Saturday, September 5, 2026
30.2 C
Hyderabad

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి వేరు, మానవులు వేరనే అర్థం. కోతులు మనుషులతో సహా సిమీఫార్మీస్ ఇన్ఫ్రా క్రమానికి చెందిన జంతువులు. వీటి పేరున ‘కోతి కొమ్మచ్చి’ అనే ఆట ఉంది.

రామాయణం ప్రకారం త్రేతాయుగంలో కోతి రూపం కలిగిన వానరులు, రామ రావణ యుద్ధంలో రామునికి సహాయంగా పోరాడి విజయం చేకూరుస్తారు. భక్తి శ్రద్ధలతో పూజించే ఆంజనేయుడు వానర రూపంలోనే వర్ణించబడ్డాడు. మిగిలిన భాషలతో పోలిస్తే భారతీయ సినిమాలో కోతుల పాత్ర అధికం. కోతులను దైవ రూపాలుగా, ఆపదలో సహాయకులుగా ఇప్పటికీ వాడుతున్నారు. సర్కస్ లో ఇవి చేసే విన్యాసాలు పిల్లలు, పెద్దలకు వినోదాన్ని పంచుతాయి. దేవాలయాలలో యాత్రికులకు ముందుగా స్వాగతం చెప్పేవి కోతులే. ఏదైనా ఇస్తే తీసుకొంటాయి లేకపోతే లాక్కుంటాయి. ప్రయోగశాలల్లో వ్యాధి సంబంధ పరీక్షలను మొదట కోతులపై చేస్తుంటారు. వాటిపై విజయవంతమైన తర్వాతే, మనుషులపై ప్రయోగిస్తారు.

కోతులు ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలలో, అడవులు, పర్వతాలు, నగరాల్లో నివసిస్తాయి. భారతదేశం, బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, పెరూ, ఈక్వెడార్ వంటి దేశాలలో కోతులు విస్తృతంగా కనిపిస్తాయి. ఆయా దేశాల్లో అనేక జాతులు ఉన్నాయి. కోతులు చెట్లపై నివసిస్తాయి, బాబూన్‌లు వంటివి నేలపై కూడా ఉంటాయి. ఇవి వర్షారణ్యాలు, గడ్డి భూములు, పర్వతాలు, మానవ నివాస ప్రాంతాల దగ్గర కూడా కనిపిస్తాయి. భారతదేశంలో లంగూర్స్, మకాక్‌లు, గిబ్బన్‌లుంటాయి. తెలంగాణ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో కోతులు ఉన్నాయి. మానవ నివాసాలకు దగ్గరగా జీవిస్తూ, ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, తెలంగాణలో 35 లక్షలకు పైగా కోతులు ఉన్నట్లు అంచనా.

కోతుల గురించి ఇంత ఎందుకు? అంటే, కోతుల సమస్యను తెలంగాణ చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్లమెంట్ లో ప్రస్థావించి, చర్చనీయాంశం చేశారు. ఆఫ్ట్రాల్ కోతుల గురించి, పార్లమెంట్ లో ప్రస్థావనా? అని కొట్టిపారేయొద్దు. రేగొండలో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ‘మా గ్రామంలో కోతులను పారదోలే వారికే మా ఓటు’ అని ప్రజలు ప్రకటించేంతగా, వాటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరి! 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కోతులు లేకుండా చేస్తానని హామీ ఇవ్వడమే కాదు, కోతులను పట్టించి, మరీ పోటీకి దిగారు. మాజీ సీఎం కేసీఆర్, గ్రామాల నుండి కోతులు వాపస్ పోవాలంటే, అడవుల పెంచాలెనని, కోట్లాది డబ్బు పెట్టి, ‘హరితహారం’ పథకాన్నే ప్రారంభించారు. అయినా కోతులు పోలేదనుకోండి. అది వేరే విషయం. అయితే, కోతుల బెడద తీవ్రతకు ఇవి ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే.

