Sunday, August 9, 2026
27.8 C
Hyderabad

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు, నేతల ప్రవర్తన, వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలపై మరోసారి చర్చకు దారితీశాయి.
గత కొన్ని దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఉంది. ఇంతకాలం తరువాత సహజంగానే ప్రజల్లో ఆశలు, అసంతృప్తులు రెండూ పెరుగుతాయి. ఎన్నికల్లో ఓడిన లేదా ఫలితాలపై సందేహం ఉన్న పార్టీలు ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తడం కొత్త విషయమేమీ కాదు. భారత ఎన్నికల సంఘంపై విమర్శలూ కొత్తేమీ కాదు. అయితే ఆ ఆరోపణలకు సరైన రుజువులు అవసరం. లేదంటే ప్రజల్లో అపోహలు పెరిగే ప్రమాదం ఉంటుంది.

ఇటీవల దేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున “ఓటు చోరీ”, “ఈవీఎంల దుర్వినియోగం”, “సీట్ల లూటీ” వంటి పదజాలాన్ని ప్రయోగిస్తున్నాయి. ఇలాంటి వాదనలను నిర్ధారించడానికి చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. కోర్టులున్నాయి.

ఇక ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ వంటి నేతలు కూడా ఎన్నికల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తతున్నారు. ఏదో ఒక చోట జరిగినదాన్ని, అనుమానాలను దేశవ్యాప్తంగా రుద్దడం రాజకీయంగా ఆ పార్టీకి లాభదాయకంగా కనిపించినా, మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేస్తుంది.

ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఓడిన నాయకుడు వెంటనే రాజీనామా చేయాలా? లేక చట్టపరమైన పోరాటం చేయాలా? అనే ప్రశ్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రజల తీర్పును గౌరవించడం అన్నది ప్రతి నాయకుడి ప్రాథమిక బాధ్యత. అదే సమయంలో, ఫలితాలపై అభ్యంతరాలు ఉంటే వాటిని రాజ్యాంగబద్ధంగా పరిష్కరించుకోవడం కూడా హక్కే. ఓడినా సరే, రాజీనామానే చేయం అనడం ఎంత వరకు సమంజసం? బహుషా మమత రాజీనామానే చేయననడం ఒక నిరసనగా భావించాలి.

ఇక “ప్రజల తీర్పు ఎంత శక్తివంతం?” అన్నది మరో ప్రశ్న. 60%, 70% లేదా అంతకంటే ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైతే, అది ప్రజల్లో ఉన్న ఆసక్తిని సూచిస్తుంది. ఓటింగులో మహిళలు, యువత భాగస్వామ్యం కూడా పెరుగుతున్నది. ఇది సానుకూలాంశం. ప్రాంతీయ రాజకీయాల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఓటర్లు తరచూ ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. ఎన్నుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య పరిపక్వతకు సంకేతం. ఒక పార్టీపై అసంతృప్తి పెరిగితే, ప్రజలు మార్పు కోరుకోవడం సహజం. అదే సమయంలో, కొత్త రాజకీయ శక్తులకు అవకాశాలు రావడం కూడా ఇదే ప్రక్రియలో భాగం.

ఇక రాజకీయ నాయకుల భాష బరితెగింపులా ఉంది. ఎన్నికల తరువాత భావోద్వేగంతో మాట్లాడటం సహజమే అయినప్పటికీ, వ్యక్తిత్వ హననానికి దిగడం, వ్యక్తిగత దూషణలు చేయడం, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళని తూలనాడటం, రాజ్యాంగ సంస్థలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయాలకు, నాయకులకు కూడా ఆరోగ్యవంతం కాదు. ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ వంటి సంస్థలపై నమ్మకం దెబ్బతింటే, అది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం.

ప్రజాస్వామ్యంలో అసలు శక్తి ప్రజలదే. అత్యంత శక్తివంతులు ప్రజలే. నాయకులు వస్తారు, పోతారు. కానీ వ్యవస్థ నిలబడాలి. ఎన్నికలు కేవలం అధికార పోరాటం కాదు.అది బాధ్యత, జవాబుదారీతనం, నితి నిజాయితీ, నమ్మకాలనే నాలుగు స్తంభాలపై నిలిచే ప్రజాస్వామిక ప్రక్రియ. అందుకే రాజకీయ పార్టీలు, నాయకులు విమర్శలు ఏది పడితే అది విమర్శించడం, ఇష్టానుసారంగా, ఆధారరహితంగా ఆరోపించడం కాకుండా, పరిష్కార మార్గాలను కూడా సూచించాలి.

ప్రజల విశ్వాసం కోల్పోతే ఏ నాయకుడైనా నిలబడలేడు. అదే సమయంలో, ప్రజల తీర్పును గౌరవిస్తూ, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలం.

Latest News

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

సంయమనం కోల్పోతే రాజకీయ సంక్షోభమే!?|EDITORIAL

వ్యక్తిగత విమర్శలు తాత్కాలిక రాజకీయ ప్రచారానికి ఉపయోగపడవచ్చు. కానీ, దీర్ఘకాలంలో నాయకుడి విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. రాజకీయ వారసత్వం కేవలం కుటుంబ నేపథ్యంతోనే రాదు, హుందాతనంతో కూడిన నాయకత్వంతోనే నిలుస్తుంది. మాటలతో సంపాదించేది ప్రచారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News