Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

‘పెట్రో డాలర్’ ఆధి‘పైత్యం’!?|EDITORIAL

వెనెజువెలా ఉదంతం ఒక దేశపు సంక్షోభం మాత్రమే కాదు. అది మారుతున్న ప్రపంచ ఆర్థిక శక్తి సమీకరణాల ప్రతిబింబం. ఈ మార్పులను అణచివేయాలనే ప్రయత్నాలే రాబోయే కాలంలో ప్రపంచ రాజకీయాలను మరింత అస్థిరంగా మార్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక కీలక మలుపు దశలో ఉంది. రెండో ప్రపంచ యుద్ధానంతరం దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా డాలర్‌ ఆధిపత్యానికి గండిపడుతోంది. చైనా, రష్యా, భారత్‌ సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు డాలర్‌ ను కాదని, తమ స్థానిక కరెన్సీలో వాణిజ్యాలు చేస్తున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యంలో స్థానిక కరెన్సీల వినియోగం, వస్తుమార్పిడి ఒప్పందాలు, చమురు లావాదేవీల్లోనూ స్థానిక కరెన్సీ ప్రాధాన్యమే పెరగడం వంటివన్నీ కలిపి ప్రపంచ ఆర్థిక శక్తి సమీకరణాల్లో మార్పును సూచిస్తున్నాయి.

ఈ పరిణామాలన్నీ అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. డాలర్‌ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా కొనసాగడం అమెరికా ఆర్థిక, రాజకీయ శక్తికి మూలస్తంభం. డాలర్‌లోనే చమురు లావాదేవీలు జరిగే ‘పెట్రోడాలర్’ వ్యవస్థ అమెరికాకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై అపారమైన ఆధిపత్యాన్ని అందించింది. ఈ వ్యవస్థకు సవాల్‌ విసురుతున్న ప్రయత్నాలు అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు ముప్పుగా మారుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఆయిల్ నిల్వలు కలిగిన దేశంగా వెనెజువెలా ఎప్పటినుంచో భౌగోళిక ప్రాధాన్యం సంతరించుకుంది. హ్యూగో చావెజ్ కాలం నుంచి వెనెజువెలా అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడుతూ, చైనా, రష్యా వంటి దేశాలతో సన్నిహిత సంబంధాలు పెంచుకుంది. చమురు రంగంలో జాతీయీకరణ విధానాలు చేపట్టడం వల్ల అమెరికన్ ఆయిల్ కంపెనీల ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. దీనికి ప్రతిఫలంగా అమెరికా విధించిన ఆంక్షలు వెనెజువెలా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా నష్టపరిచాయి. నిరుద్యోగం, కరెన్సీ విలువ పతనం, ఆహార కొరత, వలసల పెరుగుదల వంటి సమస్యలు వెనెజువెలాను సంక్షోభంలోకి నెట్టాయి.

ఇదే సమయంలో వెనెజువెలాలో చైనా ప్రభావం వేగంగా పెరిగింది. చమురు ఎగుమతులు, మౌలిక సదుపాయాల నిర్మాణం, విద్యుత్‌, మైనింగ్‌ రంగాల్లో పెట్టుబడులు..ఇలా అనేక రంగాల్లో చైనా కీలక భాగస్వామిగా మారింది. ఇక వెనెజువెలా దిగుమతులతో, చైనా 170కి పైగా ప్రాజెక్టులను నిర్మించుకుంది. వెనెజువెలాలో చైనా 26 శాతం కంటే ఎక్కువ విద్యుత్‌, మైనింగ్‌ ఇతర సంబంధిత పరిశ్రమల వంటి కీలక రంగాల్లో పెట్టుబడి పెట్టినట్లు గణాంకాలు తెలిపాయి.

ముఖ్యంగా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా యువాన్‌లో లావాదేవీలు జరపడం అమెరికాకు అసహనాన్ని కలిగించింది. లాటిన్ అమెరికా మొత్తం మీద చైనా రుణాలు, పెట్టుబడులు గత రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగాయి. వెనిజులా ఈ చైనా వ్యూహంలో కీలక స్థానం దక్కించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అమెరికా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై తీవ్ర ఆరోపణలు చేసింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా అభియోగాలతో మదురోను అమెరికా కిడ్నాప్‌ చేసింది.
వెనెజువెలా విషయంలో అమెరికా లక్ష్యం కేవలం చమురు మాత్రమే కాదు. లాటిన్ అమెరికాలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకోవడం, ‘అమెరికా పక్కనే, పక్కలో బల్లెంలా వెనెజువెలాపై తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కూడా ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఇదే వ్యూహంలో భాగంగా చైనా, రష్యా, ఇరాన్, అలాగే భారత్‌ వంటి దేశాలపైనా టారిఫ్‌లు, ఆంక్షలు, వాణిజ్య ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.

ప్రపంచం ఇప్పుడు ఒక బహుళ ధ్రువ ఆర్థిక వ్యవస్థ వైపు కదులుతోంది. డాలర్‌ ఆధిపత్యం ఒక్కసారిగా కూలిపోయేదేమీ కాదు. గానీ, దాని ప్రభావం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఈ మార్పును అడ్డుకోవడానికి అమెరికా దూకుడైన విధానాలను అవలంబిస్తే, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

వెనెజువెలా ఉదంతం ఒక దేశపు సంక్షోభం మాత్రమే కాదు. అది మారుతున్న ప్రపంచ ఆర్థిక శక్తి సమీకరణాల ప్రతిబింబం. ఈ మార్పులను అణచివేయాలనే ప్రయత్నాలే రాబోయే కాలంలో ప్రపంచ రాజకీయాలను మరింత అస్థిరంగా మార్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News