అటవీ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, పంట పొలాలు, గ్రామాల శివార్లు మాత్రమే కాకుండా, ఇళ్లు, పశువుల పాకలు వరకు కోతుల దాడులు విస్తరించాయి. పంటలను నాశనం చేయడం, పిల్లలను భయపెట్టడం, మహిళలపై దాడులు, ఆస్తి ధ్వంసం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. అయితే, కోతులను అరికట్టే వ్యూహాలేవీ ప్రభుత్వాలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. అడవులు తరిగిపోవడం, ఆహార కొరత, మానవ దాడుల కారణంగా నివాస ప్రాంతాల వైపు వస్తున్నాయి. కోతుల వల్ల అనేక కుటుంబాలు, ముఖ్యంగా రైతులు తమ పంటలు ధ్వంసమవుతుండటంతో ఆర్థికంగా దెబ్బతింటున్నారు.

ప్రధానంగా రైతులు, వ్యవసాయాధారిత కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడుతోంది. పైగా కోతులు గుంపులుగా దాడి చేసినప్పుడు పిల్లలు, వృద్ధులు గాయపడే ఘటనలు పెరుగుతున్నాయి. మహిళలు ఇంటి పనుల్లో ఉండగా కోతులు లోపలికి చొరబడటం, తినుబండారాలు, ఆభరణాలు, దుస్తులు లాగేయడం రోజువారీ సమస్యగా మారింది. ఇది కేవలం గ్రామీణ జీవనశైలిని దెబ్బతీయడం మాత్రమే కాదు, భద్రత లోపాన్ని కూడా సూచిస్తోంది.

ఈ సమస్యను కొండా విశ్వేశ్వర్ రెడ్డి లోక్‌సభలో ప్రస్థావించడం ఆహ్వానించదగ్గ, ప్రశంసనీయ పరిణామం. సమస్య స్థానికమైనా, జాతీయ వేదికపై చర్చించడం అవసరం. కోతులతో పర్యావరణ అసమతుల్యత, మానవ-జంతు సహజీవనం-సమరం, వ్యవసాయ నష్టం, ఆహార కొరత-భద్రత, ప్రజల భద్రత వంటి కీలక అంశాలు ఇమిడి ఉన్నాయి. రైతులు, జొన్న, మక్కజొన్న, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు సాగు చేయడం మానేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే, సాగు తగ్గి, ఆహార కొరత ఏర్పడటం ఖాయం.
ఈ ప్రస్థావనతోనైనా కోతుల నియంత్రణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించే అవకాశం ఉంది. కోతులు, వాటి సంచార మార్గాలపై అధ్యయనం, అడవుల పునరుద్ధరణ, కోతుల పునరావాస కేంద్రాలు, శాస్త్రీయంగా జనాభా నియంత్రణ, గ్రామాల్లో కోతుల ప్రవేశాన్ని నిరోధించడం వంటి సూచనలు అమలు చేయాలి. ఈ సమస్య పరిష్కారానికి దీర్ఘకాల కార్యాచరణ అవసరం. రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ శాఖ, పశుసంవర్థక శాఖలతో కలిసి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి. రైతులకు నష్ట పరిహార పథకాలు అందించాలి. కోతుల సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుందనే ఆశిద్దాం.

Latest News

అమ్మంటే గామే!?|ADUGU TRENDS

మహారాష్ట్రల బీడ్ అంబాజోగాయిల అమ్రుత్ మహోత్సవ్ వేడుకలు జర్గుతానయి. అమ్రుత్ దౌడ్ మొదలైతాంది. గండ్లకు హఠాత్తుగా ఓ 47 ఏండ్ల రమాబాయి రణవీర్ దూసుకొచ్చింది. గా మారథాన్ పరుగు పందెంల ఉరుకుడు మొదలు...

ఏఐ యుగంలో గెలిచేది మానవ నైపుణ్యమే!?|EDITORIAL

ఉద్యోగార్థులకు ఏఐ గణాంకాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. డిగ్రీ లేదా అనుభవం ఒక్కటే భవిష్యత్తుకు భద్రత ఇవ్వవు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం...

