Saturday, October 10, 2026
32.6 C
Hyderabad

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను అంటరు. గిదీని సంగతేందో సూద్దాం పదండ్రి.

సిగ్నల్ లేదని పోను పక్కన పడేసే రోజులు పోతానయి. సర్కారోల్ల టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ కొత్త సాంకేతికతతోటి ‘శాటిలైట్ పోన్’ను మన దేశంల యిడుదల శేసింది. గిదీని ధరను పన్నులతో కలిపి రూ.1,34,166 గా ఖరారు శేసింది. గీ స్మార్ట్ పోన్ల యుగంల మొబైల్ సిగ్నల్స్ అస్సలు అందుబాటులో లేని మారుమూల పాంతాలు, ఎడార్లు, దట్టమైన అడవులు, సముద్రాల మధ్యల గూడ గీ పోను నడ్తనే ఉంటదట! యేడ పో.. గా పోను కనెక్టివిటీ ఉంటదట!! విపత్తులు వచ్చినప్పుడు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ల మొబైల్ నెట్వర్క్ పూర్తిగ కుప్పకూలినా సరే, గీ ఇన్మార్శాట్ నెట్వర్క్ ఆధారిత శాటిలైట్ పోను ద్వారా అల్కగ వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు శేసుకోవచ్చు. టెక్నాలజీ లెక్కల్ల సూస్తే, గిది మామూలు మొబైల్ టవర్ల సాయం లేకుండనే నేరుగ అంతరిక్షంలోని ఉపగ్రహాల ద్వారా సిగ్నల్స్ అందుకుని పని శేత్తది.

దేశ భద్రత, సురచ్చిత కమ్యూనికేషన్ల కోసం మన సర్కార్ గీ సాటిలైట్ ఫోన్ల ఆడకం మీద మస్తు కఠినమైన ఆంచలు పెట్టింది. గందుకే గీ పోనును ఎవ్వలు పడితే గవాల్లు కొనడానికి యీల్లేదు. గిదీన్ని కేవలం రచ్చణ, సరిహద్దు భద్రతా జవాన్లు, సముద్రయాన పోల్లు, విపత్తుల్ల కాపాడేటోల్లు, గనుల్ల, ఎవ్వలూ పోలేసోట్ల పని శేసేటోల్లు టెలికాం శాఖ నుంచి ముందస్తు అనుమతి తీస్కోవాలె. సాహస యాత్రలు శేసేటోల్లకు కూడ గీ పోనును అమ్ముతరు. గీ పోను సూడ్డానికి పాతదాని లెక్కనే ఉంటది. మస్తు కట్టమైన ఆతావరణంల, బయటి ఒత్తిళ్లను తట్టుకునే యిధంగా ‘రగ్గడ్ డిజైన్’ శేసిండ్రట. గంతే కాదుల్లా..కరెంటు లేని మారుమూల పాంతాల్లో కూడా ఎక్కువ రోజులు శార్జింగ్ అవసరం లేకుండ గూడ గీ పోను పని శేత్తదన్నట్లు. అత్యవసరాల్ల పానాలను రచ్చించేటందుకు గిదీంట్లె ఎస్ఓఎస్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఫీచర్ కూడా ఉందట.

ఇగ గీ పోను కావాల్నంటే, గా కంపెనీ పెట్టిన శరతులకు సరిపోయేటోల్లు, దగ్గర్ల ఉన్న బీఎస్ఎన్ఎల్ ఆపీసుల కలవాలె. లేకపోతే, గా కంపెనీ హెల్ప్ లైన్ నంబర్లకు (94651 01323 లేదా 97688 66652) పోను శేయాలె. గా కంపెనీ శరతుల పారాలను నింపితే, గయన్నీ సూసి మీరు అర్హులైతేనే గా పోను మీకు ఒత్తది. లేకపోతే లేదు. గియన్నీ సరే గనీ, యుద్ధంల లచ్చమనుడు మూర్చపోతే, హన్మంతుడు తెచ్చిన సంజీవని లెక్క గీ శాటిలైట్ పోను ఉపయోగపడతదన్నట్లు.

Latest News

గది ఇల్లా? ఇంగ్లీష్ పుత్తకమా!?|ADUGU TRENDS

యెన్కటికి యిద్దె అంటే గురువు. గురువు శెప్పిందే యిని నేర్సుకునేది. సూపింది సూసి, సేసి తర్పీదు పొందేది. ఇగ తర్వాత్తర్వాత గది పాయే, సారు శెప్పే సదువు కానించి, సారు లేకుండనే సదువుకునే...

