సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తూ కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ చైర్మెన్, రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ముందుకు వచ్చారు. గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ తండ్రిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసి 25 లక్షల రూపాయల చెక్కును ఫౌండేషన్ తరపున అందించారు.

శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, బాలుడి వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సంఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి మరణించడంపై బాధ వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

ఈ సంఘటన ప్రజల హృదయాలను కదిలించింది. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

