ఒగప్పుడంటే ఎండా, వానా, సలి, శేను, శెలకా, బరువు పనులు, కట్టం బతుకులు..ఇగిప్పుడంటే ఏసీలు, ప్యాన్ల కింద కుర్సీలల్ల జీతాలైపాయె. కట్టం తక్కువాయె ఒత్తిడి ఎక్కువాయె. గందుకే శానా మంది బరువులు పెరిగి, ఒత్తిల్లు పెరిగి మస్తు తిప్పలు పడ్తాండ్రి. గీ తిప్పలు లేకుండ శేసేటందుకే గీ ఎక్సర్సైజులట. నాలుగంటే నాలుగు నిమిషాలేనట. ఏకంగా 5 కిలోల బరువు తగ్గుతరట.

అవునుల్లా. మంచి జీవన శైలికి పపంచానికే ఆదర్శంగా నిలిచిన జపానోల్లు గది కనిపెట్టిండ్రట. మీరు పనిలో ఉండి గూడా పక్కకు పోయి నాలుగు నిమిషాలు గిట్ల చేస్తిరా… బస్ ఆరోగ్యానికి ఆరోగ్యం.. బరువు తగ్గుతరట. ఇగిప్పుడు గీ ఈడియ తెగ వైరలైతాందుల్లా… కావాల్నంటే మీరూ సూడుండ్రి.

