Friday, June 5, 2026
27 C
Hyderabad

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ,
అధిక జ్యేష్ఠ మాసము
సూర్యోదయం ఉదయం 5:44
సూర్యాస్తమయం సాయంత్రం 6:44
సంకల్ప తిథి:
కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి:
అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి
తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి
నక్షత్రము : ఉత్తరాషాఢ తె. ఝా 3:41వరకు, తదుపరి శ్రవణం
యోగము : శుక్ల ఉదయం 9:03 వరకు, తదుపరి బ్రహ్మ
కరణము : బవ ఉదయం 10:28 వరకు, తదుపరి బాలవ రాత్రి 11:30 వరకు
రాహుకాలం:
మధ్యాహ్నం 1:51 నుం. మధ్యాహ్నం 3:29 వరకు
దుర్ముహూర్తం:
ఉదయం 10:04 నుం. ఉదయం 10:56 మరియు మధ్యాహ్నం 3:16 నుం. సాయంత్రం 4:08 వరకు
వర్జ్యం:
ఈ రోజు ఉదయం 9:53 నుం. ఈ రోజు ఉదయం 11:40 వరకు
అమృత ఘడియలు:
రాత్రి 8:34 నుం. రాత్రి 10:21 వరకు
అభిజిత్:
ఉదయం 11:48-మధ్యాహ్నం 12:40
బ్రహ్మ ముహూర్తము:
ఉదయం 4:16-ఉదయం 5:00

మేషం:
పెద్దలతో చర్చలు అనుకూలంగా సాగుతాయి. తోబుట్టువులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఇంటర్వ్యూలలో ఆశించిన ఫలితాలు ఆలస్యమవుతాయి. దత్త కవచ పారాయణం శుభఫలితాలను అందిస్తుంది.

వృషభం:
కళలు, టీవీ, రక్షణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. వేడుకల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

మిథునం:
ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల్లో తొందరపాటు నష్టాలకు దారితీయవచ్చు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సాయినాధుని ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం:
కొత్త పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. భాగస్వామి వైఖరి కొంత మనస్తాపం కలిగించవచ్చు. పందాలు, పోటీలకు దూరంగా ఉండండి. దత్త కవచ పారాయణం శుభప్రదం.

సింహం:
ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. సన్నిహితుల వల్ల ఇబ్బందులు ఎదురవచ్చు. సాయినాధుని దర్శనం మేలు చేస్తుంది.

కన్య:
ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా కొన్ని వివాదాలు ఎదురవుతాయి. ప్రియమైన వారి ప్రవర్తన బాధ కలిగించవచ్చు. సాయిబాబా దర్శనం శుభప్రదం.

తుల:
తల్లిదండ్రులకు సంబంధించిన శుభవార్తలు అందుతాయి. సమావేశాల ఏర్పాట్లలో అసౌకర్యం ఉండవచ్చు. ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

వృశ్చికం:
విద్య, ప్రయాణాలకు అవసరమైన నిధులు సమకూరుతాయి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడుల చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు.

ధనుస్సు:
కొత్త పరిచయాలు, జనసంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మితంగా వ్యవహరించాలి. పందాలు, పోటీలకు దూరంగా ఉండండి. గోసేవ శుభప్రదం.

మకరం:
ఆరోగ్యం మెరుగుపడుతుంది. లక్ష్యసాధన కోసం అధిక శ్రమ అవసరం. కొత్త పనుల ప్రారంభంలో ఆలస్యం ఎదురవచ్చు. దత్త కవచ పారాయణం మేలు చేస్తుంది.

కుంభం:
పొదుపు పథకాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలకు అనుకూల సమయం. ఉన్నత విద్యా ప్రయత్నాల్లో ఆటంకాలు రావచ్చు. సాయిబాబా ఆరాధన శుభప్రదం.

మీనం:
కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక వ్యవహారాలు ముందుకు సాగుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. గోసేవ శుభఫలితాలను అందిస్తుంది.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

వేతనాల్లో కోతలపై డీటీఎఫ్ ఆగ్రహం|DTF

ఏకపక్ష నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల మే నెల వేతనాల నుంచి ఆరోగ్య పథకం పేరుతో మూల వేతనంలో ఒకటిన్నర శాతం కోత విధించడాన్ని డీటీఎఫ్ జనగామ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News