Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

Editorial: మహిళలకు సమానత, సాధికారతే సవాల్!

ప్రతి ఏటా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నా..భారత్‌లో మాత్రం ఇంకా మహిళా సాధికారత తగినంతగా రావడం లేదు. మహిళను ఆట బొమ్మగా, విలాసవస్తువుగానే చూస్తున్నారు. అనేకానేక అవరోధాల మధ్య కూడా తమతమ రంగాలలో శక్తిమంతమైన మహిళగా ఆమె నిరూపించుకుంటూనే ఉంది. వ్యక్తిత్వ హననం జరుగుతున్నా..సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూనే ఉంది. అయితే, మహిళాభ్యుదయమే దేశాభ్యుదయం అని మనమంతా కీర్తిస్తూ వారిని మభ్య పెడుతున్నాం. మహిళా సమానత్వ మే సమాజానికి హితం చెబుతున్న నాయకులు సమాన గౌరవం ఇచ్చి చట్టసభల్లో ప్రవేశించేలా చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు. మహిళల్లో స్ఫూర్తితోపాటు ఆత్మస్థయిర్యాన్ని నింపి వారిని మనతో సమానంగా ముందుకు తీసుకుని వెళ్లడంలో పురుష సమాజం విఫలమయ్యిందనడంలో సదేహం లేదు. ఇక దీనిని సవాల్‌గా తీసుకుని మహిళలే తమ హక్కుల కోసం పోరాడాలని గుర్తుంచుకోవాలి. మరిన్ని కఠిన చట్టాలు తీసుకుని వస్తే తప్ప మహిళలకు రక్షణ కల్పించలేం. హత్యలు, అత్యాచారాల నిరోధానికి పాలకులు కఠినంగా వ్యవహరించడం లేదు. మహిళలను గౌరవించే మనదేశంలో మహిళల కోసం ఏం చేశారంటే ఏవిూ లేదు. ఓ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేయడం మాత్రం అభినందించాల్సందే!. ఘనత వహించిన మోడీకి ఇవన్నీ తెలియనివి కాదు. మహిళా బిల్లును ఆమోదించినా..అది అందని ద్రాక్షగా మిగిలింది. జనాభా లెక్కల సేకరణ తరవాత డీ లిమిటేషన్‌తో దానికి లంకె పెట్టారు. దీంతో మరో రెండుమూడేళ్లు వేచిచూడక తప్పదు. ప్రధానంగా మహిళలకు ఉద్యోగ,ఉపాధి హావిూల్లో పెద్దపీట వేయాలి. అలాగే వారికి ఉచిత విద్యను అందచేయాలి. ఉన్నత చదువులకు వెళ్లే వారికి వడ్డీరహిత రుణాలు అందించాలి. మహిళా సదస్సులు నిర్వహిస్తూ.. మహిళల గురించి గొప్పగా చెప్పుకుంటున్నా, వారి అభివృద్దికి ప్రత్యేక కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. బేటీ పడావో..బేటీ బచావో కేవలం నినాదంగా మారింది. ఆడపిల్లల చదువులకు, క్రీడలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఏవీ అమలు కావడం లేదు.ఆడపిల్లల చదువులకు ప్రత్యేక రుణాలు, వడ్డీలేని పథకాలు అమలు చేసివుంటే బాగుండేది. ఉద్యోగాలు లేవు. చదువుకునే మహిళలకు కనీసం ఫ్రీ చదువులు లేవు. విద్యా రుణాలు తీసుకుంటే కనీసం వడ్డీ మాఫీ గురించి కూడా ఆలోచన చేయడం లేదు. అలాచేసివుంటే బేటీపడావో..