Tuesday, November 24, 2026
30.2 C
Hyderabad

మేడారం-సమానవత్వానికి సమున్నత ప్రతీక!|EDITORIAL

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రాణం నమ్మకం. శాస్త్రాలు, పురాణాలు, దేవాలయాలు, విగ్రహాలు.. ఇవన్నీ ఆ నమ్మకానికి ప్రతిరూపాలే. అయితే ఈ నమ్మకాన్ని అత్యంత సహజంగా, ప్రకృతితో మమేకమై వ్యక్తపరిచే ఆధ్యాత్మిక ఆచారం ఏదైనా ఉందంటే, అది మేడారం సమ్మక్క–సారలమ్మల గిరిజన జాతరే. ఇది కేవలం ఒక పండుగ కాదు. ఇది ప్రజల విశ్వాసానికి, ప్రకృతి పట్ల గౌరవానికి, సామాజిక సమానత్వానికి నిలువెత్తు ప్రతీక.

మేడారం జాతర ప్రత్యేకత గుళ్ళు కాదు, ఘంటల శబ్దం అంతకన్నా కాదు. ఆర్భాట పూజలు అసలే కాదు. అడవి మధ్యలో, రెండు గద్దెలు, కొద్దిపాటి కుంకుమ, బెల్లం అంతే. ఆ స్థలంలో కోట్లాది మంది హృదయాలు భక్తి పారవశ్యంతో కలిసిపోతాయి. ఇది వ్యవస్థాపిత మతాచారాలకు భిన్నంగా, ప్రజల నుంచే పుట్టిన ఆధ్యాత్మిక ఉద్యమం. అందుకే మేడారం జాతరను ఒక ప్రజాస్వామ్య ఆధ్యాత్మికతగా చెప్పవచ్చు.
సమ్మక్క–సారలమ్మల గాథలో దేవతలకంటే ముందుగా మనకు కనిపించేది మానవత్వం, త్యాగం, పోరాటం. వారు రాజులుగా జన్మించలేదు. ఆలయాల్లో ప్రతిష్ఠింపబడలేదు. అడవిలో పుట్టిన గిరిజన మహిళలు. అయినా, అన్యాయానికి ఎదురు నిలిచిన ధైర్యం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమే వారిని దేవతలుగా మలిచింది. ఈ కథ భారతీయ దేవతా సంప్రదాయంలో ఒక విప్లవాత్మక సందేశాన్ని ఇస్తుంది. దైవత్వం జన్మతో కాదు, గుణంతో వస్తుందని.

కాకతీయుల వంటి శక్తివంతమైన సామ్రాజ్యాన్ని ఎదురించిన కోయ గిరిజనుల పోరాటం చరిత్రలో ఓ మరిచిపోయిన అధ్యాయం. ఆయుధాలు లేని ప్రజలు, రాజ్యాధికారానికి ఎదురు నిలబడ్డారు. ఆ పోరాటంలో ఓడిపోయినా, వారి ఆత్మవిశ్వాసం ఓడలేదు. అదే విశ్వాసం తరతరాలుగా జాతర రూపంలో కొనసాగుతోంది. అందుకే మేడారం జాతర ఒక చారిత్రక స్మృతి, ఒక సామూహిక ఆత్మగౌరవ ప్రదర్శన.

ఈ జాతరలో మరో విశేషం ప్రకృతితో ఉన్న అనుబంధం. చెట్టు, పుట్ట, వాగు, వంక, ఆకు, అడవి అన్నీ పూజా స్థలాలే. ఇది మన ఆధునిక సమాజానికి ఇవ్వాల్సిన కీలక సందేశం. అభివృద్ధి పేరుతో అడవులను నాశనం చేస్తున్న ఈ కాలంలో, మేడారం జాతర ప్రకృతి సంరక్షణకు ఒక నైతిక హెచ్చరికలా నిలుస్తుంది. ప్రకృతిని దైవంగా చూసే సంస్కృతి ఉన్నంతకాలం, మనిషి ప్రకృతిని సంపూర్ణంగా విధ్వంసం చేయలేడు.

ప్రభుత్వాలు మేడారం జాతరను నిర్వహణ పరంగా ఒక పెద్ద సవాలుగా చూస్తున్నాయి. రోడ్లు, తాగునీరు, వైద్యం, భద్రత వంటివన్నీ అవసరమే. కానీ, అభివృద్ధి పేరుతో జాతర ఆత్మను దెబ్బతీయకుండా ఉండటం కూడా మరింత ముఖ్యమైన బాధ్యత. మేడారం జాతరను ఒక టూరిస్ట్ ఈవెంట్‌గా నిర్వహించే, మార్చే ప్రయత్నాల వల్ల దాని సహజత్వం సమూలమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇది గిరిజనుల పండుగ, వారి ఆచారం అనే మూలసూత్రాన్ని మరవకూడదు.

కుంభమేళాతో పోలుస్తున్న మేడారం జాతర సంఖ్యాపరంగా గొప్పదే కావచ్చు. కానీ ఆధ్యాత్మికంగా ఇది భిన్నం. అక్కడ శాస్త్రాల ఆధారం ఉంటే, ఇక్కడ నమ్మకం ఆధారం. అక్కడ పూజారి వ్యవస్థ ఉంటే, ఇక్కడ గిరిజన సంప్రదాయం. ఈ భిన్నత్వమే మేడారాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.
మేడారం జాతర మనకిచ్చే సందేశం సుస్పష్టం. దైవత్వం ఎక్కడో లేదు. ప్రజల మధ్యే ఉంటుంది. శక్తి ఆయుధాల్లో కాదు. విశ్వాసంలో ఉంటుంది. దేవుడు ఆలయాల్లోనే కాదు. అడవుల్లోనూ ఉంటాడు. సమ్మక్క–సారలమ్మలు దేవతలయ్యారు కాబట్టి పూజింపబడటం లేదు. ప్రజల కోసం పోరాడారు కాబట్టే దేవతలయ్యారు. ఇదే మేడారం జాతర అసలైన తాత్త్విక సారాంశం.

