్మెల్యేకు రాజీనామా చేయనని ప్రకటించిన కొద్దిసేపటికే, ‘కేసీఆర్ సారు చాలా మంచివారు. హుందాగా ప్రవర్తించేవారు’ అని సురేఖ అన్నారు. ఆ కొద్దిసేపటికే, గులాబీ పార్టీ గుస్సా చేసింది. ‘ఆమెను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమని’ నిర్ద్వంద్వంగా బీఆర్ఎస్ ప్రకటించింది. అంటే రేపటి రాజకీయాలెలా ఉన్నా? ఇప్పుడైతే ఆమెకు బీఆర్ఎస్ గేట్లు మూసుకుపోయినట్లే లెక్క.

కమలం కిస్సా!
బీజేపీ నుంచి ఆమెకు ఆహ్వానం అధికారికంగానైతే రాలేదు. ఒకవేళ వచ్చినా ఆమె అందులో ఇమడగలదా? జవాబులేని ప్రశ్న. బీజేపీ రాజకీయ క్రమశిక్షణ, శిక్షణ, వ్యవహార శైలికి ఆమె తట్టుకోవడం, తాళడం కష్టమేనని కొండా కుటుంబం గురించి తెలిసిన చాలా మంది అంటున్న మాటలు.

వైసీపీకి నో చాన్స్?
గతంలో అనుబంధం ఉన్న వైసీపీకి కొండా ఫ్యామిలీ వెళ్ళే అవకాశాలే లేవు. తెలంగాణలో ఆ పార్టీకి, ఆంధ్రాలో కొండా ఫ్యామిలీకి అంత పలుకుబడి, ఫాలోయింగ్ కనిపించడం లేదు. తెలంగాణలో వైసీపీ కార్యకలాపాలు కూడా పెద్దగా లేవు. ఈ దశలో వైసీపీ నో ఛాన్స్?

రాజీనామా చేస్తే గెలుస్తారా?
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కొండా సురేఖ మళ్ళీ గెలుస్తారా? ఇప్పుడు అటు కొండా ఫ్యామిలీని, ఇటు పార్టీ కేడర్ ని, వారి శ్రేయోభిలాషులు, రాజకీయ పరిశీలకులను తొలుస్తున్న ప్రశ్న ఇదే. ప్రతిష్ట కోసం పాకులాడటమా? పార్టీలోనే కొనసాగడమా? పరిస్థితులు అనుకూలించే వరకు వేచి చూడటమా?

స్వతంత్రంగా సాధ్యమేనా!
రాజీనామా చేసినా, భవిష్యత్తులో ఒంటరిగా, స్వతంత్రంగా సాగాలన్నా కష్టమేనని కొండా ఫ్యామిలీ భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పుడే వెంట రావడానికి కాంగ్రెస్ కేడర్ కాదంటోంది. రేపు స్వతంత్రంగా నిలిస్తే, వెంట నిలిచి, గెలిపిస్తుందా?

ఈ రెండేళ్ళు గడవడమెలా?
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు ఇంకా రెండేళ్ళకు పైగా టైముంది. అప్పటి దాకా గడవడం ఎలా? అన్నదే కొండా ఫ్యామిలీ ముందున్న సవాల్. ఏదో విధంగా నెట్టుకు వెళ్ళడమా? మరే విధంగా ముందుకు సాగడమన్నది వాళ్ళకు పాలుపోవడం లేదు. అయితే, వేచి చూసే ధోరణి మాత్రమే ప్రస్తుతం వాళ్ళ ముందున్న కర్తవ్యంగా కనిపిస్తోంది.

కొత్త పార్టీ మాటేమిటి?
వివాదం నడుస్తున్నప్పుడు అధిష్ఠానాన్ని భయపెట్టడానికోమే, కొత్త పార్టీ పెట్టడానికి చర్చలు జరుపుతున్నట్లు లీకులిచ్చారు. కానీ, అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కొత్త పార్టీ పెట్టే ఆర్థిక వనరులున్నా, నడపడానికి అవసరమయ్యే సామర్థ్యాలు కష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా కొండా మురళి ఆరోగ్యం అనుకూలించాలి. కొండా సురేఖకు ఆ ఓపిక ఉండాలి. సుష్మితలో ఆ పరిణతి రావాలి. ఇవేవీ లేకుండా ఓ పార్టీని నిలపడం, సిద్ధాంత లక్ష్యంగా నడపడం, అంత ఈజీ కాదనేది కొండా ఫ్యామిలీకే ఎక్కువగా తెలిసిన విషయం.

రాష్ట్ర రాజకీయాల్లో ‘అమ్మ! నాన్న!! ఓ కూతురు!!! వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కొండా ఫ్యామిలీ రూటే సెపరేటు? ఎందులోనూ ఇమడరు. మరెందులోనూ పొసగరనే పేరున్న కొండా కుటుంబం నెక్ట్స్ దారెటు? అనువుగాని చోట.. అధికులమనరాదన్నట్లు… కొంత కాలం అలా ఉండటమే తప్ప మరోదారే కనిపించడం లేదు. మరి అలా అణిగిమణిగి ఉండే టైపు కాదే!