ఎల్ నినో.. జల సంరక్షణకు మేల్కొలుపు!?|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని పూర్తిగా నివారించడం మన చేతుల్లో లేకపోయినా, దాని వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవడం మాత్రం సాధ్యమే. వాతావరణ హెచ్చరికలకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించడం, తాగునీటి నిల్వలను పెంచడం, చెరువులు,...

అక్టోబర్ 10, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం మహాలయ అమావాస్య బతుకమ్మ పండుగ తిధి అమావాస్య రాత్రి 08.10 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త రాత్రి 09.45 వరకు ఉపరి చిత్త యోగం ఐంద్ర రాత్రి 11.06 వరకు ఉపరి వైధృతి కరణం చతుష్పాద ఉదయం...

బాబోయ్…! గిదేం థాలీ!?|ADUGU TRENDS

జివ్వకో రుసి, పుర్రెకో బుద్ధి అన్నరు. నాలుక రకరకాల రుసులను కావాలంటది. బుద్ధి కూడా గట్లనే రకరకాల ఆలోశనలు సేత్తది. గట్ల గా ఆలోశలన నుంచి కొత్త రుసులను అందించే, సరికొత్త ఆలోశనే...

నేడే నోబెల్ ప్రకటన…దక్కేదెవరికో!?|EDITORIAL

ప్రపంచ శాంతికి, అంతర్జాతీయ సహకారానికి, సంఘర్షణల పరిష్కారానికి విశేషంగా దోహదపడిన వ్యక్తి లేదా సంస్థను నోబెల్ గుర్తిస్తుంది. కమిటీ నిర్ణయం కేవలం ఒక వ్యక్తి ప్రచారం, రాజకీయ ప్రభావం లేదా నామినేషన్ల సంఖ్య...

అక్టోబర్ 09, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి చతుర్దశి రాత్రి 08.40 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఉత్తర రాత్రి 09.35 వరకు ఉపరి హస్త యోగం బ్రహ్మ రాత్రి 12.34 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 09.12 వరకు ఉపరి...

నానా పటేకర్ ఇక లేరు|NANA PATEKAR|FILM ACTOR

ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) గురువారం ఉదయం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని దవాఖానకి తరలించారు. అయితే...

మూగ జీవాలకో ఫుడ్ కోర్టు!?|ADUGU TRENDS

మూగ జీవాలను మనుసులతో సమానంగ సూత్తం. మంచి మంచి దేవుల్ల పేర్లు పెట్టి పిలుస్తం. గయి మనతో సమానంగ కలిసే జీవిత్తయి. కనీ, గీ మద్దెల గవాటిని పట్టించుకునుడే మానేసినం. గయ్యేమో ఆహారం...

నమో పాతికేళ్ళ అసాధారణ ప్రస్థానం!?|EDITORIAL

నమో పాతికేళ్ల అనుభవం నిజంగానే ఒక గొప్ప ఆస్తి. కానీ ప్రజాస్వామ్యంలో ఆ ఆస్తికి అసలైన యజమానులు ప్రజలే. కాబట్టి ఈ అనుభవానికి తుది కొలమానం అధికారంలో గడిపిన సంవత్సరాల సంఖ్య కాదు....

అక్టోబర్ 08, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి త్రయోదశి రాత్రి 09.40 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పుబ్బ రాత్రి 09.50 వరకు ఉపరి ఉత్తర యోగం శుక్ల రాత్రి 02.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 10.23 వరకు ఉపరి...

‘అన్న’మో రామచంద్రా!?|RICE|FARMER|RICE MILL|STATE|CENTRAL|GOVERNMENT

బియ్యమా? ధరలు పెరుగుతున్న దయ్యమా? ధాన్యం ఉత్పత్తిలో టాప్..ధరల నియంత్రణలో ఫ్లాప్ రైతుకు గిట్టుబాటు-సామాన్యుడికి అందుబాటేది? మిల్లర్ల మాయా? పరిపాలనా వైఫల్యమా? రాష్ట్రమే కాదు, దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి! ధరల పెరుగుదలకు దరిద్రపు కారణాలెన్నో? అన్నపూర్ణ రాష్ట్రంలో ప్రజలు ‘అన్న’మో...

తాటిశెట్టుకు ఇనుప మెట్లు!?|ADUGU TRENDS

తాటి కల్లు మత్తుగున్నది.. నీ బాంచెన్ తాగుతుంటే ఎక్కుతున్నది. అనుకుంటనే గీ కల్లును మస్తుగ తాగుతుంటరు. తెలంగాణలనైతే ఊర్లల్ల ఆడోల్లు కూడా గీ కల్లు తాగుతరు. కనీ, గీ కల్లు గీసుడే మస్తు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News