బేటీ బచావోకు అర్థం ఉండేది. ఆర్థిక మంత్రిగా ఓ మహిళ ఉన్నా మహిళలకు ప్రత్యేకంగా ఒనగూరుతున్న ప్రయోజనం లేదు. తక్షణం మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంలో అధికార విపక్ష సభ్యులు ఉమ్మడిగా విఫలం అయ్యారు. బిల్లును పాస్‌ చేసినా అమలు కాకుండా అటకెక్కించారు. ఈ బిల్లుతో రాజకీయ లబ్ది పొందానలన్న బిజెపి ఎత్తుగడ మాత్రం ఫలించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఇలా ఏటేటా జరుపుకుంటున్నా…మన నేతల్లో మార్పు రావడం లేదు. చట్టసభల్లో వారికి రావాల్సిన వాటాను కావాలనే ఇంతకాలం అడ్డుకున్నారు. సమాజంలో మహిళలకు ఉన్న అత్యుతన్నస్థాయి గౌరవాన్ని మనమే దిగజార్చుకుంటున్నా పెద్దగా భయపడడం లేదు. చట్టసభల్లో కనీసం వారి అభిప్రాయాలకు విలువ ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ అలా జరగడంలేదు. కేవలం వారికి శుభాకాంక్షలు చెప్పడంతో బడానేతలు తప్పించుకుంటున్నారు. తమ ధర్మాన్ని విస్మరించారు. సమాజం కూడా వారిని ఇంకా విలాసవస్తువుగానే చూస్తున్నది.. అమ్మాయి కనిపిస్తే అత్యాచారం చేయడమే లక్ష్యంగా మృగాళ్లు చెలరేగి పోతున్నారు. వారి గౌరవానికి భంగం కలిగించే అంశాలపై యుద్దం చేయాలి. పురుషాహంకార సమాజాన్ని నిలదీయాలి. నిగ్గదీయాలి. తమ హక్కులను సాధించే వరకు పోరాటాన్ని కొనసాగించాలి.
భారత రాజకీయాల్లో మహిళలు కీలక భూమిక పోషిస్తున్నా, తగినంతగా ప్రోత్సాహం మాత్రం దక్కడం లేదు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఎందుకనో రాజకీయంగా అణగ దొక్కుతున్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ కారణంగా ఎందరో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంటుల్లో మాత్రం రిజర్వేషన్ల దక్కితేనే మరింతగా రాణిస్తారు. వారిని అణచి వేయడం వల్ల 50శాతం జనాభా ఆకాంక్షలను కాలరాస్తున్న వారం అవుతున్నాం. మహిళా సాధికారతతో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పాలన సాగాలి. అన్నిరంగాల్లో మహిళలకు సముచిత భాగస్వామ్యం కల్పించి నప్పుడే సామాజిక ప్రగతి సాధ్యపడుతుంది. అలాగే చదువుకునే అమ్మాయిలకు ఉచిత విద్యా రుణాలు అందాలి. అలాగే వారి ఉన్నత విద్యకు ప్రభుత్వాలు చేయూత నివ్వాలి. బేటీపడావో . . బేటీ బచావో నినాదం కార్యరూపం దాల్చాలి. మహిళలను విలాసవస్తువుగా చూసే సంస్కృతిపై కఠినంగా వ్యవహరించాలి. అత్యాచారాలు, వేధింపులపై కఠినంగా వ్యవహరించేలా చట్టాలు రావాలి. ప్రజాస్వామ్యంలో కేవలం అధికార పక్షమే కాదు ప్రతిపక్షాలకూ, ప్రజలందరికీ పాత్ర ఉంటుంది. ఇది గమనించి అందరూ ముందుకు సాగాలి. మహిళల గొప్పతనాన్ని భారతీయ మహిళల ఆదర్శాలను ప్రముఖంగా ప్రస్తావించిన మన సంస్కృతిని ముందుకు తీసుకుని వెళ్లే క్రమంలో సమాజం వారిపట్ల గౌరవభావంతో సాగాలి. విద్యా,క్రీడా, సాంస్కృతిక రంగాల్లో వారిని ముందుకు నడిపించేలా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలి. అప్పుడే మనం ఆశించిన మహిళాభ్యుదయం సాకారం అవుతుంది. అలాగే మహిళల పట్ట అకృత్యాలకు పాల్పడే మృగాళ్లను కఠినంగా శిక్షించాలి. అవసరమైతే ఉరిశిక్షలకు కూడా వెనకాడరాదు. వరకట్న వేధింపులు వంటివి లేకుండా చూడాలి. పని ప్రదేశాల్లో రక్షణ కల్పించాలి. ఇవన్నీ కూడా అమలుకు కఠిన చట్టాలే శరణ్యం.

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News