Latest News

గుప్త సామ్రాజ్యం – ప్రారంభం మరియు అభివృద్ధి (క్రీ.శ.275-550)|ADUGU DIGITAL MEDIA|HISTORY|COMPITITIVE EXAMS|SPECIAL

గుప్తుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవడానికి సాహిత్యం, శాసనాలు మరియు నాణాలు ఉపయోగపడుతున్నాయి. గుప్త సామ్రాజ్యంలోని తొలి రాజులు *మహారాజ* అనే బిరుదును తీసుకోవడం వల్ల వీరు సామంతులుగా పాలించారని తెలుస్తుంది. కొంతమంది...

డాక్టర్ నెట్ ఇండియా-వైద్గం ఫ్రీ!?|ADUGU TRENDS

ఏదన్నా రోగమొత్తే అయిపాయె, ఆగమాగమైతం. యాడికిపోవాల్నో తెల్వదు. ఎంత కర్సైతదో తెల్వదు. ఇగ గిదే సందని, పైసలు గుంజుడు, పానం తీసుడు గా ప్రైవేట్ దవాఖాన్లల్ల పనైపాయె. పానం పోతదో, నిలుత్తదో కనీ,...

అధ్యాపకా! అభివందనం!!|EDITORIAL

నాణ్యమైన విద్య, సమర్థవంతమైన ఉపాధ్యాయ శిక్షణ, పరిశోధనకు ప్రోత్సాహం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడమే రాధాకృష్ణన్‌కు నిజమైన నివాళి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 06 నుండి సెప్టెంబర్ 12 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త ఆలోచనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మీ...

అమ్మంటే గామే!?|ADUGU TRENDS

మహారాష్ట్రల బీడ్ అంబాజోగాయిల అమ్రుత్ మహోత్సవ్ వేడుకలు జర్గుతానయి. అమ్రుత్ దౌడ్ మొదలైతాంది. గండ్లకు హఠాత్తుగా ఓ 47 ఏండ్ల రమాబాయి రణవీర్ దూసుకొచ్చింది. గా మారథాన్ పరుగు పందెంల ఉరుకుడు మొదలు...

ఏఐ యుగంలో గెలిచేది మానవ నైపుణ్యమే!?|EDITORIAL

ఉద్యోగార్థులకు ఏఐ గణాంకాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. డిగ్రీ లేదా అనుభవం ఒక్కటే భవిష్యత్తుకు భద్రత ఇవ్వవు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం...

సెప్టెంబర్ 05, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి నవమి రాత్రి 08.54 వరకు ఉపరి దశమి నక్షత్రం మృగశిర రాత్రి 09.39 వరకు ఉపరి ఆరుద్ర యోగం వజ్ర పగలు 01.57 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 10.08 వరకు ఉపరి గరజి రాహుకాలం...

తలుసుకుంటే కాందేంది? నదే శుభ్రమైంది!?|ADUGU TRENDS

గీ డిగ్రీలు సదివే పిల్లలు ఏం ఆలోశిస్తరు? ఆటా, పాటా, అల్లరి, సదువు, కెరీర్ గివే కదా? కనీ గీ పిల్లగాడు గివేవీ ఆలోసించలే.. తమ ఊరి పక్కనుండే పోతున్న నది గురించి...

కొండా కుటుంబం దారెటు!?|EDITORIAL

అనూహ్యం కాకపోయినా, అనివార్యంగా జరిగిపోయింది. పరిణామాల ఫలితాలేమైనా, కొండంత ఆశయం, తన కూతురు, తమ భవిష్యత్తు కోసం కొంత పట్టువిడుపు ప్రదర్శించి ఉంటే, కొండా సురేఖ మంత్రి పదవి నిలిచేదేమో! అయినా కొండా...

సెప్టెంబర్ 04, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శ్రీ కృష్ణాష్టమి తిధి అష్టమి రాత్రి 11.20 వరకు ఉపరి నవమి నక్షత్రం రోహిణీ రాత్రి 11.20 వరకు ఉపరి మృగశిర యోగం హర్షణ సాయంత్రం 05.00 వరకు ఉపరి వజ్ర కరణం బాలవ పగలు 12.30 వరకు ఉపరి...

అధిష్ఠానం నిర్ణయంపై చిన్నారెడ్డి సంచలనం|CHINNA REDDY|CONGRESS

ఒక్క పోటుతో కూల్చేశారు.. పదవులపై నాకు సోకు లేదు తనకు పదవులపై ఎలాంటి ఆసక్తి, వ్యామోహం లేదని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయంగా ఈ స్థాయికి వచ్చానని, అయితే ఒక్క పోటుతో తనను పదవి...

నా బర్తరఫ్‌ చెల్లదు|KONDA SUREKHA|SENSATIONAL COMMENTS

ఈరోజు నాకు జరిగింది.. రేపు మీకూ జరుగుతుంది ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడండి రేవంత్‌ సర్కార్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News