Tuesday, November 24, 2026
27.2 C
Hyderabad

సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం యోగా!|EDITORIAL

ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ చికిత్స కంటే, నివారణే ఉత్తమమనే సత్యం ఎప్పటికీ మారదు. యోగా అదే నివారణ వైద్యానికి ప్రతీక. మన పురాతన జ్ఞాన సంపదగా ప్రారంభమైన యోగా నేడు ప్రపంచానికి ఆరోగ్య మంత్రంగా మారింది. అందువల్ల యోగాని ఒక వేడుకగా కాకుండా జీవనశైలిగా స్వీకరించడం ద్వారా వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు సమాజ శ్రేయస్సును కూడా సాధించవచ్చు.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ప్రపంచం నేడు ఆరోగ్య సంక్షోభాల సవాళ్ళ మధ్య ప్రయాణం సాగిస్తోంది. జీవనశైలి మార్పులు, మానసిక ఒత్తిళ్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం, సాంకేతికతపై అధికంగా ఆధారపడటం వంటి కారణాలతో అనేక వ్యాధులు మనుషులను వేధిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వేల సంవత్సరాల క్రితం భారత ఋషులు ప్రపంచానికి అందించిన యోగా విద్య మరింత ప్రాసంగికంగా మారింది. శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతౌల్యాన్ని నెలకొల్పే సమగ్ర ఆరోగ్య విధానంగా యోగం నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
భారతీయ సంస్కృతిలో యోగాకి విశిష్ట స్థానం ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల్లో యోగ సాధనకు సంబంధించిన అనేక ప్రస్తావనలు కనిపిస్తాయి. పతంజలి రచించిన “యోగసూత్రాలు” యోగశాస్త్రానికి మూల గ్రంథంగా భావించ బడుతున్నాయి. అనంతరం హఠయోగ సంప్రదాయం ద్వారా ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన విధానాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వచ్చాయి.

యోగం కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. ఇతర వ్యాయామాలు ప్రధానంగా కండరాల బలం, దేహదారుఢ్యంపై దృష్టి సారిస్తే, యోగా శరీరంతో పాటు మనస్సును కూడా ఉత్తేజితం చేస్తుంది. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ముద్రలు, బంధాలు వంటి పద్ధతుల సమన్వయంతో యోగా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. అందుకే దీనిని “హోలిస్టిక్ హెల్త్ సిస్టమ్”గా ప్రపంచ వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోవైపు గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యోగాభ్యాసం ఒత్తిడిని తగ్గించడంలో, శ్వాసక్రియను, రక్తప్రసరణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోందని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. క్రమం తప్పకుండా యోగా చేసే వారిలో ఆందోళన, నిరాశ, నిద్రలేమి సమస్యలు తగ్గుతున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి.

యోగా పట్ల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ దీనికి నిదర్శనం. ప్రస్తుతం 190కి పైగా దేశాల్లో యోగా శిక్షణా కేంద్రాలు పనిచేస్తున్నాయి. కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజూ యోగాభ్యాసం చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో యోగా పరిశ్రమ బిలియన్ల డాలర్ల స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంగా భావించిన యోగా ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మారింది.

యోగాకి అంతర్జాతీయ గుర్తింపు లభించడం భారతదేశానికి గర్వకారణం. 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతిపాదనను చేశారు. ఈ తీర్మానానికి ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల్లో 177 దేశాలు సహప్రాయోజకులుగా నిలవడం విశేషం. అనంతరం 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. 2015 నుంచి ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

జూన్ 21ని యోగా దినోత్సవంగా ఎంపిక చేయడం వెనుక కూడా ప్రత్యేకత ఉంది. ఇది ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలో అత్యధిక పగటి సమయం ఉండే రోజు. ప్రకృతి, జీవనం, శారీరక శక్తి మధ్య సమన్వయానికి ప్రతీకగా ఈ తేదీని ఎంచుకున్నారు.

భారతీయ సంప్రదాయంలో యోగా కేవలం ఆరోగ్య సాధనం మాత్రమే కాదు. జీవన విధానం. పద్మాసనం, సిద్ధాసనం, సుఖాసనం వంటి ధ్యానాసనాలు మనస్సును స్థిరపరుస్తాయి. భస్త్రిక, భ్రామరి, అనులోమ-విలోమ వంటి ప్రాణాయామాలు శ్వాసక్రియను మెరుగుపరుస్తాయి. కపాలభాతి, నౌలి, నేతి వంటి శుద్ధి క్రియలు శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయి. ఈ ప్రక్రియలన్నీ శరీర అవయవాల పనితీరును సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడతాయి.

అయితే, యోగా ప్రాముఖ్యతను ఒకే రోజు నిర్వహించే కార్యక్రమాలకు పరిమితం చేయకూడదు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లక్షలాది మంది ఆసనాలు వేయడం కంటే, యోగాని నిత్యజీవితంలో భాగం చేసుకోవడం మరింత అవసరం. ముఖ్యంగా యువత, ఉద్యోగులు, విద్యార్థులు రోజుకు కనీసం 30 నిమిషాలు యోగాభ్యాసానికి కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరచుకోవచ్చు.

ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ చికిత్స కంటే, నివారణే ఉత్తమమనే సత్యం ఎప్పటికీ మారదు. యోగా అదే నివారణ వైద్యానికి ప్రతీక. మన పురాతన జ్ఞాన సంపదగా ప్రారంభమైన యోగా నేడు ప్రపంచానికి ఆరోగ్య మంత్రంగా మారింది. అందువల్ల యోగాని ఒక వేడుకగా కాకుండా జీవనశైలిగా స్వీకరించడం ద్వారా వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు సమాజ శ్రేయస్సును కూడా సాధించవచ్చు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగాయే సుస్థిర మార్గమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Latest News

మన దేశంల మైనపు యిగ్రహాల మ్యూజియం!?|ADUGU TRENDS

పక్రుతి లెక్కనే గీ పపంచం యింతలు, యిశేషాల మయం. రకరకాల యిగ్రహాలను శేసే పద్ధతి ఉన్నట్లే, గా మైనపు బొమ్మలను గదే గా ఓంబత్తి, కొవ్వొత్తితో శేసి, గవాటిని ఓకాడ గదేనుల్లా.. మ్యూజియంల...

దక్షిణ భారతానికే తలమానికం…|PALAKURTHI|AKHANDA JYOTHI|SLNS TEMPLE

పాలకుర్తి క్షీరగిరిపై నేడే అఖండ జ్యోతి తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలోని పాలకుర్తి పట్టణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శివకేశవులు ఒకే కొండపై పక్కపక్కనే ఉన్న రెండు సహజ సిద్ధమైన గుహల్లో స్వయంభువులుగా కొలువుదీరిన...

సరైన దారులు వెతకాలి!?|EDITORIAL

ధరల పెరుగుదలతో సామాన్యుడి బతుకు భారంగా మారుతోంది. ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం చుక్కలనంటుతున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీ రేట్ల పెంపే పరిష్కారం కాదు. ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వాలు...

నవంబర్ 24, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం కార్తీక పౌర్ణమి అఖండజ్యోతి ప్రజ్వలన సాయంత్రం 06.00గం లకు తిధి శు పౌర్ణమి రాత్రి 08.57 వరకు నక్షత్రం కృత్తిక రాత్రి 12.57 వరకు ఉపరి రోహిణి యోగం పరిఘ సాయంత్రం 05.47 వరకు ఉపరి...

నవంబర్ 23, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 10.43 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం భరణి రాత్రి 02.07 వరకు ఉపరి కృత్తిక యోగం వరీయాన్ రాత్రి 08.45 వరకు ఉపరి పరిఘ కరణం తైతుల రాహుకాలం గరజి ఉదయం...

ప్రజాపాలన పట్టు తప్పుతోందా?|CONGRESS|TELANGANA|CM|REVANTH REDDY

-అడుగు ప్రత్యేకం పార్టీ తప్పటడుగులతో తడబడుతోందా? కాంగ్రెస్ లో ఎందుకీ కస్సు బుస్సులు! సీఎం వర్సెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళపై సిద్ధిపేటలో సీఎం సీరియస్ కాంగ్రెస్ లో వివాద వ్యాఖ్యల కలకలం వాళ్ళ వ్యాఖ్యలు సరే, మరి చర్యలేవి? వారి సామాజికవర్గాలే సమస్యా? సురేఖకు...

రోజుకు 5యేలు! 7ఏండ్లకు జరిమానా!?|ADUGU TRENDS

మనం బ్యాంకుల్ల బాకీలు తెచ్చుకుంటం. ఏదన్న కుద పెట్టకపోతే గవాల్లు గా బాకీలియ్యరు. గట్ల బాకీ తీర్సినంక కుద పెట్టిన పేపర్లియ్యకపోతే గా అదాలత్ ఏం శేసిందో సూడుండ్రి. ఉత్తరప్రదేశ్ ల అలీగడ్ కు...

ఢిల్లీ సుల్తానులు|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|EDUCATION

ఢిల్లీ సుల్తానులు పాలించిన ప్రాంతాలను ఇస్లాం భాషలో సల్తనత్ అంటారు. సల్తనత్ అనగా రాజ్యము అని అర్థం. రాజ్యాన్ని పాలించిన రాజులను సుల్తానులు అంటారు. కాబట్టి ఈ ఢిల్లీ సుల్తానులకు గల మరో...

భారత్ కు సవాల్ గా పాక్, చైనా వ్యూహాలు!?|EDITORIAL

పాకిస్తాన్ కు చైనా అండదండలు. భారత్‌ను చుట్టుముట్టే వ్యూహాలు! డ్రాగన్ ద్వంద్వ నీతిపై అమెరికా నివేదిక సంచలన వ్యాఖ్యలు. ఆసియాలో మారుతున్న శక్తి సమీకరణాలు భారత్‌కు కొత్త సవాళ్లను విసురుతున్నాయి! మార్గం - అడుగు,...

వార/ఈ రోజు రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 22 నుండి నవంబర్ 28 వరకు రాశి ఫలాలు మేష రాశి అనుకున్న పనులను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాల ద్వారా...

వలెయ్యకుండనే శేతికి లచ్చల శేపలు!?|ADUGU TRENDS

ఎన్కటికి వట్టి శేపల కూర వడిపిల్ల మెతుకులని మస్తు తినేటోల్లు. ఇప్పటికీ శేపలంటే కొందరు శెవులు కోసుకుంటరు. రుశికి రుశి, ఆరోగ్యానికారోగ్యం. గా కౌసుకు, ముండ్లకు భయపడ్తరు గనీ, గాదాన్ని కాదంటే, గా...

నగరానికి గోదావరి జలాలు పరిష్కారమేనా?|EDITORIAL

హైదరాబాద్‌కు 40 ఎంజీడీల అదనపు గోదావరి జలాలు అందుబాటులోకి రావడం ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. పైప్‌లైన్ పనులు, ట్రయల్ రన్ విజయవంతమై, నీటి పంపిణీ సమర్థంగా జరగాలి. మరోవైపు వర్షపు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News