పక్రుతి లెక్కనే గీ పపంచం యింతలు, యిశేషాల మయం. రకరకాల యిగ్రహాలను శేసే పద్ధతి ఉన్నట్లే, గా మైనపు బొమ్మలను గదే గా ఓంబత్తి, కొవ్వొత్తితో శేసి, గవాటిని ఓకాడ గదేనుల్లా.. మ్యూజియంల పెట్టేది కూడా ఒకటుంది. గది పపంచంల ఒక్కదగ్గరే ఉండే, గిప్పుడు గది మన దేశంల కూడా పెట్టిండ్రు. గదేందో? ఎక్కడుందో సూద్దాం పదండ్రి.

పపంచంల పసిద్ధి గాంచిన మైనపు విగ్రహాల మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్ లండన్ల ఉంది. ఇగ గసొంటి దాన్ని మన దేశంల కూడా పెట్టిండ్రు. తమిళనాడుల నీలగిరి జిల్లా ఊటీ బోటు హౌస్ ల గా రాస్ట్ర పర్యాటకశాఖ, ఓ ప్రైవేట్ సంస్థ కలిసి గిదీన్ని పెట్టిండ్రు. ఇ గీ మ్యూజియంల పధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, తమిళనాడు సీఎం విజయ్ యిగ్రహాలేగాక, ఇంకో 20 మందికి పైగా గా పేరున్న వాల్ల మైనపు బొమ్మల్ని తయారు శేసి గండ్ల పెట్టిండ్రు. ఇగ గా ఊటీకి పోతే, గయి కూడా సూసి రాండ్రి మరి!