Latest News

మన దేశంల మైనపు యిగ్రహాల మ్యూజియం!?|ADUGU TRENDS

పక్రుతి లెక్కనే గీ పపంచం యింతలు, యిశేషాల మయం. రకరకాల యిగ్రహాలను శేసే పద్ధతి ఉన్నట్లే, గా మైనపు బొమ్మలను గదే గా ఓంబత్తి, కొవ్వొత్తితో శేసి, గవాటిని ఓకాడ గదేనుల్లా.. మ్యూజియంల...

దక్షిణ భారతానికే తలమానికం…|PALAKURTHI|AKHANDA JYOTHI|SLNS TEMPLE

పాలకుర్తి క్షీరగిరిపై నేడే అఖండ జ్యోతి తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలోని పాలకుర్తి పట్టణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శివకేశవులు ఒకే కొండపై పక్కపక్కనే ఉన్న రెండు సహజ సిద్ధమైన గుహల్లో స్వయంభువులుగా కొలువుదీరిన...

సరైన దారులు వెతకాలి!?|EDITORIAL

ధరల పెరుగుదలతో సామాన్యుడి బతుకు భారంగా మారుతోంది. ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం చుక్కలనంటుతున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీ రేట్ల పెంపే పరిష్కారం కాదు. ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వాలు...

నవంబర్ 24, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం కార్తీక పౌర్ణమి అఖండజ్యోతి ప్రజ్వలన సాయంత్రం 06.00గం లకు తిధి శు పౌర్ణమి రాత్రి 08.57 వరకు నక్షత్రం కృత్తిక రాత్రి 12.57 వరకు ఉపరి రోహిణి యోగం పరిఘ సాయంత్రం 05.47 వరకు ఉపరి...

నవంబర్ 23, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 10.43 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం భరణి రాత్రి 02.07 వరకు ఉపరి కృత్తిక యోగం వరీయాన్ రాత్రి 08.45 వరకు ఉపరి పరిఘ కరణం తైతుల రాహుకాలం గరజి ఉదయం...

ప్రజాపాలన పట్టు తప్పుతోందా?|CONGRESS|TELANGANA|CM|REVANTH REDDY

-అడుగు ప్రత్యేకం పార్టీ తప్పటడుగులతో తడబడుతోందా? కాంగ్రెస్ లో ఎందుకీ కస్సు బుస్సులు! సీఎం వర్సెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళపై సిద్ధిపేటలో సీఎం సీరియస్ కాంగ్రెస్ లో వివాద వ్యాఖ్యల కలకలం వాళ్ళ వ్యాఖ్యలు సరే, మరి చర్యలేవి? వారి సామాజికవర్గాలే సమస్యా? సురేఖకు...

రోజుకు 5యేలు! 7ఏండ్లకు జరిమానా!?|ADUGU TRENDS

మనం బ్యాంకుల్ల బాకీలు తెచ్చుకుంటం. ఏదన్న కుద పెట్టకపోతే గవాల్లు గా బాకీలియ్యరు. గట్ల బాకీ తీర్సినంక కుద పెట్టిన పేపర్లియ్యకపోతే గా అదాలత్ ఏం శేసిందో సూడుండ్రి. ఉత్తరప్రదేశ్ ల అలీగడ్ కు...

ఢిల్లీ సుల్తానులు|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|EDUCATION

ఢిల్లీ సుల్తానులు పాలించిన ప్రాంతాలను ఇస్లాం భాషలో సల్తనత్ అంటారు. సల్తనత్ అనగా రాజ్యము అని అర్థం. రాజ్యాన్ని పాలించిన రాజులను సుల్తానులు అంటారు. కాబట్టి ఈ ఢిల్లీ సుల్తానులకు గల మరో...

భారత్ కు సవాల్ గా పాక్, చైనా వ్యూహాలు!?|EDITORIAL

పాకిస్తాన్ కు చైనా అండదండలు. భారత్‌ను చుట్టుముట్టే వ్యూహాలు! డ్రాగన్ ద్వంద్వ నీతిపై అమెరికా నివేదిక సంచలన వ్యాఖ్యలు. ఆసియాలో మారుతున్న శక్తి సమీకరణాలు భారత్‌కు కొత్త సవాళ్లను విసురుతున్నాయి! మార్గం - అడుగు,...

వార/ఈ రోజు రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 22 నుండి నవంబర్ 28 వరకు రాశి ఫలాలు మేష రాశి అనుకున్న పనులను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాల ద్వారా...

వలెయ్యకుండనే శేతికి లచ్చల శేపలు!?|ADUGU TRENDS

ఎన్కటికి వట్టి శేపల కూర వడిపిల్ల మెతుకులని మస్తు తినేటోల్లు. ఇప్పటికీ శేపలంటే కొందరు శెవులు కోసుకుంటరు. రుశికి రుశి, ఆరోగ్యానికారోగ్యం. గా కౌసుకు, ముండ్లకు భయపడ్తరు గనీ, గాదాన్ని కాదంటే, గా...

నగరానికి గోదావరి జలాలు పరిష్కారమేనా?|EDITORIAL

హైదరాబాద్‌కు 40 ఎంజీడీల అదనపు గోదావరి జలాలు అందుబాటులోకి రావడం ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. పైప్‌లైన్ పనులు, ట్రయల్ రన్ విజయవంతమై, నీటి పంపిణీ సమర్థంగా జరగాలి. మరోవైపు వర్షపు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News