సెప్టెంబర్ 05, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి నవమి రాత్రి 08.54 వరకు ఉపరి దశమి నక్షత్రం మృగశిర రాత్రి 09.39 వరకు ఉపరి ఆరుద్ర యోగం వజ్ర పగలు 01.57 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 10.08 వరకు ఉపరి గరజి రాహుకాలం...

తలుసుకుంటే కాందేంది? నదే శుభ్రమైంది!?|ADUGU TRENDS

గీ డిగ్రీలు సదివే పిల్లలు ఏం ఆలోశిస్తరు? ఆటా, పాటా, అల్లరి, సదువు, కెరీర్ గివే కదా? కనీ గీ పిల్లగాడు గివేవీ ఆలోసించలే.. తమ ఊరి పక్కనుండే పోతున్న నది గురించి...

కొండా కుటుంబం దారెటు!?|EDITORIAL

అనూహ్యం కాకపోయినా, అనివార్యంగా జరిగిపోయింది. పరిణామాల ఫలితాలేమైనా, కొండంత ఆశయం, తన కూతురు, తమ భవిష్యత్తు కోసం కొంత పట్టువిడుపు ప్రదర్శించి ఉంటే, కొండా సురేఖ మంత్రి పదవి నిలిచేదేమో! అయినా కొండా...

సెప్టెంబర్ 04, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శ్రీ కృష్ణాష్టమి తిధి అష్టమి రాత్రి 11.20 వరకు ఉపరి నవమి నక్షత్రం రోహిణీ రాత్రి 11.20 వరకు ఉపరి మృగశిర యోగం హర్షణ సాయంత్రం 05.00 వరకు ఉపరి వజ్ర కరణం బాలవ పగలు 12.30 వరకు ఉపరి...

అధిష్ఠానం నిర్ణయంపై చిన్నారెడ్డి సంచలనం|CHINNA REDDY|CONGRESS

ఒక్క పోటుతో కూల్చేశారు.. పదవులపై నాకు సోకు లేదు తనకు పదవులపై ఎలాంటి ఆసక్తి, వ్యామోహం లేదని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయంగా ఈ స్థాయికి వచ్చానని, అయితే ఒక్క పోటుతో తనను పదవి...

నా బర్తరఫ్‌ చెల్లదు|KONDA SUREKHA|SENSATIONAL COMMENTS

ఈరోజు నాకు జరిగింది.. రేపు మీకూ జరుగుతుంది ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడండి రేవంత్‌ సర్కార్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు....

BREAKING: కొండా సురేఖపై వేటు..చిన్నారెడ్డి ఔట్

సీఎం రేవంత్‌ నిర్ణయం! తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు అధికారిక నోట్‌ వెల్లడించింది. ఈ మేరకు...

కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం..|KONDA SUREKHA|KA PAUL

కాంగ్రెస్‌ను వీడి ప్రజాశాంతి పార్టీలోకి రండి మంత్రి కొండా సురేఖకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బహిరంగ ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీ...

రాజీనామా చేయాల్సిందే.. లేదంటే బర్తరఫ్‌!|KONDA SUREKHA|RESIGN|BURTRAF

కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం.. ఇంటి వద్ద నిర్మానుష్యం పార్టీ లైన్‌ దాటని అనుచరులు  తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌...

ఉద్వాసనమే!|KONDA SUREKHA|CM|REVANTH REDDY|DELHI

సురేఖను పట్టించుకోని అధిష్ఠానం ముక్తసరిగా మూడు ముక్కల్లో ఖర్గేతో మచ్చట అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ కార్యాలయంలోనే రోజంతా పడిగాపులు నిరాశతో వెనుతిరిగిన మంత్రి కొండా సురేఖ ఖర్గే, కేసీలతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా భేటీలు సురేఖ వ్యవహారాన్ని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News